| About us | Contact us | Advertise with us

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - మంత్లీ కరెంట్ అఫైర్స్ - సెప్టెంబర్, 2019 | Current Affairs in telugu - Monthly - September, 2019

మంత్లీ కరెంట్ అఫైర్స్ - తెలుగులో - భరద్వాజ్ కరెంట్ కాలమ్ డియస్సీ, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఎపిపియస్సీ ఎగ్జామ్స్ (గ్రూప్-1, గ... thumbnail 1 summary

మంత్లీ కరెంట్ అఫైర్స్ - తెలుగులో - భరద్వాజ్ కరెంట్ కాలమ్

September Current affairs in telugu
డియస్సీ, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఎపిపియస్సీ ఎగ్జామ్స్ (గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4) పంచాయితీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకం అయిన సబ్జక్టు. ఇటువంటి కరెంట్ అఫైర్స్ కోసం పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు, ఉద్యోగార్ధులు ఎన్నో స్టడీ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ బుక్స్ చదువుతూ ఉంటారు.

అయితే నిష్ణాతులు ఎవరైనా పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు కరెంట్ అఫైర్స్ విషయంలో వివిధ స్టడీ మెటీరియల్స్ ను నమ్ముకోవడం కంటే నిత్యం దినపత్రికలను చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడం సాధ్యం అవుతుందని, కరెంట్ అఫైర్స్ పై పట్టు బిగించాలంటే దినపత్రికలను చదువుతూ వర్తమాన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నపుడు మాత్రమే సాధ్యం అని తెలియచేస్తుంటారు.

కనుక పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి స్టడీ మెటీరియల్ కు బదులుగా దినపత్రికలను నిత్యం క్రమం తప్పకుండా చదివించే చక్కని వ్యూహాన్ని కరెంట్ అఫైర్స్ సబ్జక్ట్ లో నిష్ణాతులు శ్రీ సిహెచ్. భరద్వాజ్ గారి సహకారంతో ‘‘భరద్వాజ్ కరెంట్ కాలమ్’’ పేరుతో నిత్యం వివిధ దినపత్రికలలో కరెంట్ అఫైర్స్ విభాగంలో కీలకం అనిపించే అంశాలను పరిశీలించి వాటిని ఆధారంగా చేసుకుని రూపొందించిన 15 ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ టెస్ట్ ను అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. నిత్యం క్రమం తప్పకుండా దినపత్రికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ పై భరద్వాజ్ కరెంట్ కాలమ్ లోని టెస్ట్ ను రాయడం ద్వారా అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. నిత్యం 15 మార్కులకు గానూ కనీసం 12 మార్కులు సాధించిన అభ్యర్ధి తాను నడుస్తున్న మార్గం సరియైనదే అని నిర్ధారణకు వచ్చిన ప్రిపరేషన్ కొనసాగించవచ్చు.

ఇలా ప్రతిరోజూ నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ లో ప్రచురితమైన భరద్వాజ్ కరెంట్ కాలమ్ ప్రశ్నలతో కూడిన పిడిఎఫ్ లను మంత్లీ సేకరించి నెలవారీగా ఇక్కడ ప్రచురించడం జరుగుతున్నది. ఆలస్యంగా మా వెబ్ సైట్ చూసిన అభ్యర్ధులకు గత నెలల కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యమైన ప్రశ్నలు మిస్ కాకుండా ఉండేందుకు ఇది ఒక చక్కని అవకాశం.


సెప్టెంబర్, 2019 కరెంట్ అఫైర్స్

సెప్టెంబర్, 2019 నెలలో కవర్ అయిన వర్తమాన అంశాలపై ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన సెప్టెంబర్, 2019 భరద్వాజ్ కరెంట్ కాలమ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.



exams.navachaitanya.net