| About us | Contact us | Advertise with us

General Science Practice Bits in telugu - Free Practice Test - 02 | జనరల్ సైన్స్ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ తెలుగులో

General Science Free Practice Tests in Telugu - Practice Test - 02 APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Ju... thumbnail 1 summary

జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో - అన్ని పోటీ పరీక్షలకూ ఉపయుక్తమైనవి

General Science Free Practice Tests in Telugu - Practice Test - 02

APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
general science practice bits



ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) గొడవల్లో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు డిఫెన్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (తేజ్ పుర్) ఘాటైన భారత కారంపొడితో తయారుచేసిన చిన్నపాటి గ్రెనేడ్ ఏది? 2) ప్రాజెక్టు నేత్ర (NETRA) లో భాగంగా ఆప్టికల్ టెలిస్కోప్ లను అందజేయడానికి ఇస్రోకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. అయితే ప్రాజెక్టు నేత్రను విస్తరించండి. 3) డబ్ల్యూహెచ్ఓ ఈ మధ్య భారతదేశాన్ని ‘యాస్’, మోటర్నల్, నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది. ఈ కింది వాటిలో దేని వల్ల ‘యాస్’ వస్తుంది? 4) ఇస్రోకు సంబంధించిన ఏ ప్రయోగశాల పేరును ఇటీవల యూ.ఆర్.రావ్ శాటిలైట్ సెంటర్ గా మార్చారు? 5) ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఎరుపు రంగును వాడుటకు కారణం? 6) ఏ రోగికి డయాలసిస్ చేస్తారు? 7) ఇనుప ముక్క తుప్పు పడితే దాని భారం? 8) కింది వాటిలో ధ్వని గుణం లేనిది? 9) దేనివలన తాజ్ మహల్ రంగుంలో మార్పు కలుగుతుంది 10) జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ 2019, డిసెంబర్ 17న ప్రారంభించారు. జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ కు సంబంధించి సరికానిది ఏది? 11) ఈ కింది వానిలో సరియైన దానిని గుర్తించండి? . . . ఎ) రణపాల ఆకులలో శాఖీయోత్పత్తి జరుగుతుంది . . . బి) అరటి దుంపకాండం ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది. . . . సి) అల్లం, బంగాళదుంప, ఉల్లి, పసుపులో దుంప వేళ్ళ ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది . . . సరియైన సమాధానం ఎంచుకోండి 12) ఇస్రో సహకారంతో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూర్) తయారు చేసిన నానో శాటిలైట్? 13) రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అనే ఉద్దేశంతో 1958 లో ఏర్పాటు చేసిన భారత రక్షణ పరిశోదన సంస్థ 1983 లో సమగ్ర నియంత్రణ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అబ్దుల్ కలాం నేతృత్వంలో దేశంలోని కొన్ని ప్రభుత్వరంగ పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలల సహకారంతో ఏ సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను సాధించింది. 14) కింది వాటిలో ఖరీదైన మూలకం? 15) శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తిని అభివృద్ధి చేయడం, భద్రతతో కూడిన లాభదాయక వనరుగా ఉండే అణుశక్తిని ఉత్పత్తి చేయడం అనే లక్ష్యంతో భారత అణుశక్తి సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Question of

Good Try!
You Got out of answers correct!
That's






exams.navachaitanya.net