| About us | Contact us | Advertise with us

6వ తరగతి జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 07. పదార్థాలను వేరుచేయడం | General Science Study Material - 6th Class - Separation of Substances

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 07. పదార్థాలను వేరుచేయడం డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్... thumbnail 1 summary

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 07. పదార్థాలను వేరుచేయడం

పదార్థాలను వేరుచేయడం
డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


6వ తరగతి జనరల్ సైన్స్ – 07. పదార్థాలను వేరుచేయడం
---
+ మన నిత్యజీవితంలో అనేక కలసిపోయి ఉండే పదార్ధాలను వేరు చేయాల్సిన అవసరం ఎదురవుతుంది.
+ బియ్యం లో రాళ్లు ఏరడం, రొట్టెలు చేసే పిండి జల్లించి, పొట్టు, పురుగులు వేరు చేయడం, నీటిలో మలినాలను, టీ డికాక్షన్ నుంచి టీ పొడిని వేరు చేయడం ఈ రకమైనదే.
+ ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉన్న పదార్థాలను మిశ్రమాలు అంటారు.
+ ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి.
+ మట్టి వంటి కొన్ని మిశ్రమాలు సహజంగా లభిస్తాయి.
+ నిమ్మరసము, లడ్డూ వంటి కొన్ని మిశ్రమాలను మనం తయారుచేసుకుంటాము.
+ పదార్థాల ధర్మాలను ఉపయోగించి మనకు కావలసిన వస్తువులను, అవసరం లేని వస్తువుల నుంచి సులభంగా వేరుచేయవచ్చును.
+ బియ్యం నుంచి, పప్పుల నుంచి రాళ్లను ఏరివేసే పద్ధతిని ఉపయోగించి వేరుచేస్తారు.
+ కంటితో చూడటం, రూపం, రంగు వంటి వాటిలో భేదం ఉండటం వంటి సందర్భాలలో చేతితే ఏరివేసే పద్ధతిని ఉపయోగిస్తుంటారు.
+ తాజా పండ్ల నుంచి పాడైన పండ్లను తీసివేయడం, ఆపిల్ పండ్ల నుంచి కమలాలను వేరు చేయడం వంటివి ఏరివేసే పద్ధతికి ఉదాహరణలే.
+ రైతులు తమ పంటను నూర్చినపుడు ధాన్యం గింజలతో పాటు ఊక, తాలు కూడా కలసి మిశ్రమంగా ఉంటాయి.
+ గాలి బలంగా వీచే సమయంలో ఎత్తైన బల్ల మీద నిలబడి, ధాన్యం, ఊక, తాలుల మిశ్రమాన్ని చేటలతో నెమ్మదిగా పోస్తుంటారు.
+ బరువైన ధాన్యం గింజలు అక్కడే పడుతుంటాయి. తేలికగా ఉండే ఊక, తాలు ఇతర చెత్త గాలికి దూరంగా పోయి వేరుపడతాయి.
+ ఈ విధానమును తూర్పారపట్టడం అంటారు.
+ ధాన్యంతో పోల్చినపుడు ఊక, తాలు తేలికగా ఉంటాయి కనుక ఈ ‘తూర్పార పట్టడం’ పద్ధతిని ఉపయోగిస్తాము.
+ నీటిలో ఉప్పును కలిపినపుడు అది కరిగిపోతుంది. కానీ నీటిలో మట్టిని కలిపినపుడు అది కరుగక, అడుగుకు చేరుతుంది.
+ మట్టి నుంచి నీటిని తేర్చడానికి ఉపయోగించే పద్ధతి తేర్చడం.
+ తేర్చిన తరువాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరుగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా వేరే గ్లాసులోకి వేరు చేయాలి.
+ ద్రవ పదార్థాలలో కరుగని పదార్ధము కలిసియున్నపుడు తేర్చుట అనే పద్ధతిని ఉపయోగించవచ్చు.
+ టీ పొడిని, డికాక్షన్ నుంచి వేరు చేయడానికి వడపోయడం అనే పద్దతిని ఉపయోగిస్తారు.
+ టీ పొడిని, డికాక్షన్ నుంచి వేరు చేయడానికి ఉపయోగించేది సిబ్బిగంటె లేదా జాలీ.
+ పిండి నుంచి పొట్టు కణాలను వేరు చేయడానికి జల్లెడను ఉపయోగించి జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
+ కొన్ని కణాలు పెద్దవి, కొన్ని చిన్నవి కలిసిపోయి ఉన్న సమయంలో ఈ జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
+ ఎర్రమట్టి నుంచి ఇకను వేరు చేయడానికి కూడా జల్లెడలను ఉపయోగిస్తుంటారు.
+ రైతులు జల్లెడను ఉపయోగించి, పెద్ద ధాన్యపు గింజలను, చిన్న ధాన్యపు గింజలను వేరుపరుస్తుంటారు.
+ ఇలా వేరు చేసిన పెద్ద గింజలను ఎక్కువ రేటుకు అమ్మడం కానీ లేదా విత్తనాలుగా ఉపయోగించడం గానీ చేస్తారు.
+ వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి.
+ దీనినుపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు.
+ వడపోత కాగితానికి ఉండే రంధ్రాలు చాలా సూక్ష్మమైనవి. ఇవి కంటికి కూడా కనిపించనంత చిన్నవి.
+ ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన భాష్పీభవనం చెందిస్తారు.
+ సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపి, గాలికి, సూర్యరశ్మికి ఉంచడం మూలంగా నీరు భాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.
+ రోగులకు ఇంజక్షన్ చేయడానికి మందు పౌడర్ కు కలిపే జలము స్వేదన జలము.
+ నీటిని ఒక శాంకవ కుప్పెలో వేడిచేసి, ఆవిరిగా మారిన స్వచ్ఛమైన నీటిని వేరొక పాత్రలో చల్లబరచడం ద్వారా స్వేధన జలమును పొందవచ్చు.
+ ఒక మిశ్రమం నుంచి వేరు వేరు అనుఘటకాలను వేరు చేయడానికి వాటి రంగు, ఆకారము, పరిమాణము, భారము, ద్రావణీయత వంటి ధర్మాలలో గల వ్యత్యాసాలను మనం ఉపయోగించుకుంటాము.
+ కర్పూరము, ఉప్పు మిశ్రమాన్ని ఉత్పతనం చెందించే పద్ధతిలో వేరుచేస్తారు.
+ ఏదైనా పదార్ధము నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘనరూపంలోకి మారే ప్రక్రియను ‘ఉత్పతనం’ అంటారు.
+ కర్పూరము, అయోడిన్ వంటివి ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణలు.
+ వేరుచేయడంలో ఒక వినూత్న పద్ధతి క్రొమెటోగ్రఫీ
+ రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి క్రొమెటోగ్రఫీ.
+ వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తమలో ఇముడ్చుకుంటుంది. వీటిని వేరు చేసే పద్ధతినే క్రొమెటోగ్రఫీ అంటారు.
+ కొన్ని సందర్భాలలో ఒక మిశ్రమంలో ఉన్న వేరు వేరు పదార్థాలను వేరు చేయడానికి ఒకే ఒక పద్దతి సరిపోదు. అటువంటి సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించాల్సియుంటుంది.
+ పదార్థాలను వేరు చేయడమనేది చాలా ముఖ్యమైన శాస్త్రీయ ప్రక్రియ.
+ పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నపుడు చేతితే ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
+ కొన్ని తేలికైనవి, మరికొన్న బరువైనవి గల పదార్థాలు కలిసిన మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పార పట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
+ ఒక ద్రవంలో కరుగని పదార్థాలు ఉన్నపుడు వాటిని వేరుచేయడానికి తేర్చడం, తేర్పిపోత ప్రక్రియలను ఉపయోగిస్తారు.
+ ఒక మిశ్రమంలో చిన్నవి, పెద్దవి పదార్థాలున్నపుడు వాటిని జల్లించడం ద్వారా వేరుచేయవచ్చు.
+ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్పటికీకరణము పద్ధతిని ఉపయోగిస్తాము.
+ నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనము అనే పద్ధతిని ఉపయోగిస్తారు
ఇవి కూడా . . .
+ కర్పూర వృక్షం (సిన్నమోమం కాంఫోరా) చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారుచేస్తారు.
+ ఉప్పు, పటిక మొదలైన స్పటికాలలో కూడా నీరు ఉంటుంది. దీనినే స్పటిక జలము అంటారు
+ ఇసుక, కంకర, సిమెంట్ లను తగిన పాళ్లలో కలిపి ఇనుప వలలలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు.
+ జోర్డాన్ దేశంలో ఉన్న మృతసముద్రంలో నీటిమీద మనం సులభంగా తేలియాడవచ్చు.
+ తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినపుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి.
+ భూమిలో ఉండే ఇసుక, రాతిపోరలగుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి.
+ రాజస్థాన్ లోని ‘సాంబార్ సరస్సు’ మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.
+ మనం ఎక్కువకాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీర్ణక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం
+ ఘనస్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను ‘డ్రై ఐస్’ అంటారు.


exams.navachaitanya.net