| About us | Contact us | Advertise with us

6వ తరగతి జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 01 మన ఆహారం | General Science Study Material - 6th Class - Our Food

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 01. మన ఆహారం డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ... thumbnail 1 summary

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 01. మన ఆహారం

డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

6వ తరగతి జనరల్ సైన్స్ – 01. మన ఆహారము
---


+ అరటి పండులో మన శరీరానికి పనికివచ్చే పొటాషియం అనే పదార్ధము ఉంటుంది.
+ ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో ప్రతి రోజూ భోజనంలో అన్నము, పప్పు, కూరలు వంటి ఆహారపదార్ధాలు భాగంగా ఉంటాయి.
+ అన్నం వండటానికి కేవలం బియ్యం, నీరు సరిపోతాయి. కానీ బిర్యానీ చేయాలంటే ప్రత్యేకమైన దినుసులు అవసరం అవుతాయి.
+ ఖాళీ కడుపుతో అరటిపండును తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులు (ప్రోటీన్స్) గల ఆహారంతో కలిపి తినాలి.
+ ఆహారాన్ని తయారుచేయడానికి ఉపయోగించే పదార్ధాలను ‘దినుసులు’ అంటారు.
+ నిలువచేసిన ఆహారపదార్ధాలు (బిస్కెట్లు, శీతలపానీయాలు) ఉండే డబ్బాలపై అందులోని దినుసుల వివరాలు రాసి ఉంటాయి.
+ మనకు మొక్కల నుండి కూరగాయలు, పండ్లు లభిస్తాయి.
+ జంతువుల నుండి గుడ్లు, పాలు, మాంసము లభిస్తాయి.
+ కాఫీలో ఉండే ‘చికోరి’ జీర్ణ వ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
+ గొర్రెల నుంచి మాంసము, పాలు లభిస్తాయి.
+ కోళ్లు, బాతుల నుంచి మాంసము మరియు గుడ్లు లభిస్తాయి
+ మొక్కలలో వివిధ భాగాలను ఆహారంగా తీసుకుంటాము
  - పాలకూర, కొత్తిమీర మొక్కలలో ఆకులను ఆహారంగా తీసుకుంటాము.
  - గోబి మొక్కలో (కాలీ ఫ్లవర్) పువ్వును ఆహారంగా తీసుకుంటాము.
  - టమాటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాము.
+ బీట్ రూట్ లో పిండి పదార్దాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి తరచుగా వాటిని తినడం మంచిది.
+ బిర్యానీ తయారుచేయడానికి ఉపయోగించే వంట దినుసులైన ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలను ‘సుగంధ ద్రవ్యాలు’ అంటారు.
+ పాయసం తయారుచేయడానికి ఉపయోగించే జీడిపప్పు, బాదం, కిస్ మిస్ ల వంటి వాటిని ఎండిన పండ్లు (డ్రైఫ్రూట్స్) అంటారు.
+ డ్రైఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతాయి కనుక ఎక్కువ పరిమాణంలో లభించవు మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి.
+ బఠానీలలో మాంసకృత్తులు సంవృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు.
+ మొక్కలోని వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తాము.
+ ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు ఆహారంగా విరివిగా ఉపయోగించే మొక్క యొక్క భాగాలు.
+ కాండాలు, పువ్వులు తక్కువగా ఆహారంగా ఉపయోగించే మొక్క యొక్క భాగాలు.
+ వంట చేయడానికి అవసరం అయిన అనేక దినుసులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుంచి లభిస్తాయి.
+ ఒక ప్రాంతంలో పండే పంటలు, ఆ ప్రాంతపు భౌగోళిక, శీతోష్ణ పరిస్థితులపై ఆధారపడతాయి.
+ మన ప్రాంతంలో గోధుమలతో, మొక్కజొన్నలతో పోల్చితే బియ్యం, బియ్యపు ఉత్పత్తులను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాము.
+ రాజస్థాన్ ప్రాంతంలో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి.
+ రాజస్థాన్ ప్రాంతంలో అన్నం బదులుగా చపాతీలు లేదా రొట్టెలను ప్రధానంగా ఆహారంగా ఉపయోగిస్తారు.
+ ఆహారాన్ని తయారుచేయడానికి ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడం, ఎక్కువ/తక్కువ నూనెలో వేయించడం, చాపింగ్, మిక్సింగ్, కటింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తుంటారు.
+ ఆహారపు రుచి వంట చేసే విధానం మీదా, వంటకు ఉపయోగించే దినుసుల మీద ఆధారపడి ఉంటుంది.
+ ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడే పదార్ధాలు
+ చిలకడదుంపలలోని రక్తాని శుద్ధి చేసే పదార్ధాలు లేదా కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి.
+ వండిన కూరలు కొద్ది రోజులు బయట ఉంచితే చెడిపోతాయి. కానీ పచ్చళ్లు, ప్రత్యేకంగా తయారుచేసిన కొన్ని పదార్దాలు ఎక్కువకాలం చెడిపోకుండా ఉంటాయి.
+ ఆహార పదార్ధాలు ఎక్కువకాలం నిలువ ఉండటానికి కారణం వాటిని నిలువ చేసే పద్ధతులే.
+ కొన్ని ఆహార పదార్దాలను ఎక్కువ రోజులు నిలువ చేయడానికి ఉప్పు పూసి ఎండబెట్టే పద్ధతిని ఎంచుకుంటారు.
+ కొన్ని ప్రాంతాలలో చేపలను ఎండబెట్టి నిలువ చేస్తారు.
+ కూరగాయలు, మాంసము వంటివి కూడా ఎండబెట్టి, పచ్చళ్లు చేసి నిలువ చేస్తారు.
+ పచ్చళ్లు నిలువ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు.
+ తీరప్రాంతాలలో చేపలను నిలువ చేయడానికి వాటికి పొగబెట్టే పద్ధతి సర్వసాధారణంగా కనిపిస్తుంది.
+ చక్కెర పాకం, తేనెను పండ్లను నిలువ చేసే పదార్దాలుగా వినియోగిస్తారు.
+ పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిలువ చేస్తారు.
+ టమాటాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
+ టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.
+ మార్కెట్ లో దొరికే నిల్వ చేసిన ఆహార పదార్ధాలలో హానికరమైన రసాయనాలు ఉంటాయి.
+ ప్యాకెట్ లో నిల్వ చేసిన ఆహారపదార్దాలను కొనుగోలు చేసే ముందు వాటిలో ఉపయోగించిన దినుసులను, తయారుచేసిన తేదీని విధిగా పరిశీలించాలి.
+ కాలం చెల్లిన ఆహార పదార్ధాలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
+ కూరగాయలను, పండ్లను వివిధ రకాల ఆకారాలలో, డిజైన్లలో అందంగా అలంకరించే కళను ‘వెజిటబుల్ కార్వింగ్’ అంటారు.
+ ‘సాలడ్’ అనే పదము ‘సాలటా’ అనే లాటిన్ పదము నుంచి వచ్చింది.
+ సాలటా అనే పదానికి అర్ధము ఉప్పు
+ ఆహారపు రుచి అందులో ఉపయోగించిన వంట దినుసులు, తయారుచేసే పద్ధతి మరియు ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది.
+ ఆహారపదార్ధాలను నిలువ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.


ఇవి కూడా . . .
+ అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్ధము ఉంటుంది.
+ ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మంసకృత్తులున్న పదార్ధంతో కలిపి తినాలి.
+ ‘చికోరి’ జీర్ణవ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకూ మేలు చేస్తుంది.
+ బీట్ రూట్ లో పిండి పదార్ధాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది
+ బఠానీలలో మాంసకృత్తులు సమృద్దిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు.
+ ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మనలను రోగాలబారినుంచి కాపాడే పదార్ధాలు
+ చిలగడదుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్ధాలు (కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు) ఉంటాయి.
+ టమాటాలలో విటమిన్ సి అనే పదార్ధము ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇదిరోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది.
+ సాలడ్ అనే పదము ‘సాలటా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలటా అంటే ఉప్పు అని అర్ధం
+ ఆహార పదార్ధాలను నిలువచేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగులవల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి
exams.navachaitanya.net