| About us | Contact us | Advertise with us

నవచైతన్య కాంపిటీషన్స్ కు 14 రోజుల విరామం - కారణం ఏమిటి మిత్రమా?

ఏమైపోయారు రిప్లై పంపడం లేదు ఎందుకు? కరెంట్ అఫైర్స్ పంపడం లేదు ఎందుకు? డైలీ వీడియోలు అన్నారు పెట్టడం మానేశారు? షెడ్యూల్ ప్రకటించడం ఎందుకు - ప... thumbnail 1 summary

ఏమైపోయారు
రిప్లై పంపడం లేదు ఎందుకు?
కరెంట్ అఫైర్స్ పంపడం లేదు ఎందుకు?
డైలీ వీడియోలు అన్నారు పెట్టడం మానేశారు?
షెడ్యూల్ ప్రకటించడం ఎందుకు - పరీక్షలు ఇవ్వలేకపోవడం ఎందుకు?

ఇలా ఎన్నో ప్రశ్నలు . . . 
కానీ సమాధానం ఇవ్వడానికి నాకు అవకాశం ఇప్పటి వరకూ చిక్కలేదు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా మీకోసం నా సమాధానం . . .

మిత్రమా,
నేను మీ చైతన్య కుమార్ సత్యవాడ . . . 
గత నెల చివరి వారంలో నేను ఏలూరు వెళ్లి వచ్చాను - ఆ తరువాత రెండు రోజులు కంప్యూటర్ వర్క్ అధికంగా ఉండటం వల్ల ఓ పూట తలనొప్పిగా అనిపించడం, మరుసటి రోజు ఉదయం జ్వరం లేదు కానీ థర్మామీటరు ఎదురుగా ఉందని జస్ట్ చెక్ చేసుకుంటే 102 ఫారన్ హీట్ జ్వరం ఉండటంతో డాక్టర్ ను సంప్రదించాను.
బ్లడ్ టెస్ట్ చేసి
ఏలూరు వెళ్లి వచ్చానంటున్నారు కనుక కరోనా టెస్ట్ చేయించుకోండి అంటూ సలహా ఇచ్చి ఓ గంటలోనే ప్రభుత్వాసుపత్రిలో శాంపిల్ ఇచ్చేలా ప్రోత్సహించారు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్న తరువాత ఆ సాయంత్రానికే నాకు జ్వరం తగ్గిపోయింది. కానీ ఓ మూడు రోజుల తరువాత నేను 1వ తేదీన ఇచ్చిన శాంపిల్ తాలూకు రిపోర్ట్ వచ్చింది
ఆ రిపోర్ట్ సారాంశం ఏమంటే . . . 
కరోనా టెస్ట్ లో నాకు పాజిటివ్ వచ్చింది అని
నిజమే లెండి - ఇప్పటి వరకూ నేను జీవితంలో రాసిన ఏ టెస్ట్ అయినా పాస్ కావడమే కానీ ఫెయిల్ కావడం లేదు - బహుశా ఆ క్రమంలోనే కరోనా టెస్ట్ లో కూడా పాసై, పాజిటివ్ తెచ్చుకున్నట్లున్నాను . . . .
ఒకపూట భయం వేసింది కానీ . . .  ఆ తరువాత బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాతో ధైర్యం వచ్చింది.
ఏ లక్షణాలు లేవు
శరీరంలో ఏ అలసటా లేవు
జలుబు, దగ్గు వంటివి అసలే లేవు
కనుక డాక్టర్ గారు, హెల్త్ అసిస్టెంట్ గారూ మరియు ANM ల సలహా మేరకు ధైర్యం తెచ్చుకున్నాను
డాక్టర్ ఇచ్చిన మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ తో పాటు, జ్వరం, జలుబు వంటివి రాకుండా, లోపల ఉన్న వైరస్ స్థాయి తగ్గడానికి ఇచ్చిన మందుబిళ్లలను వేసుకుంటూ పూర్తిగా హోమ్ ఐసోలేషన్ లో నా గదికి పరిమితం కావడం జరిగింది. ఈ క్రమంలోనే రెస్ట్ కావాలనిపించి పూర్తిగా కంప్యూటర్ వర్క్స్ కు దూరం కావడం జరిగింది
అలాగే మా టీమ్ కూడా ఈ కరోనా సమయంలో ఎందుకైనా మంచిదని ఒకరికి ఒకరం దూరం కావడం గా ఉండటం, ప్రస్తుతం కంప్యూటర్ వర్క్ చేసే టీమ్ మొత్తం పనికి దూరంగా ఉండటం మూలంగా రెగ్యులర్ గా నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి అందాల్సిన అన్ని సర్వీసులను పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది


బహుశా నా జీవితంలో
నవచైతన్య కాంపిటీషన్స్ కు దూరంగా ఉండటం
ఇన్ని మందులను మింగడం
ఇదే తొలిసారి.

మొత్తంగా
ఆరోగ్యం నిలకడగానే సాగింది. ఏ లక్షణాలు లేకుండా, ఏ శారీరక ఇబ్బందులు లేకుండా నేటితో పద్నాలుగు రోజులు గడిచాయి. అందుకే క్రమంగా మళ్లీ నవచైతన్య కాంపిటీషన్స్ ప్రయత్నాలను టీమ్ సహకారంతో పట్టాలెక్కించడం ప్రారంభించాము.

మధ్యలో నిలిపి వేయబడిన గ్రామ సచివాలయం లైవ్ వీడియో పరీక్షలు రేపటి నుంచి సాయంత్రం గం. 6.30 నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతాయి.
అలాగే రెగ్యులర్ వీడియో షెడ్యూల్ కూడా త్వరలోనే పునఃప్రారంభించడం జరుగుతుంది.

ఈ రోజు నుంచి భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ సందేశాలను కూడా ప్రారంభించడం జరుగుతుంది.


మీ అందరి ప్రోత్సాహంతో
నవచైతన్య కాంపిటీషన్స్ టీమ్ సహకారంతో
మళ్లీ
నవచైతన్య కాంపిటీషన్స్ పునరుత్తేజంతో పనిచేస్తుందని తెలియచేస్తూ
మీ
చైతన్య కుమార్ సత్యవాడ


exams.navachaitanya.net