| About us | Contact us | Advertise with us

Extension Officer Grade 1 - APPSC - Syllabus, Salary, Online exam and other details in Notification in Telugu

Extension Officer Grade 1 - APPSC - Syllabus, Salary, Online exam, and other details in Notification in Telugu The APPSC recently issued a... thumbnail 1 summary

Notification, Syllabus, Salary, Online Exam, Written test and other details about Extension officers Grade-1 APPSC Women and Child welfare department

Extension Officer Grade 1 - APPSC - Syllabus, Salary, Online exam, and other details in Notification in Telugu

Extension officer grade 1 notification in telugu
The APPSC recently issued a recruitment announcement for all 22 posts of extension officers (supervisor) posts in the Woman and Child Welfare Department. Women candidates who have completed their degree in Home Science/Social Work/Sociology/Food Science & Nutrition are eligible to apply for these posts. Let us try to find out the full details about this notification in this PDF.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుగులో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సాధారణ డిగ్రీ చదివిన అభ్యర్ధులు అర్హులో కాదో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

About Extension Officers (Supervisor) Notification Release

The notification was released On 08.11.2021 for recruitment to 22 posts of APPSC on behalf of Extension Officers (Grade-I) Supervisor –  Woman and Child Welfare Department.

PayScales (Salary) –  Extension Officers (Supervisor) Woman and Child Welfare Department

Extension Officers (Grade-I) released by the APPSC on behalf of the Woman and Child Welfare Department has paid a pay scale of Rs. 24,440 to Rs. 71,510 has been finalized. The notification was released for the recruitment of 22 Extension officer posts in total.

Age –  Extension Officers (Grade-1) supervisors

The age of the candidates applying for recruitment to the posts of Extension Officers (Grade-1) Supervisor in the notification released by APPSC. It has been announced that it should be between 18 and 42 years as of 01.07.2021. The age relaxation opportunities based on the reservation category are also included in the notification released by the APPSC.

Category of candidate

Age Relaxation

1. SC & ST

10 years

2. BC & EWS

5 years

3. Physically Handicaped Persons

10 years

4. Ex-Serviceman

Following his service, it was decided to reduce his age for 3 years.

5. Andhra Pradesh Government Employees

Age relaxation is given up to a maximum of five years following their service.

Procedure for Applying for Extension Officers, Woman and Child Welfare Department

Candidates for the posts of Woman and Child Welfare Department Extension Officer released by APPSC can apply from the website https://psc.ap.gov.in, the official website of APPSC. APPSC accepts these applications from 18/11/2021 to 08/12/2021 and the last date for paying Fee through online is 07/12/2021 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ఫ్రీ ఎగ్జామ్స్
నవచైతన్య కాంపిటీషన్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పేపర్-1 కోసం కొన్ని ఫ్రీ ఆన్ లైన్ ఎగ్జామ్స్ ను అందుబాటులో ఉంచింది.

Selection Procedure for Extension Officers (Grade-1) Supervisor Posts

The announcement of recruitment to the posts of Extension Officers (Grade-1) Supervisor released by APPSC has made it clear that a total of 22 vacancies will be filled up through computer-based examination. In this online test based entirely on computers, vacancies will be filled with talented candidates. At present, the written exam dates have not been released. APPSC will soon announce the exam dates for computer-based online examinations through a press note. The Extension Officers (Grade-I) Supervisor is instructing candidates through notification to follow the official APPSC website to know the dates for the written test. A computer-based test will be conducted soon with completely objective-type questions.

Details of Extension Officers (Grade-1) Supervisor Written Examination Syllabus:

Recruitment to extension officers posts will be conducted through computer-based online examination. Candidates need to identify answers to questions through a computer in a completely objective manner. The syllabus for this online exam will be given at the degree level. A total of two papers will be conducted in this computer-based online examination. The first exam paper-1 will have 150 objective questions of 150 marks from general studies and mental ability subjects. The second exam paper-2 will have 150 objective questions of 150 marks on the syllabus related to Home Science &  Social Work. Since there will be negative marking, 1/3 marks will be reduced for each wrong answer.
Scheme and Syllabus of Examination –  Extension Officers (Grade-1) Supervisor:
Paper-1:  General Studies  &  Mental Ability  –  150 marks.
Paper-2:  Home Science  &  Social Work  –  150 marks.

Extension Officers (Grade-1) Online Exam Medium:

Questions will be given in Telugu and English mediums in computer-based online examination related to recruitment to the posts of Women Development &  child welfare department extension officers (Grade-1) supervisors released by APPSC. The English version is taken as standard as the question paper is created in English and translated into Telugu. The examinations are also translated into Telugu keeping in mind the Telugu medium candidates of rural areas.

Details about Extension Officers (Grade-1) Mock Tests

Mock tests for the written test conducted for recruitment to the posts of Woman and Child Welfare Department Extension Officer have been made available on the official website of APPSC. So the candidates who apply can write mock tests by logging directly on the website. Extension Officers have been informed on the website to follow the official website of APPSC regularly for online mock tests.

జనరల్ సైన్స్ ఫ్రీ ఆన్ లైన్ పరీక్షలు నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి


Details about Extension Officers (Grade-1) Supervisor Hall Tickets

In connection with the posts of APPSC Extension Officers (Grade-I) Supervisor, APPSC will provide hall tickets to the candidates applied through their official website. Extension Officers Hall tickets are downloaded by logging in to the APPSC website with their login details. However, the official website will soon be informed by a press note as to when hall tickets will be available. So it is advisable for candidates to see the official APPSC website frequently for the date of issuing extension officers hall tickets.

Are women the only ones eligible for extension officers (Grade-1) posts?

It has been clearly stated that only women candidates are eligible for the posts of Extension Officers (Grade-I) Supervisor released by THE APPSC. So men are not eligible to apply for these posts. Even when the number of posts is explained zone-wise, it is clear that only women have posted. Recognize that men are unlikely to be replaced in the Women and Child Development Department and only women candidates can apply to this extension officers post.

Zone wise Extension Officers Vacancies Details

A total of 22 Extension Officers (Grade-1) vacancies will be filled under the Andhra Pradesh Women Development and Child Welfare Sub Services Department. All 22 posts include Zone-1 to 08 posts, Zone-2 to 03 posts, Zone-3 to 05 posts, and Zone-6 to 06 posts. The notification reveals that zone-1 has a maximum of 8 posts and zone-2 has a minimum of 03 posts.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫ్రీ ఆన్ లైన్ మాక్ టెస్ట్స్


Educational Qualification for Extension Officers Grade-1 (Supervisor) Posts:

The educational qualification details of the candidates who want to apply in the recruitment notification for the posts of Extension Officers (Grade-1) Supervisor in connection with ap women development & child welfare department released by APPSC have been clearly notified as follows.
1. Degree in Sociology
2. BSc (Hons.) – Food Science and Nutrition
3. BSc – Food & Nutrition, Botany / Zoology & Chemistry / Bio–Chemistry
4. BSc – Applied Nutrition & Public Health, Botany / Zoology & Chemistry
5. BSc – Clinical Nutrition & Dietetics, Botany / Zoology & Chemistry
6. BSc – Applied Nutrition, Botany / Zoology & Chemistry / Bio Chemistry
7. BSc – Food Sciences & Quality Control, Zoology / Botany & Chemistry / Biological Chemistry
8. BSc – Food Sciences & Management, Botany / Zoology & Chemistry / Biological Chemistry
9. BSc – Food Technology & Nutrition, Botany / Zoology & Chemistry
10. BSc – Food Technology & Management / Botany / Zoology / Chemistry / Bio–Chemistry

Details of zones for recruitment of Extension Officers (Grade-I):

A statement has been issued seeking recruitment to 22 posts of Extension Officers in The Woman and Child Welfare Department from APPSC. The details of zone-wise districts are as follows as these posts will be filled on a zone basis.
Zone-01:  Srikakulam, Vizianagaram, Visakhapatnam
Zone-02:  East Godavari, West Godavari, and Krishna District
Zone-03:  Guntur, Prakasam, and Nellore Districts
Zone-04:  Chittoor, Kadapa, Anantapur, and Kurnool Districts

Extension Officers (Grade-1) Supervisor Application Fee Details:

The application for recruitment to the posts related to Women Development & Child Welfare Department Extension Officers will have to pay Rs.250 as the processing fee and Rs.80 as the examination fee. SC, ST, BC, PH, Ex. Servicemen, White Cardholders and  Physically Handicapped Persons' examination fee of Rs.80 will be exempted. The fee for these Extension Officers (Grade-1) supervisor posts will be paid only online. Offline payments will not be received.

Extension Officers –  NavaCHAITANYA Competitions Online Exams:

NavaCHAITANYA Competitions is offering online examinations for candidates who want to stay at home and prepare. NavaCHAITANYA Competitions provides good online examinations to complete the syllabus for Paper-1 General Studies & Mental Ability sections in 60 days in written examination for the posts of APPSC Women and Child Welfare Department Extension Officers (Grade-1) Supervisor. Candidates can take these online examinations at a cost of Rs.300 only.

Send whatsapp message to 9640717460 GENERAL STUDIES for full details.

నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ ను పూర్తి ఉచితంగా అందిస్తోంది. మా నవచైతన్య కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్ వెబ్ సైట్ ద్వారా ఈ పరీక్షలను రాయవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ లింక్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.

ఎపిపియస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) నోటిఫికేషన్ వివరాలు తెలుగులో

ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) పోస్టలకు సంబంధించి మొత్తం 22 పోస్టుల భర్తీ ప్రకటన ఇటీవల ఎపిపియస్సీ విడుదల చేసింది. హోమ్ సైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ పై డిగ్రీ పూర్తి చేసిన మహిళా అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలను ఈ పిడిఎఫ్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) నోటిఫికేషన్ విడుదలను గురించి

ది. 08.11.2021 న ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ – ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ఎపిపియస్సీ 22 పోస్టుల భర్తీ కోసమై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పేస్కేల్స్ – ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ఎపిపియస్సీ విడుదల చేసిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించి పేస్కేలును రూ. 24,440 నుంచి రూ. 71,510 గా ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా 22 పోస్టుల భర్తీ కోసమై ఈ నోటిఫికేషన్ విడుదల అయినది.

వయస్సు – ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్లకు సంబంధించి

ఎపిపియస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టుల భర్తీకై అప్లై చేయు అభ్యర్ధుల వయస్సు ది. 01.07.2021 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉండాలని ప్రకటించింది. రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా వయస్సు సడలింపు అవకాశాలను కూడా ఎపిపియస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరచడం జరిగింది.

అభ్యర్ధి యొక్క కేటగిరీ

వయస్సు సడలింపు

1. SC & ST

10 సంవత్సరాలు

2. BC & EWS

5 సంవత్సరాలు

3. దివ్యాంగులు

10 సంవత్సరాలు

4. ఎక్స్ సర్వీస్ మెన్

అతని సర్వీసును అనుసరించి 3 సంవత్సరాలు అతని వయస్సును తగ్గించేందుకు నిర్ణయించడం జరిగింది.

5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు

వారి సర్వీసును అనుసరించి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకూ వయస్సు రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ – ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్టులకు అప్లై చేసే విధానం

ఎపిపియస్సీ విడుదల చేసిన ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్ధులు ఎపిపియస్సీ అధికారిక వెబ్ సైట్ అయిన https://psc.ap.gov.in వెబ్ సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఎపిపియస్సీ ఈ అప్లికేషన్స్ ను ది. 18/11/2021 నుంచి ది. 08/12/2021 వరకూ స్వీకరిస్తుంది. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-1) పోస్టులకై రుసుమును చెల్లించడానికి ది. 07/12/2021 అర్ధరాత్రి వరకూ మాత్రమే సమయం ఉన్నది. 
ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్-1 (సూపర్ వైజర్) పోస్టులకోసం అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు ఎపిపియస్సీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి OTPR ద్వారా లాగిన్ అయిన తరువాత రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానం

ఎపిపియస్సీ విడుదల చేసిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టుల భర్తీ ప్రకటన లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది. పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ ఆన్ లైన్ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్ధులతో ఖాళీలను భర్తీ చేస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష కు సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలో ప్రెస్ నోట్ ద్వారా ఎపిపియస్సీ తెలియపరచనున్నది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ రాత పరీక్షకు సంబంధించిన తేదీలను తెలుసుకోవడం కోసం అభ్యర్ధులను అధికారిక ఎపిపియస్సీ వెబ్ సైట్ ఫాలో కావాలని నోటిఫికేషన్ ద్వారా సూచించడం జరుగుతున్నది. పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కంప్యూటర్ ఆధారిత పరీక్షను త్వరలో నిర్వహించడం జరుగుతుంది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ రాత పరీక్షకు సంబంధించిన వివరాలు:

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలకు అభ్యర్ధులు కంప్యూటర్ ద్వారా సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ పరీక్షకు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయిలో ఇవ్వబడుతుంది. మొత్తం రెండు పేపర్లు ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షలో నిర్వహించడం జరుగుతుంది. మొదటి పరీక్ష పేపర్-1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. రెండవ పరీక్ష పేపర్-2 హోమ్ సైన్స్ & సోషల్ వర్క్ కు సంబంధించిన సిలబస్ పై 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గించడం జరుగుతుంది.
స్కీమ్ & సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ – ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్:
పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు.
పేపర్-2: హోమ్ సైన్స్ & సోషల్ వర్క్ – 150 మార్కులు.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) ఆన్ లైన్ పరీక్ష మీడియం:

ఎపిపియస్సీ విడుదల చేసిన ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షలో ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఇవ్వబడతాయి. ప్రశ్నాపత్రము ఆంగ్లంలో రూపొందించబడి, తెలుగులోకి అనువదించబడుతుంది కనుక ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతపు తెలుగు మీడియం అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను తెలుగులో కూడా అనువదించి ఇవ్వడం జరుగుతుంది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) మాక్ టెస్ట్ లను గురించిన వివరాలు

ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన మాక్ టెస్ట్ లను ఎపిపియస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. కనుక అప్లై చేసిన అభ్యర్ధులు నేరుగా వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా మాక్ టెస్ట్ లను రాయవచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం ఎపిపియస్సీ అధికారిక వెబ్ సైట్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వమని వెబ్ సైట్ లో తెలియచేయడం జరిగింది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ హాల్ టికెట్స్ గురించిన వివరాలు

ఎపిపియస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించి, అప్లై చేసిన అభ్యర్ధులకు ఎపిపియస్సీ, తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ లను అందించనున్నది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ హాల్ టికెట్లను తమ లాగిన్ వివరాలతో ఎపిపియస్సీ వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఎప్పటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయం త్వరలోనే అధికారిక వెబ్ సైట్ లో ప్రెస్ నోట్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కనుక ఎక్స్ట్ టెన్షన్ ఆఫీసర్స్ హాల్ టికెట్ లు జారీ చేసే తేదీ కోసం అభ్యర్ధులు అధికారిక ఎపిపియస్సీ వెబ్ సైట్ ను తరచూ చూడటం మంచిది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) పోస్టులకు ఉమెన్ మాత్రమే అర్హులా?

ఎపిపియస్సీ విడుదల చేసిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు అంటూ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. కనుక ఈ పోస్టులకు పురుషులకు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. పోస్టుల సంఖ్యను జోన్ ల వారీగా వివరించే సమయంలో కూడా కేవలం మహిళలకు మాత్రమే పోస్టులు ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలియవస్తుంది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో భర్తీ కనుక పురుషులకు అవకాశం లేదని, కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చునని గుర్తించండి.

జోన్ వారీగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ విభాగం క్రింద మొత్తంగా 22 ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ మొత్తం 22 పోస్టులలో జోన్-1 నుంచి 08 పోస్టులు, జోన్-2 నుంచి 03 పోస్టులు, జోన్-3 నుంచి 05 పోస్టులు మరియు జోన్-6 నుంచి 06 పోస్టులు ఉన్నాయి. జోన్-1 లో గరిష్టంగా 8 పోస్టులు, జోన్-2 లో కనిష్టంగా 03 పోస్టులు ఉన్నట్లుగా నోటిఫికేషన్ నుంచి తెలియవస్తున్నది.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్-1 (సూపర్ వైజర్) పోస్టులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్:

ఎపిపియస్సీ విడుదల చేసిన ఎపి ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో అప్లై చేయగోరు అభ్యర్ధులకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలను క్రింది విధంగా స్పష్టంగా నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది.
1. Degree in Sociology
2. BSc (Hons.) – Food Science and Nutrition
3. BSc – Food & Nutrition, Botany / Zoology & Chemistry / Bio–Chemistry
4. BSc – Applied Nutrition & Public Health, Botany / Zoology & Chemistry
5. BSc – Clinical Nutrition & Dietetics, Botany / Zoology & Chemistry
6. BSc – Applied Nutrition, Botany / Zoology & Chemistry / Bio Chemistry
7. BSc – Food Sciences & Quality Control, Zoology / Botany & Chemistry / Biological Chemistry
8. BSc – Food Sciences & Management, Botany / Zoology & Chemistry / Biological Chemistry
9. BSc – Food Technology & Nutrition, Botany / Zoology & Chemistry
10. BSc – Food Technology & Management / Botany / Zoology / Chemistry / Bio–Chemistry

సాధారణ డిగ్రీ (BSc MPC / BSc BZC, BA) కలిగిన ఉన్న వారు అర్హులేనా?

నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ వివరాలను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. నిశితంగా గమనిస్తే సోషియాలజీ, ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ సబ్జక్టులను కలిగి ఉన్న డిగ్రీలు మాత్రమే అర్హత గా ప్రకటించడం జరిగింది. సాధారణ డిగ్రీ లో గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జక్టుల మధ్య కాంబినేషన్ ఉంటుంది తప్ప న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జక్టులేవీ ఉండవు కనుక సాధారణ బియస్సీ డిగ్రీ చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు కారు. అలాగే బిఏ కోర్సులో కూడా సోషియాలజీ అనేది ప్రధాన సబ్జక్టుగా ఉండదు కనుక సాధారణ బిఏ కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) భర్తీకు సంబంధించి జోన్ ల వివరాలు:

ఎపిపియస్సీ నుంచి ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 22 ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోరుతూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. జోన్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ జరుగనున్న నేపథ్యంలో జోన్ ల వారీగా గల జిల్లాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
జోన్-01: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
జోన్-02: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లా
జోన్-03: గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు
జోన్-04: చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలు

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ అప్లికేషన్ రుసుము వివరాలు:

ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కు సంబంధించిన పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్ రుసుమగా రూ. 250 ప్రాసెసింగ్ రుసుముగా, రూ. 80 ను ఎగ్జామినేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, BC, PH, Ex. Service men, White Card holders మరియు Physically Handicapped Persons ఎగ్జామినేషన్ ఫీ రూ. 80 మినహాయింపు లభిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించిన ఫీజును కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ పేమెంట్స్ స్వీకరించబడవు.

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ – నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలు:

ఇంటి వద్ద ఉండి ప్రిపరేషన్ చేయాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది. ఎపిపియస్సీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-1) సూపర్ వైజర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ విభాగాలకు సంబంధించిన సిలబస్ ను 60 రోజులలో పూర్తి చేయడానికి చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. రూ. 300 చెల్లించి ఈ ఆన్ లైన్ పరీక్షలను అభ్యర్ధులు రాయవచ్చు.







exams.navachaitanya.net