How to apply for NMMS - Video tutorial
ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్దినీ, విద్యార్ధుల పాలిట వరం NMMS పోటీ పరీక్ష. నవంబర్ లో జరుగబోయే ఈ NMMS పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్ధినీ విద్యార్ధులకు సంవత్సరానికి 12000 రూపాయిల వంతున నాలుగు సంవత్సరాల పాటు, అంటే మొత్తంగా 48,000 రూపాయిల స్కాలర్ షిప్ రూపంలో లభిస్తుంది. పేద, మధ్యతరగతి విద్యార్ధినీ విద్యార్ధులలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో NMMS పోటీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
NMMS పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్దినీ విద్యార్ధుల అప్లికేషన్స్ ఆన్ లైన్ చేసే విధానం, అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ మరియు పూర్తి వివరాలను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (ఫోన్ 9989491671) చక్కని వీడియో రూపంలో తయారు చేయడం జరిగింది. ఈ వీడియోను ఆద్యంతం చూస్తే చాలా సులభంగా NMMS పరీక్ష అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. వారి అనుమతితో నవచైతన్య కాంపిటీషన్స వీక్షకుల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. చూడండి
Here we are trying to post a video which is useful to the students who are preparing for NMMS examination. This video contains the process of uploading photo, editing photo, process of uploading information in NMMS Application in NMMS portal (www.bseap.org). Please share this information to your friends and suggest them to watch to get information about NMMS exam application submission.