October 27 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 27/10/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారత ప్రధాని మోదీ ఇటీవల ఈనాడు పత్రిక రూపొందించిన స్వాతంత్రయోధుల వ్యాసాల గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరును గుర్తించండి.
2) జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
3) FIFA Under 17 World కప్ ఫుట్ బాల్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
4) ఒకేసారి రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం (Moon lighting)ను అనుమతించమని ఏ ప్రముఖ IT కంపెనీ స్పష్టం చేసింది.
5) స్థిరాస్థి కన్సల్టింగ్ సంస్థ Unrock తాజాగా భారతదేశంలోని 7 నగరాల్లో ఎన్ని లక్షల ఇళ్ళ విక్రయాలు నమోదుకావచ్చని వెల్లడించింది.
6) నోటితో పీల్చగలిగే కొవిడ్ టీకాను ఇటివల ఏ దేశం అభివృద్ధి చేసింది.
7) భారత కేంద్ర ప్రభుత్వం పురుగుల మందులకు తయారీకి సంబంధించిన Insecticide Rules చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
8) వీడియో గేమ్స్ ఆడే చిన్నారులకు చురుకైన మెదడు ఏర్పడుతుందని ఏదేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
9) భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయుర్వేద పరిశోధనలకు ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది.
10) భారతదేశ వ్యాప్తంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఆయుష్ కళాశాలలు ఎన్నివేలకు పైగా ఉన్నాయి.
11) భారత జాతీయ ఆయుర్వేద సంస్థ ఏ నగరంలో ఉంది.
12) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యను హిందీ భాషలో ప్రారంభించింది.
13) India-UK దేశాల మధ్య వాణిజ్య విలువ ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల పౌండ్లుగా నమోదవుతోంది.
14) బ్రిటన్ ఎన్నవ ప్రధానిగా భారతీయ మూలాలుకల రిష్ సునాక్ ఇటవల బాధ్యతలు స్వీకరించారు.
15) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఎన్నివేల కోట్లరూపాయల బకాయిలు చెల్లించినట్లు ప్రకటించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.