| About us | Contact us | Advertise with us

ఎపి టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో | AP TET PAPER-2 (SOCIAL STUDIES) SYLLABUS IN TELUGU

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ – పేపర్  -  2    సోషల్ స్టడీస్   సిలబస్ తెలుగులో ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికార... thumbnail 1 summary


టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ – పేపర్  -  2    సోషల్ స్టడీస్   సిలబస్ తెలుగులో


ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారిక వెబ్ సైట్ లో ఆంగ్లంలో ఉంచిన సిలబస్ నే ప్రామాణికంగా తీసుకోవలసిందిగా మనవి

పార్ట్ – ఎ
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ (30 మార్కులు)

సెక్షన్  - 1 (పెరుగుదల వికాసం)

1. పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము
2. వికాస నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము
3. వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు
4. వికాసంలోని అంశాలు –
1. భౌతిక వికాసం
2.మానసిక వికాసం
3.ఉద్వేగ వికాసం
4.సాంఘిక వికాసం
5.నైతిక వికాసం
6.భాషా వికాసం
5. వివిధ దశలలో వికాసం –
1. శైశవ దశ
2.బాల్యదశ
3.కౌమార దశ
4.వయోజన దశ
6. శిశు వికాస అవగాహన – పియాజీ, కోల్బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ సన్
1. సంజ్ఞానాత్మక సిద్ధాంతం
2. నైతిక వికాస సిద్ధాంతం
3. భాషా వికాస సిద్ధాంతం
4. ఆత్మభావనా సిద్ధాంతం
5. మనో సాంఘిక వికాస సిద్ధాంతం
7. వైయుక్తిక భేదాలు – ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు  సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ఆలోచన
8. మూర్తిమత్వ వికాసం – భావన, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్దాంతాల, మనోలైంగిక వికాస సిద్ధాంతం
9. సర్ధుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు
10. శిశు వికాస అధ్యయన పద్ధతులు
11. వికాసృత్యాలు – ఆటంకాలు *

సెక్షన్ – 2 అభ్యసన

12. అభ్యసనం – భావన – స్వభావం – లక్షనాలు – రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు
13. అభ్యసనా సిద్ధాంతాలు
1. ధార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం
2. పావలోవ్ శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం
3. స్కిన్నర్ కార్యసాధక నిబంధనా సిద్ధాంతం
4. వైగోట్ స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం
5. కోహెలర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం
6. బందూరా పరిశీలనా సిద్దాంతం
14. అభ్యసనా బదలాయింపు, అభ్యసనా బదలాయింపు సిద్దాంతాలు, అభ్యసనా వక్రాలు
15. స్మృతి – విస్మృతి
16. అభ్యసనములో ప్రేరణ పాత్ర
17. అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*

సెక్షన్-3 బోధనా శాస్త్ర అవగాహన

18. బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం
19. విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య
20. బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన
21. వైయుక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనము
22. తరగతి గది సమూహము – నాయకత్వం
23. వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు,
24. బోధనా ప్రణాళ, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన
25. బోధనలోని దశలు – హెర్బార్ట్ సోపానాలు
26. సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు
27. తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం – మంత్రణం
28. అభ్యసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం
29. విద్యా హక్కు చట్టం – 2009, బాలల హక్కులు
30. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005

జనరల్ తెలుగు (30 మార్కులు)

1. పఠనావగాహన
ఎ. అపరిచిత పద్యం
బి. అపరిచిత గద్యం
2. 6 నుంచి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలలోనివి
ఎ. ప్రక్రియలు - లక్షణాలు
బి. కవులు రచయితల పరిచయాలు
సి. విశేషాంశాలు
డి. నేపథ్యాలు,
ఇ. ఇతివృత్తాలు
3. పదజాలం
ఎ. అర్ధాలు
బి. పర్యాయ పదాలు
సి. నానార్ధాలు
డి. వ్యుత్పత్యర్ధాలు
ఇ. ప్రకృతి – వికృతులు
ఎఫ్. జాతీయాలు
జి. సామెతలు
4. భాషాంశాలు
ఎ. పారిభాషిక పదాలు (తత్సమ, తద్భవ, ఆగమ, ఆదేశాలు, కళలు, నిత్యం, వికల్పం. బహుళం, ద్రుత ప్రకృతికాలు, ఉపథ, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి
బి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, ద్రుతప్రకృతిక, సరళాదేశ, గసడదవాదేశ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)
సి. సమాసాలు – నిర్వచనాలు ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు.
డి. ఛందస్సు – వృత్తములు
ఇ. అలంకారాలు – శబ్ధాలంకారాలు (వృత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస) అర్ధాలంకారాలు (ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి)
ఎఫ్. క్రియలు రకాలు – క్త్వార్ధం, చేదర్ధకం
జి. వాక్యాలు – భేదాలు (సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్ధక, ప్రశ్నార్ధక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్ధ వాక్యాలు) ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

జనరల్ ఇంగ్లీష్ (24 మార్కులు)

1. Synonyms
2. Antonyms
3. Homophones
4. Homonyms
5. Spellings
6. Phrasal Verbs (Identifiction of meaning)
7. Word Formation (suffixes and prefixes)
8. One word substitutes (Referring to persons / professions and places)
9. Short form and Full forms
10. Abbreviations and Full forms
11. Helping verbs (Forms, Contractions)
12. Modal Auxiliaries (Form, Function & Contractions)
13. Ordinary verbs (Form, Function & Contractions)
14. Articles
15. Prepositions
16. Clauses (Main clauses, sub-ordinate clauses, Noun clauses, If clause, Relative clauses)
17. Sentence Structures (Basic sentence structures)
18. Degrees of comparison (Form, Function, Construction, Transformation)
19. Language Functions (Language functions with social norms (school and domestic context)
20. Question Tags (Imperatives and statements)
21. Types of sentences
22. Direct speech & Indirect speech
23. Active Voice & Passive Voice
24. Tenses
25. Agreement between subject & Verb
26. Word order In Phrase or a sentence
27. Parts of speech (Nouns, Pronouns, Adjectives, Adverbs, Conjunctions – types and functions
28. Linkers
29. Transformation of Sentences (Simple, compound and complex sentences)
30. Common Errors
31. Punctuation and Capitalization (Use of Capital letters, comma, full stop, question mark and exclamation mark)
32. Writing of Discourses (letter writing, Dairy writing, Description)
33. Dictonary Skills
34. Reading Comprehension.

PART – B
సోషల్ స్టడీస్ కంటెంట్ (48 మార్కులు)

1. భూమి – వైవిధ్యం
మాన చిత్రాల అధ్యయనం, వాటి తయారీ, వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం, దిక్కులు – స్కేలు – పటాలలో సంప్రదాయంగా వాడే గుర్తులు – భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం – దూరాలను కొలవడం – కాంటూరు లేదా సమతల రేఖలు – ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు – ఉబ్బెత్తు నిమ్నోన్నత పటాలు – వివిధ కాలాల్లో పటాలు – ప్రాచీన కాలపు పటాలు – మన కాలంలో పటాల వినియోగం – వివిధ విషయ నిర్ధేశిత (థీమాటిక్) పటాలను చదవడం – అట్లాస్ – గ్లోబు – భూమికి నమూనా – భూమి గ్రిడ్ వ్యవస్థ – అక్షాంశాలు, రేఖాంశాలు – అట్లాస్ ను ఉపయోగించి ఒక ప్రదేశం అక్షాంశ, రేఖాంశాల గురించి తెలుసుకోవడం
సౌరకుటుంబము, సూర్యుడు మరియు భూమి – సూర్యుడు శక్తి వనరు – వాతావరణ ఉష్ణోగ్రత – భూమి ఆవిర్భావం – భూ చలనాలు – రుతువులు – భూమి మీద ఉష్ణోగ్రత మేఖలాలు – భూ చలనాలు – భూ పటలము – భూమి అంతర నిర్మాణము – భూమి యొక్క ప్రాంతాలు
శిలావరణము – ప్రధాన భూస్వరూపాలు – మహాసముద్రాలు మరియు ఖండాలు – విభిన్న లక్షణాలు – ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు -పర్వతాలు, మైదానాలు, ప్లాట్యూలు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో విభిన్న ప్రాంతాలలో ప్రజల జీవన విధానం – ఫలకాలు (టెక్టోనిక్స) – అగ్ని పర్వతాలు – భూకంపాలు – విపత్తుల నిర్వహణ – ఖనిజాలు, గనుల త్రవ్వకం – గనుల త్రవ్వకంలో అనుసరిస్తున్న నూతన పరిణామాలు, పునరుద్దరింపబడే, అంతరించిపోయే వనరులు – భారతదేశ భౌగోళిక స్వరూపాలు – ఉనికి – భూగర్భ నేపథ్యం – ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్
జలావరణము – జలచక్రము – నీటి వనరులు – మహాసముద్రాలు – మహాసముద్రాల ఉపరితలము – లవణీయత – ఉష్ణోగ్రత, మహాసముద్ర ప్రవాహాలు, వనరులుగా మహాసముద్రాలు, అలలు, వనరులుగా మహాసముద్రము, భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ లో నదులు మరియు నీటి వనరులు – భూగర్బ జలము – చెరువులు – భూగర్భజలాలను తిరిగి నింపడం – భూగర్భ జలాల వినియోగం – జల సంరక్షణ, మంచి నీటి ఉపయోగాలు – నీటి హేతుబద్ధ, సమ వినియోగం – ఉమ్మడి వనరుగా నీళ్లు – ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్టు సంరక్షణా చట్టం
వాతావరణము – వాతారవణ విస్తరణ – వాతావరణ పీడన మేఖల, ప్రపంచ పవనాలు – పీడన మేఖలలు – కొరియాలిస్ ప్రభావం – పవనాలు – వాతావరణము మరియు శీతోష్ణస్థితి – వాతావరణము మరియు శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు – భారతదేశంలో కాలాలు – వర్షపాతము రకాలు – భూగోళం వేడెక్కడం, శీతోష్ణస్థితిలో మార్పు – మానవ జనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం, శీతోష్ణస్థితిలో మార్పులు – IPCC – భారతదేశంపై శీతోష్ణస్థితి మార్పుల ప్రభావం
జీవావరణము – సహజ వృక్షజాలం – వివిధ రకాల అడవులు – మానవ సమాజం, పర్యావరణం కాలుష్యము దాని ప్రభావాలు – వనరులు అంతరించిపోవడం – అడవులను ఉపయోగించుకోవడం మరియు సంరక్షించుకోవడం
2. ఉత్పత్తి, వినియమం, జీవనాధారాలు:
ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకూ – ఆది మానవులు – నేటి  వ్యవసాయం – వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం – వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం – భారతదేశంలో వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం – వ్యవసాయ విధానాలు – పంట కాలాలు – ప్రధాన పంటలు – వ్యవసాయం ప్రాముఖ్యత – హరిత విప్లవం – ప్రభావాలు – నీటి సమస్యలు – ఆహార భద్రత – పోషణ స్థితి – PDS – సమానత – సుస్థిర అభివృద్ధి – చేతి వృత్తులు – చేనేత వస్త్రాలు – పారిశ్రామిక విప్లవం – పారిశ్రామిక విప్లవం ప్రారంభం – శక్తి ఆధారాలు, పారిశ్రామికాభివృద్ధి – ప్రపంచీకరణ మరియు మురికి వాడలు – ఫ్యాక్టరీలో ఉత్పత్తి – పనిచేసేవారి జీవనం – ఖనిజాలు మరియు గనులు – జీవనోపాధులు - సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం – వ్యవసాయంలో సాంకేతిక మార్పుల ప్రభావం, భారతదేశంలో పరిశ్రమలు, భారతదేశంలో సేవా కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ – ప్రాధాన్యత - భారతదేశంలో రవాణా వ్యవస్థ, రవాణా విద్య – ఆంధ్రప్రదేశ్, ద్రవ్యము మరయు బ్యాంకింగ్ – ఆర్ధిక అక్షరాస్యత – ద్రవ్యవ్యవస్థ – ఋణము, ధరలు – జీవన వ్యయము – ధరల నియంత్రణలో ప్రభుత్వం పాత్ర – ప్రభుత్వ బడ్జట్ – పన్నులు, ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు – భారతదేశంలో పరిశ్రమలు – పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు – భారతదేశంలో సేవారంగం – గ్రోత్ అండ్ డెవలప్ మెంట్ – భారతదేశపు ఆర్దిక – ఉద్యోగిత -  వ్యవస్థీకృత – అవ్యవస్థీకృత రంగాలు – ఉద్యోగాల కల్పన – ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోలిక – ప్రజలు – నివాస ప్రాంతాలు – భారతదేశంలో పట్టణీకరణ – పట్టణీకరణ సమస్యలు – ప్రజలు వలసలు – వలస తీరులను వర్గీకరించడం, కొలవడం – గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ – ప్రపంచీకరణ – ప్రపంచీకరణకు దోహదం చేసే అంశాలు – భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం – విదేశీ వాణిజ్యం – గ్లోబలైజేషన్ – ఇతర అంశాలు
3. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన – తెగలు, సామాజిక నిర్ణయాధికారం, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం – మహాజనపదాలు – మొదటి సామ్రాజ్యాలు – మౌర్య సామ్రాజ్యం - అశోకుడు – దక్కను లోని రాజ్యాలు – సామ్రాజ్యాలు – కొత్త రాజ్యాలు – రాజులు (7 – 12 శతాబ్ధాలు) – మహ్మద్ గజనీ – చోళులు – కాకతీయులు – ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం – కాకతీయులు – విజయ నగర రాజులు – శ్రీకృష్ణ దేవరాయ – మొఘల్ సామ్రాజ్యం – భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన – 1857 తిరుగుబాటు మరియు వ్యాప్తి – తిరుగుబాటు అనంతరం – బ్రిటీష్, నిజాంల పాలనలో భూస్వాములు, కైలుదార్లు – జాతీయోద్యమం: తొలిదశ 1885 – 1919 – జాతీయోద్యమం: మలిదశ 1919-1947 – భారతదేశంలో జాతీయోద్యమం – దేశ విభజన, స్వాతంత్ర్యం: 1939-47 – స్వతంత్ర్య భారతదేశం – 1937 – 77 – రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ – సామాజిక, ఆర్ధిక మార్పు – విదేశీ విధానం – యుద్దాలు – అత్యవసర పరిస్థితి – స్వతంత్ర భారతదేశం 1977 – 2000
యూరప్ లో మారుతున్న సంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 – మధ్యయుగ ప్రపంచంలో యూరప్ – పునరుజ్జీవనం – మానవతా వాదం – యదార్ధవాదం – మానవ జీవులకు సంబంధించి కొత్త అవగాహన – క్రైస్తవ మతంలో చర్చలు – ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆవిర్భావం – సముద్ర మార్గాల అన్వేషణ – 17వ 18వ మరియు 19వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు – అమెరికా స్వాతంత్ర్యం – ఫ్రెంచి విప్లవం – ఐరోపా దేశాలలో పెల్లుబికిన జాతీయతా వాదం – తిరుగుబాట్లు – 1930, 1948 – జర్మనీ ఏకీకరణ – ఇటలీ ఏకీకరణ – పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు – సామాజిక నిరసనోద్యమాలు – లుద్దిజం – సామ్యవాదం – మహిళా ఉద్యమం – లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలస వాదం -భారతదేశంపై వలసవాద ప్రభావం – ఆదివాసీ తిరుగబాట్లు – బ్రిటీష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం -భారతీయ పరిశ్రమలలో కార్మికులు – సమస్యలు – ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం – 1900 – 1950 – రెండు ప్రపంచ యుద్ధాలు కారణాలు – పోలికలు, తేడాలు - నానాజాతి సమితి – ప్రపంచ యుద్ధాల పరిణామాలు – రష్యాలో సోషలిస్టు విప్లవం – తీవ్ర మాంద్యం – నాజీజం – యుద్ధానంతరం భారతదేశం – ఐక్యరాజ్య సమితి – రెండు శిబిరాలు, ప్రచ్ఛన్న యుద్ధం – అలీనోద్యమం – పశ్చిమ ఆసియా ఘర్షణలు – శాంతి ఉద్యమాలు, యుఎస్ఎస్ఆర్ పతనం – భారతదేశం, దాని పొరుగుదేశాలు
ప్రజాస్వామ్య భారతదేశం – గ్రామ పంచాయితీలు – పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన – రాష్ట్ర శాసన సభ చట్టాల తయారీ – జిల్లాలో చట్టాల అమలు – భారత రాజ్యాంగం – స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణం – పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం – సమాఖ్య వ్యవస్థ – ప్రస్తుత రాజ్యాంగం – భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ – రాజకీయ అక్షరాస్యత – పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం – చట్టం, న్యాయం – సుప్రీంకోర్టు, హైకోర్టు – ఇతర కోర్టులు – విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం – ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన.
4. సామాజిక్య వ్యవస్థీకరణ – అసమానతలు:
మన సమాజంలో వైవిధ్యం – స్త్రీ, పురుష సమానత్వ దిశగా పయనం – కుల వివక్ష – సమానత్వానికై పోరాటం – జీవనాధారం – పట్టణ కార్మికుల పోరాటాలు – కార్మికుల హక్కులు – రక్షణ చట్టాలు – బాలల హక్కులు – RTI, RTE – యంత్రాంగం – లోక్ అదాలత్ – వినియోగదారుల హక్కులు – సమకాలీన సామాజిక ఉద్యమాలు
5. మతం – సమాజం
ప్రాచీన కాలంలో మతం – సమాజం – వేట – ఆహార సేకరణ ఆధారిత సమాజం – తొలి వ్యవసాయదారులు – పశు పోషకులు – సింధులోయ నాగరికత నాటి మతం – సివిలైజేషన్ – వేదాలు – జైనిజం, బుద్దిజం, జానపదులు – మతం – భక్తి – నాథపంథీలు, సిద్ధులు, యోగులు – సూఫీ తత్వం – ఇస్లామ్ – కబీర్ – గురునానక్ – దేవునియందు ప్రేమ, భక్తి – హిందూ మతం – భక్తి ఉద్యమాలు – క్రైస్తవం – ఇస్లామ్ – భగవంతుడి పట్ల ప్రేమ – భక్తి ఉద్యమం – సాంఘిక మత సంస్కరణోద్యమాలు – క్రైస్తవ ప్రచారకులు, ప్రాచ్చ పండితులు – బ్రహ్మ సమాజం – ఆర్య సమాజం – స్వామి వివేకానంద – సాంఘిక సంస్కరణోద్యమాలు – ఆంధ్రప్రదేశ్ – ముస్లిం మహిళలో చదువు – సంఘ సంస్కరణలు – సంఘ సంస్కరణలు – కుల వ్యవస్థ – నారాయణ గురు – జ్యోతీరావు పూలె – డా. బి.ఆర్ అంబేద్కర్ – లౌకికత్వం – అవగాహన
6. సంస్కృతి – సమాచారం
భాష, లిపి, గొప్ప గ్రంధాలు, శిల్పము, కట్టడాలు – ఆధునిక కాలంలో కళలు – కళాకారులు – బుర్రకథ – తోలు బొమ్మలాట – భరతనాట్యం – సినిమా – ముద్రణా మాధ్యమాలు – సినిమా – సమాజంపై మీడియా ప్రభావం – సినిమా, స్వాంతంత్య్రోద్యమం – క్రీడలు, జాతీయత – ఇతర క్రీడలు, వాటి స్థాయి
సోషల్ మెథడాలజీ (12 మార్కులు):
1. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు
2. సాంఘిక శాస్త్రంలో పాఠశాల ప్రణాళిక మరియు వనరులు (NCF-2005, RTE-2009, SCF-2011 – సిలబస్ – అభ్యసనా వనరులు)
3. Social sciences as on integrating area of study: Context and Concerns.
4. సోషల్ సైన్సెస్ అభ్యసనా వ్యూహాలు మరియు పద్ధతులు
5. సాంఘిక (సామాజిక) వనరులు మరియు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల
6. సాంఘిక శాస్త్రము: అభ్యసనా మూల్యాంకన వ్యూహాలు మరియు ఉపకరణాలు
7. మూల్యాంకనము – నిరంతర సమగ్ర మూల్యాంకనం



అభ్యర్దులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సిలబస్ ను తెలుగులోకి అనువదించడం జరిగింది. మాకున్న అవగాహన మేరకు ఈ అనువాదం జరిగింది. కొన్ని సందర్భాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలకు బదులుగా, సమానార్ధకాలను వాడటం జరిగింది. అలాగే అతి కొద్ది పదాలకు తెలుగులో సమానార్ధకాలు లభించనందున యధాతధంగా ఆంగ్లంలో రాయడం జరిగింది.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని తెలియచేస్తున్నాము. అధికారిక సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ఫాలో అవుతూ చదువుకోవలసిందిగా సూచించడమైనది

నవచైతన్య కాంపిటీషన్స్ టెట్, డియస్సీ, ఎపిపియస్సీ పరీక్షలు, గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు ఇతర పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.
మరిన్ని వివరాలకోసం Nava Chaitanya అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.

AP TET PAPER 2A syllabus in Telugu pdf format for mathematics and science and social studies

AP TET paper 2A syllabus for mathematics and science and social studies is available in Telugu in PDF format here. The aspirants of Telugu medium can download the syllabus prescribed by the state government translated in Telugu.

The candidates who want to appear for Teachers recruitment test for the post of school assistant need to to qualify this AP TET paper 2A. The qualifying marks is different for different categories.

APTET PAPER 2A FOR SCHOOL ASSISTANTS

AP TET PAPER 2A is conducted to test the aspirants of the post of school assistant in mathematics, physical science, biology social studies

The school assistant handles the classes from 6th to 10th. 

Navachaitanya.net is an educational portal

Navachaitanya.net is is an educational portal which provides a genuine study material for various competitive exams such as AP TET, TRT, NTPC, RRB etc. 

NAVACHAITHANYA.NET conducts paid online exams and free online tests for the practice of the students appearing for various competitive exams.

Navachaitanya.net also gives a reliable and genuine information regarding the academic notifications and various job notifications.

AP TET paper 2A syllabus for the school assistant for subjects mathematics, physical science, biology and social studies is available in Telugu. You can also download AP TET paper 2A syllabus in Telugu PDF format from here



exams.navachaitanya.net