డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా
+ వివిధ వాతావరణ
పరిస్థితులనుంచి రక్షించుకోవడానికి దుస్తులను మనం రక్షణ కవచంగా ఉపయోగించుకుంటాము.
+ దుస్తులను మనం అందంతో
పాటు మన హోదాకు సంకేతంగా కూడా భావిస్తుంటాము.
+ దుస్తులను ఎంపిక
చేసుకోవడంలో వ్యక్తిగత అభిప్రాయానికే విలువ ఎక్కువగా ఉంటుంది.
+ బట్టల కొనుగోలులో మన
రంగు, రూపంతో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా కారణంగా ఉంటుంది.
+ మందంగా, ముతకగా ఉండే
గుడ్డను సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగించే సంచులు, బస్తాలు కుట్టడానికి
ఉపయోగిస్తారు.
+ పుస్తకాల సంచిని
తయారుచేయడానికి ఉపయోగించే గుడ్డ మందంగా, గట్టిగా ప్రత్యేకంగా ఉంటుంది.
+ దుస్తుల తయారీకే
కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీ తెరలు, పుస్తకాల బైండింగ్ లలో కూడా రకరకాల
గుడ్డలను ఉపయోగిస్తారు.
+ బైండింగ్ లో ఉపయోగించే
గుడ్డను కాలికో అంటారు.
+ పాలిస్టర్ గుడ్డకన్నా
నూలుగుడ్డ మందంగా ఉంటుంది.
+ నూలు గుడ్డలు ముతకగా,
బరువుగా ఉంటాయి.
+ ఉతికిన తరువాత నూలు
బట్టలు ముడతలు పడతాయి, కుచించుకుపోతాయి.
+ పట్టుబట్టలను తాకితే
నున్నగానూ, ఉన్నిబట్టలను తాకితే గరుకుగానూ ఉంటాయి.
+ ఉన్ని బట్టలు బరువుగా
కూడా ఉంటాయి.
+ సాధారణంగా సూది
కన్నంలోకి దారాన్ని దూర్చే ప్రయత్నంలో దారాని సన్నగా మారేలా నలపడం, నోటిలో
ఉంచుకుని తడిచేయడం వంటివి చేస్తుంటాము.
+ బట్టల నేతలో ఉపయోగించే
దారాలు రెండు వరుసలలో ఉంటాయి.
+ నిలువు వరుసను పడుగు
అని పిలుస్తారు. అడ్డు వరుసను పేక అని పిలుస్తారు.
+ సాధారణంగా మనం
ఉపయోగించే దారాన్ని పరిశీలించినపుడు సన్నని పీచులు కనిపిస్తాయి.
+ దారంలో కనిపించే ఈ
పీచులను పీచు దారాలు లేదా దారపు పోగులు అంటారు.
+ ప్రతి గుడ్డ దారంతోనే
తయారవుతుంది.
+ నూలు గుడ్డలు నూలు
దారాలతో తయారవుతాయి. నూలు దారాలు పత్తి పీచు దారాలతో తయారవుతాయి.
+ అంటే పత్తి పీచు
దారాలతో పడుగు, పేక దారాలుగా నేస్తే నూలు వస్త్రం తయారవుతుంది.
+ కొన్ని దారాలు పత్రి,
జనుము మొదలైన మొక్కలనుండి తయారవుతాయి.
+ పట్టు ఉన్నిలాంటి
వస్త్రాలను తయారుచేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుంచి తయారవుతాయి.
+ మొక్కలు, జంతువుల
నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు.
+ రసాయన పదార్ధాలతో
చేసిన దారాలలో పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రలిక్ ముఖ్యమైనవి. వీటిని కృత్రిమ
దారాలు అంటారు.
+ రసాయన పదార్థాలను
ఉపయోగించి తయారుచేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు.
+ ఆదిమానవులు చెట్ల
ఆకులు, బెరళ్లు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు.
+ పూర్వపు కాలంలో
లోహాలతో కూడా దుస్తులను తయారుచేసేవారు.
+ యుద్ధంలో పాల్గొనే
సైనికులు ఇనుమువంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు.
+ లోహపు దుస్తులను
చారిత్రక వస్తు ప్రదర్శనశాలల్లో, టెలివిజన్ కార్యక్రమాలలో చూడవచ్చు.
+ పట్టువస్త్రాలు
నునుపుగా, జారే స్వభావం కలిగియుంటాయి.
+ నూలువస్త్రాలు
నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి.
+ కృత్రిమ వస్త్రాలను
కాల్చితే ఘాటైన వాసన వస్తుంది
+ పత్తి, జనుము, ఉన్ని,
పట్టులను సహజమైన దారాలుగా పేర్కొంటారు.
+ పత్తి మనకు ప్రత్తి
కాయలనుంచి లభిస్తుంది.
+ సాధారణంగా ప్రత్తి
నల్లరేగడి నేలలో పండుతుంది.
+ ఆదిలాబాద్, నల్లగొండ,
ప్రకాశం జిల్లాలో ప్రత్తి విస్తారంగా పండుతుంది.
+ పత్తి కాయలలో గల
సన్నని వెంట్రుకల వంటి వాటిని పత్తి పీచుదారాలు అంటారు.
+ పత్తికాయలు బాగా పండిన
తరువాత పగిలిపోయి విచ్చుకుని, తెల్లగా ఉండే ప్రత్తి బయటకు కనిపిస్తుంది.
+ కాయల నుంచి పత్తిని
సేకరిస్తారు.
+ ఇలా కాయలనుంచి
సేకరించిన పత్తి నుంచి దూదిని, గింజలను వేరుచేస్తారు.
+ దూది నుంచి గింజలను
వేరుచేసే ప్రక్రియను జిన్నింగ్ అంటారు.
+ పత్తి కాయల నుంచి
పత్తిని తీసి గింజలను వేరుచేసిన తరువాత సాధారణంగా దానిని దూది అని పిలుస్తారు.
+ దూది పీచులను
దువ్వెనలతో దువ్వి, కడిగి శుభ్రం చేస్తారు.
+ ఇలా శుభ్రం చేసిన
దూదిని దారాలుగా వడకడానికి ఉపయోగిస్తారు.
+ అయితే ఈ దారాలు
వస్త్రాలు నేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు.
+ దారాన్ని బాగా
పురిపెట్టడం ద్వారా, రసాయనాలను పూయడం ద్వారా గట్టిగా తయారు చేస్తారు.
+ ఈ దారాలకు రంగులను
అద్ది వస్త్రాలను తయారుచేస్తారు.
+ ఇలా తయారుచేసిన దారం,
వస్త్రాలను నేయడానికి తగినంత గట్టిగా ఉండవు.
+ చేతితో వడికిన దారం
గట్టిగా ఉండదు కాబట్టి తకిలి వంటి పరికరాలను ఉపయోగిస్తారు.
+ మనదేశానికి
స్వాతంత్ర్యం రాకముందు కాలంలో దారాన్ని వడికేవారు. దీనికి చరఖా లేదా రాట్నమును
ఉపయోగించేవారు.
+ దూది పీచును ఉపయోగించి
నూలుదారాలు తయారుచేయడాన్ని వడకడం (స్పిన్నింగ్) అంటారు.
+ స్వాతంత్ర్యోద్యమ
కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో నేసిన బట్టలే ధరించాలని
పిలుపునిచ్చారు.
+ దీనితో ప్రజలంతా
నూలుబట్టలు ధరించడం ప్రారంభించారు.
+ స్వదేశీ ఉద్యమంలో
భాగంగా విదేశీ వస్తువులను, దుస్తులను తగలబెట్టి దేశభక్తిని చాటుకున్నారు.
+ గోనెసంచులను మందంగా
ఉండే జనపనారతో తయారుచేస్తారు.
+ గోనెసంచులు బరువైన
వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి.
+ పత్తిలాగానే జనపనార
కూడా నేయడానికి ఉపయోగపడుతుంది.
+ జనపనారను బంగారు దారం
అంటారు.
+ జనపనార దారాలు
పత్తిదారాలవలె ఉండక, గట్టిగా, గురుకుగా ఉంటాయి కనుకనే ఇవి బట్టలు నేయడానికి
పనికిరావు.
+ పాలిథీన్ సంచులకు
బదులుగా గుడ్డ సంచులను వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చు.
+ జనుము దారాలను
జనపమొక్కల కాండం నుంచి తయారుచేస్తారు.
+ పూతకు వచ్చిన జనుము
మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజులపాటు నానబెడతారు.
+ ఇలా నానడం వల్ల కాండం
మీద ఉండే బెరడు చీకిపోతుంది. దీనిని వేరుచేస్తారు. దీనినే జనపనార అంటారు.
+ దీనిని యంత్రాలతో
దువ్వి, కడిగి శుభ్రం చేస్తారు. ఇలా తయారైన జనపనారతో గోనెసంచులను తయారుచేస్తారు.
+ పత్తి, జనుముతో
బాటు గోంగూర, వెదురు మొక్కల నుంచి కూడా దారాలు తయారుచేస్తారు.
+ గోగునారతో, చాగమట్టి
(కిత్తనార) నారతో తాళ్లు కూడా పేనుతుంటారు.
+ జనుము, కొర్రలు మొదలైన
మొక్కలనుంచి తీసిన దారాలతో కూడా బట్టలను నేస్తారు.
+ ప్రత్తితో పోల్చినపుడు
జనుము, కొర్ర నారలతో చేసిన దుస్తుల తయారీ చాలా తక్కువగా ఉంటుంది.
+ దూది నుండి వడికిన
దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు.
+ తకిలీలు, రాట్నాలతో
వడికిన దారాన్ని నిలువు (పడుగు), అడ్డు (పేక) వరుసలతో అమర్చి మగ్గాలతో వస్త్రాలు
నేస్తారు.
+ ఇలా పడుగు, పేకలతో
కలిపి వస్త్రాలను నేయడాన్ని నేత నేయడం అంటారు.
+ ప్రస్తుతం యంత్రాలను
ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్దఎత్తున తయారుచేస్తున్నారు.
+ విద్యుత్ సహాయంతో
నడిచే నేత యంత్రాలను ‘మరమగ్గాలు’ అంటారు.
+ ఇళ్లలో
ఏర్పాటుచేసుకుని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించేవాటిని ‘చేనేత మగ్గాలు’
అంటారు.
+ తాటాకు, ఈతాకులతో
చాపలను అల్లుతారు.
+ మన రాష్ట్రంలో చేనేత
పరిశ్రమ గద్వాల్, సిరిసిల్ల, నారాయణపేట, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి,
కొత్తకోటలలో చేనేత పరిశ్రమలున్నాయి.
+ విశాఖపట్నం,
శ్రీకాకుళం జిల్లాలలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి.
+ వరంగల్ తివాచీలు
నాణ్యతకు మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి.