| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 14/01/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

January 14 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 14/01/2023
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) హాకీ ప్రపంచ కప్ తొలిరోజు భారతదేశం ఏదేశ హాకీ జట్టుపై ఘనవిజయం సాధించింది. 2) ఇటీవల ఈ క్రింది ఏ మాజీ భారతీయ క్రికెటర్ మరియు BCCI అధ్యక్షుడిపై వచ్చిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదును క్రికెట్ Board Ethics Authority కొట్టివేయడం జరిగింది. 3) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయులకు Sir(లేదా) Madam అని కాకుండా టీచర్ అని మాత్రమే పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. 4) 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ కార్ల టోకు విక్రయాలు ఎంతశాతం పెరుగుదలను చూపుతాయి. 5) ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కారణంగా Apple కంపెనీ CEO టిమ్ కుక్ తన వేతనంలో ఎంత శాతం తగ్గించుకున్నట్లు ప్రకటించారు. 6) సాహిత్యంలో ప్రఖ్యాత అవార్డ్ అయిన మహాకవి కన్హా య్యాలాల్ సేఠియా అవార్డ్ ను ఈ సంవత్సరం ఏ ప్రముఖ కవికి ఇవ్వడం జరిగింది. 7) భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త AD దామోదరన్ ఇటీవల మరణించారు. ఈయన ఈ క్రింది ఏ రంగంలో ప్రసిద్ధిపొందారు. 8) ఇటీవల మరణించిన కర్ణాటక – తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన రైతు K.పాపారావు ఈ క్రింది ఏ పత్తివంగడాన్ని సృష్టించి విజయం సాధించారు. 9) G-20 దేశాల కలయిక తొలిసారిగా ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. 10) ప్రపంచ GDPలో పట్టణాలు, నగరాలు ఎంతశాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. 11) తెలుగురాష్ట్రాలలో నడపనున్న వందేభారత్ ట్రైన్ ను వారంలో ఎన్నిరోజులు నడపనున్నారు. 12) భారత ప్రధాని ప్రారంభించనున్న పర్యాటక నౌక MV గంగావిలాస్ 51 రోజులలో ఎన్ని నదులగుండా ప్రయాణించనుంది. 13) తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పాత ఫించన్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించుకుంది. 14) అమెరికా దేశంలో సెనేటర్ గా ఈ క్రింది ఏ మహిళా భారతీయ అమెరికన్ ఎన్నిక కాబడ్డారు. 15) ఉద్యోగం కోసం భూములు కుంభకోణం కేసులో ఈ క్రింది ఏ రాజకీయనేతను CBI ద్వారా విచారించాలని భారతప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.