| About us | Contact us | Advertise with us

General Science Questions in Telugu | Free Practice Test | జనరల్ సైన్స్ ఫ్రీ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో

General Science Practice Bits in Telugu - Free Online Practice Test జనరల్ సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ Gen... thumbnail 1 summary

జనరల్ సైన్స్ నుంచి 3000 లకు పైగా ప్రశ్నలతో ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఈ పేజిని దర్శించండి.

General Science Practice Bits in Telugu - Free Online Practice Test

General Science Practice bits


జనరల్ సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ General Science Practice Bits - Practice Test లను అందిస్తోంది. ప్రతీ పరీక్షలోనూ 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను అభ్యర్ధులు గుర్తించడం ద్వారా General Science విభాగంపై తమకున్న పట్టును గుర్తించే అవకాశం లభిస్తుంది.
1. General Science Practice Test - 01 - Attempt
2. General Science Practice Test - 02 - Attempt
3. General Science Practice Test - 03 - Attempt
4. General Science Practice Test - 04 - Attempt
5. General Science Practice Test - 05 - Attempt
6. General Science Practice Test - 06 - Attempt

General Science Subject importance in Competitive Exams:

          పోటీ పరీక్షలలో జనరల్ సైన్స్ అనేది ఒక కీలకమైన సబ్జక్టుగా ఉన్నది. APPSC, TSPSC నిర్వహించే Group–1, Group–2, Group–3 (Panchayati Secretary), Group–4, VRO, VRA, Forest Beat Officers, Forest Range Officers, Endowment department EO, Junior cum Computer Assistant వంటి పరీక్షలలోనూ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారి RRB, RRC వంటి పరీక్షలలోనూ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వారి పరీక్షలలోనూ, బ్యాంకింగ్ పరీక్షలు మరియు ఇతర State Level, National Level Competitive Exams లోనూ General Science ఒక ముఖ్యమైన సబ్జక్టు.

Marks Covered from General Science in Various Exams:

          General Studies ఒక సబ్జక్టుగా ఉన్న ప్రతీ పోటీ పరీక్షలలోనూ జనరల్ సైన్స్ విభాగం నుంచి ప్రశ్నలను అడగడం జరుగుతుంది. 150 మార్కులకు జనరల్ స్టడీస్ ప్రశ్నాపత్రాన్ని కూర్చిన సందర్భాలలో సుమారుగా 20 నుంచి 25 వరకూ General Science Questions ఇవ్వడం గమనించవచ్చు. కనుక మొత్తం సబ్జక్టులలో మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉన్న సబ్జక్టుగా General Science ను చెప్పవచ్చు.

Syllabus covered in General Science:

          సాధారణంగా General Science and it applications to the day to day life, Contemporary developments in Science & Technology and information technology పేరుతో జనరల్ స్టడీస్ లో జనరల్ సైన్స్ అనేది ఒక సబ్జక్టుగా ఇవ్వబడుతుంది. Previous papers మరియు వివిధ పరీక్షల యొక్క సిలబస్ ను గమనించినపుడు ఆయా పోటీ పరీక్షలలో క్రింది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు.

        1. Biology

        2. Physics

        3. Chemistry

        4. Science & Technology

General Science Biology Syllabus in Telugu:

        జనరల్ సైన్స్ విభాగంలో Biology ఒక కీలకం అయిన సబ్జక్టు. ఈ సబ్జక్టు కోసం అభ్యర్ధులు 10వ తరగతి స్థాయిలో సైన్స్ పుస్తకాలపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. సాధారణంగా బయాలజీ విభాగంలో క్రింది సిలబస్ పై ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

1) జీవశాస్త్రము పరిచయము

2) జీవుల వర్గీకరణ

3) కణ జీవ శాస్త్రము – వృక్ష కణము, జంతు కణము

4) వృక్ష శాస్త్రము – మొక్కలు వాని శాస్త్రీయ నామాలు – మొక్క యొక్క వివిధ భాగాలు – వాటి విధులు

5) వృక్షశాస్త్రము – కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ప్రసరణ, ప్రత్యుత్పత్తి, విసర్జన వ్యవస్థలు, పోషణ మరియు నియంత్రణ సమన్వయము

6) ఉపయోగకరమైన మొక్కలు – మొక్కలు వాటి ఆర్ధిక ప్రాముఖ్యత

7) జంతు శాస్త్రము – శ్వాసక్రియ, ప్రసరణ, ప్రత్యుత్పత్తి మరియు విసర్జన వ్యవస్థలు

8) ఉపయోగకరమైన జంతువులు – జంతువులు వాటి ఆర్ధిక ప్రాముఖ్యత

9) పోషణ – పోషకాలు – విటమిన్స్ – న్యూనతా వ్యాధులు

10) మానవ శరీర ధర్మశాస్త్రము – జీర్ణ వ్యవస్థ, శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర, కండర వ్యవస్థలు, అంతఃస్రావక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ

11) జ్ఞానేంద్రియాలు – కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము

12) సూక్ష్మజీవ శాస్త్రము

13) వ్యాధి విజ్ఞానశాస్త్రము

General Science Physics & Chemistry Syllabus in Telugu:

        జనరల్ సైన్స్ లో మరొక కీలకమైన సబ్జక్టు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ. 10వ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలలోని ఫిజికల్ సైన్సెస్ సబ్జక్టును చదవడం ద్వారా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగాలపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగాలలో క్రింది అంశాలపై పట్టు సాధించడం ద్వారా మంచి స్కోరు సాధించే అవకాశం లభిస్తుంది.

భౌతిక శాస్త్రము:

1) ప్రమాణాలు-కొలతలు

2) గతిశాస్త్రము

3) తరంగాలు – ధ్వని

4) ఉష్ణము

5) కాంతి

6) అయస్కాంతత్వము

7) విద్యుత్

8) ఆధునిక భౌతిక శాస్త్రము, ఎలక్ట్రానిక్స్

9) ప్రవాహి శాస్త్రము, తలతన్యత, స్నిగ్ధత, కేశనాళికీయత

10) మన విశ్వము – సౌర కుటుంబం

రసాయన శాస్త్రము:

1) మూలకాలు – సమ్మేళనాలు – వివిధ రసాయనాల వ్యవహారిక, సాంకేతిక మరియు రసాయన నామమములు

2) కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్

3) పరమాణు నిర్మాణం

4) మూలకాల వర్గీకరణ

5) లోహ శాస్త్రము

6) కర్బన రసాయన శాస్త్రము

7) రసాయన శాస్త్రము – పరిశ్రమలు

8) ప్రధానమైన వాయువులు – ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ముఖ్య మూలకాలు – సల్ఫర్, నైట్రోజన్, ఫాస్పరస్ మరియు క్లోరిన్

9) కార్బోహైడ్రేట్స్ – ప్రోటీన్స్ – నూనెలు - క్రొవ్వులు

10) ఆమ్లాలు – క్షారాలు – లవణాలు

Best General Science Books in Telugu

        జనరల్ సైన్స్ సబ్జక్టుపై పట్టు సాధించడానికి పాఠ్యపుస్తకాలు ఉత్తమమైనవి. పదవ తరగతి వరకూ గల పాత మరియు కొత్త పాఠ్యపుస్తకాలపై పట్టు సాధించగల అభ్యర్ధి ఏ ప్రశ్నకైనా సమాధానం రాసే అవకాశం లభిస్తుంది. ఇంటర్ మీడియట్ సైన్స్ పై కూడా శ్రద్ధ పెట్టగలిగితే అభ్యర్ధులకు ఇక తిరుగు లేనట్లే. అయితే పాఠ్యపుస్తకాలను చదవడం కష్టంగా భావించే అభ్యర్ధులు మార్కెట్ లో లభించే Best General Science Books ను కొనుగోలు చేసి వాటిని ఆధారంగా చేసుకుని చదువుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో క్రింది general science books for competitive exams in telugu ను కొనుగోలు చేసి చదువుకుంటే సబ్జక్టుపై మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. బుక్స్ కొనుగోలు చేయాలనుకునే అభ్యర్ధులు క్రింది మీకు నచ్చిన పుస్తకం లింక్ పై క్లిక్ చేసి అమేజాన్ నుంచి నేరుగా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు.

        1. SVR Publications General Science Book

        2. Saman Publications General Science Book in telugu

        3. Hi–tech Vijaya Rahasyam General Studies book

General science Study material pdf:

        నవచైతన్య కాంపిటీషన్స్ కు రెగ్యులర్ గా అభ్యర్ధులు General Science Free Study Materials PDF ఉంటే పంపించండి అని అడుగుతూ ఉంటారు. అయితే మిత్రమా మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే Free Study Materials PDF పేరుతో సర్క్యులేట్ అయ్యేవన్నీ జస్ట్ అరా కొరా నాసిరకం మెటీరియల్స్ మాత్రమే. మాకు తెలిసినంత వరకూ ఏ ఒక్క కోచింగ్ సెంటర్ వారూ, పూర్తి స్థాయి General Science Study Material pdf ను రిలీజ్ చేయలేదు. కనుక జనరల్ సైన్స్ పిడిఎఫ్ ల కోసం వెతుకుతూ సమయం వృధా చేసుకోకుండా అందుబాటులో గల ప్రామాణిక పుస్తకాలు కొనుగోలు చేసి వాటిని చదవడం ప్రారంభించండి. General Studies Free PDF Materials పూర్తి స్థాయిలో మిమ్మల్ని విజయతీరానికి చేర్చేవి అయితే అందుబాటులో ఉండవన్న విషయాన్ని మాత్రం గుర్తించండి.

NavaCHAITANYA Competitions WhatsApp Groups:

        పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు రెగ్యులర్ అప్ డేట్స్ అందించడంతో పాటు డైలీ Free Current Affairs online test, Subject–wise Practice Tests, మా పెయిడ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన వివరాలను నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ ల ద్వారా సమాచారం అందిస్తోంది. మీరు కనుక NavaCHAITANYA Competitions WhatsApp Group లో చేరాలనుకుంటే NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి

Click here to join in NavaCHAITANYA WhatsApp Group





exams.navachaitanya.net