| About us | Contact us | Advertise with us

ఎదురు చూద్దామా? లేక ప్రిపేర్ అవుదామా? - Endowment Officer | Junior Assistant Preparation Plan & Tips

Endowment Officer | Junior Assistant Preparation Plan & Tips  Junior Assistant, Endowment Officers Notifications Released: ఎంతో కాలంగా... thumbnail 1 summary

ఎండోమెంట్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ ప్రిపరేషన్ ప్లాన్ - ఇతర నోటిఫికేషన్లు వచ్చే సమయం, ఇతర వివరాలు

Endowment Officer | Junior Assistant Preparation Plan & Tips 

Junior Assistant, Endowment Officers Notifications Released:

ఎంతో కాలంగా నిరుద్యోగ అభ్యర్ధులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడటం జరుగుతున్నది. ఎపిపియస్సీ నుంచి గ్రూప్-1, గ్రూప్-2 లతో పాటు ఇతర నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు ఆ నోటిఫికేషన్లు రాలేదన్న నిరాశ నుంచి జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల కొంచెం ఊరటనిచ్చింది. అయితే ఎండోమెంట్ ఆఫీసర్స్ కేవలం 60 ఖాళీలు మాత్రమే ఉండటంతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుమారు 670 ఖాళీలు ఉండటంతో అభ్యర్ధులు ఈ పరీక్షలకు సిద్ధం కావాలా లేక మరికొంత కాలం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాలా అని ఆలోచనలో పడ్డారు.
Endowment Officer | Junior Assistant Preparation Plan & Tips


ఇక టెట్ మరియు డియస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న తమ జీవిత ఆశయం కోసం ప్రిపరేషన్ కొనసాగించాలా లేక నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి కనుక జూనియర్ అసిస్టెంట్ లేదా ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్టులకు ప్రిపేర్ కావాలా తేల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఎండోమెంట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంచివేనా?

టెట్ మరియు డియస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు అమాయకంగా అడుగుతున్న ప్రశ్న ‘ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ పోస్టులు మంచివేనా సర్?’. నిజానికి పోస్టులలో మంచి పోస్టులు చెడ్డ పోస్టులు అంటూ ఏమీ ఉండవు. ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ లు పరిశీలించినపుడు పే స్కేల్ 16,400 నుంచి 49,870 మధ్య ఉంటుందని తెలుస్తున్నది. పేస్కేల్ అనుసరించి పరిశీలించినపుడు ఇది చక్కని జీతం ఇచ్చే ఉద్యోగం అని నిర్ణయానికి రావచ్చు. 
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేయాల్సిన ఉద్యోగాలకు సంబంధించినవి. దేవుని సన్నిధిలో చక్కని ప్రశాంతమైన వాతావరణంలో సాగిపోయే ఈ ఉద్యోగాల ఛానల్ లో ప్రమోషన్స్ చాలా వేగంగా ఉంటాయి. కనుక తక్కువ కాల వ్యవధిలోనే మంచి పొజిషన్ కు వెళ్లడానికి ఈ పోస్టు ఉపకరిస్తుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినవి కనుక ఖచ్చితంగా తక్కువ కాలంలోనే ప్రమోషన్ ద్వారా మంచి ఉన్నత స్థానానికి వెళ్లడానికి ఈ పోస్టులు ఉపకరిస్తాయి.

పోస్టుల సంఖ్య మరీ తక్కువగా ఉన్నది కదా మరి విజయం సాధ్యమేనా?

ఖచ్చితంగా సాధ్యమే అని నమ్మి, మీ ప్రయత్న లోపం లేకుండా సిలబస్ ను క్షుణ్ణంగా చదివి, పట్టు తెచ్చుకుని మంచి ప్రతిభను పరీక్షలో కనబరచగలిగినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించడం సాధ్యం అవుతుంది. అయితే చాలా మంది అభ్యర్ధులు ఏదో చదువుతున్నాములే అంటూ, దొరికిన ఒక పుస్తకం ముందేసుకుని ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట చదివేసి, ఏదో సాధించేయబోతున్నామంటూ కలల లోకంలో విహరిస్తుంటారు. బహుశా వారికి ఉద్యోగం రాకపోవచ్చు కానీ డెడికేటెడ్ గా సిలబస్ ను ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు విజయం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
మనం డియస్సీ వంటి నోటిఫికేషన్ అనుసరించి పోస్టుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ పోస్టుల సంఖ్య తక్కువ అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ నోటిఫికేషన్ల శ్రేణిలో ఈ సంఖ్య చాలా ఎక్కువే. కనుక నాకు ఒక్క పోస్టు ఉంటే చాలు, నేను పోటీ పడతాను, నా ప్రతిభను ప్రదర్శించి విజయం సాధిస్తాను అని నమ్మే ప్రతి అభ్యర్ధీ ఖచ్చితంగా ప్రిపేర్ కావచ్చు.

ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టు ఎవరికి మంచిది?

ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య జిల్లాలవారీగా చూసినపుడు సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యాయి. కనుక ఇక్కడ అత్యున్నత శ్రేణి ప్రిపరేషన్ మాత్రమే పోస్టు సాధించిపెట్టగలదు. ఎవరైతే జస్ట్ టైమ్ పాస్ కు చదువుదామనుకుంటున్నారో, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ రోజుకు రెండు మూడు గంటలు చదివేసి పోస్టు రావాలని ఆశిస్తున్నారో వారు ప్రిపరేషన్ కు దూరంగా ఉండటం మంచిది. అలా అరాకొరా ప్రిపరేషన్ వల్ల పోస్టు రావడం అటుంచి పుస్తకాలకు ఓ మూడు నాలుగు వేలు, ప్రయాణాలు, పరీక్షలకు మరొక రెండు మూడువేలు వృధా అవుతాయి. 
ఎవరైతే ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2 లేదా డియస్సీ ప్రిపరేషన్ లో సబ్జక్టులను దాదాపు పట్టు తెచ్చుకుని ఉంటారో అటువంటి వారు ఇప్పటికే జనరల్ స్టడీస్ సబ్జక్టుపై దాదాపు పట్టు కలిగి ఉంటారు కనుక సెక్షన్-బి (హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ) పై కొంచెం శ్రద్ధ పెట్టడం ద్వారా తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా చిన్నప్పటినుంచి నానమ్మ, అమ్మమ్మల దగ్గర రామాయణ మహాభారతాలు, భాగవతం వంటివి చూస్తూ, పెదబాలశిక్షను చదివిన, హిందూ తత్వశాస్త్రంపై ఆసక్తి గల అభ్యర్ధులు కొంచెం సీరియస్ గా ప్రిపేర్ కావడం ద్వారా తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
Endowment Officer Online Exams Package


జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఎవరికి మంచిది?

జూనియర్ అసిస్టెంట్ సిలబస్ ను పరిశీలించినపుడు మొత్తం 150 మార్కులలో 100 మార్కులకు జనరల్ స్టడీస్ ప్రధాన సబ్జక్టుగా ఉండటాన్ని గమనింవచ్చు. మిగిలిన యాభై మార్కులకు తెలుగు, ఇంగ్లీష్ సబ్జక్టులు ఉన్నాయి. సహజంగా డియస్సీకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు తెలుగు, ఇంగ్లీష్ సబ్జక్టులపై కొంతవరకూ పట్టును కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2 లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై పట్టు ఉండే అవకాశం ఉంటుంది. కనుక గ్రూప్-1, గ్రూప్-2, డియస్సీ లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొంచెం దృష్టి పెట్టి, సీరియస్ గా ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా జూనియర్ అసిస్టెంట్ పోస్టును సాధించే అవకాశం ఉన్నది.

ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించి జూనియర్ అసిస్టెంట్ లేదా ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించలేమా?

కొంచెం కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు. ఇప్పటికే ఇతర పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఆయా సబ్జక్టులపై కొంత వరకూ పట్టు ఉంటుంది కనుక విజయం సులభం అవుతుంది. ఇప్పటి వరకూ పుస్తకం వైపు చూడకుండా, జస్ట్ ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్ధులు జస్ట్ సరదాగా తీసుకుంటూ, ఆషామాషీగా ఆలోచిస్తూ ప్రిపరేషన్ పై తగిన దృష్టి పెట్టలేకపోతే ఉద్యోగం సాధించడం సాధ్యం కాదు. అదే సమయంలో ఇంకా పరీక్షల తేదీలను వెల్లడించలేదు, పరీక్షకు మూడు నెలలకు పైగా సమయం ఉండే అవకాశం కనిపిస్తోంది కనుక ఈ రోజు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించబోయే అభ్యర్ధులు తప్పకుండా సిలబస్ పై పట్టు సాధించడంతో పాటు విజయానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది.

టెట్ డియస్సీ ఎప్పుడు ఉంటాయి?

ఈ ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదు కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టెట్ మరియు డియస్సీ నోటిఫికేషన్స్ మరికాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బహుశా మరొక రెండు మూడు నెలల వరకూ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలా ఆలోచిస్తే ఈ సంవత్సరం ఆగస్ట్ వరకూ డియస్సీ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
Junior Assistant Online Exams Package


డియస్సీ కోసం ఎదురు చూడటం మంచిదా? లేక ఈ పోస్టులకు ప్రిపేర్ కావడం మంచిదా?

A Bird in the Hand is Worth Two in the Bush
పై సామెత మీ ఈ సందేహానికి చక్కగా సరిపోతుంది. టెట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్లు ఆల్రెడీ వచ్చేశాయి. కనుక, ప్రస్తుతం రాని నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం కంటే ప్రస్తుత నోటిఫికేషన్ విడుదల అయిన పోస్టులకు ప్రిపేర్ అవడం మంచి పద్ధతి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను అభ్యర్ధులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటిది ఖచ్చితంగా సీరియస్ ప్రిపరేషన్ చేయాలనుకునే అభ్యర్ధులు మాత్రమే ఈ పరీక్షలకు సిద్ధం కావడం మంచిది. ఎక్కువ సిలబస్, తక్కువ పోస్టులు కనుక రోజుకు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ పై దృష్టి పెట్టగలిగే వారు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏదో ఒక పుస్తకం చదివేసి, ఏదో ఒక పిడిఎఫ్ డౌన్ లోడ్ చేసుకుని పరీక్షకు సిద్దం అవుతున్నాము అని భ్రమపడే అభ్యర్ధులు కూడా దూరంగా ఉండటం మంచిది. అరకొర ప్రిపరేషన్ తో ఉద్యోగాలు రావు. ప్రణాళికాబద్ధంగా మీరు చేసే ప్రిపరేషన్ మాత్రమే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని మరవకండి.

ఎండోమెంట్ ఆఫీసర్స్ / జూనియర్ అసిస్టెంట్ సిలబస్ తెలుగులో

ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడే అభ్యర్ధులలో ఎక్కువ శాతం మంది తెలుగు మీడియంలో చదివే వారే ఉంటున్నారు. సిలబస్ ను ఇంగ్లీష్ లో ఇవ్వడం వల్ల వారు పడే ఇబ్బందులను గమనించిన నవచైతన్య కాంపిటీషన్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సిలబస్ ను, జూనియర్ అసిస్టెంట్ సిలబస్ ను తెలుగులోకి అనువదించి, డీటెయిల్డ్ సిలబస్ ను అందిస్తోంది. క్రింది లింక్స్ నుంచి మీరు ఈ డీటెయిల్డ్ సిలబస్ ను తెలుగులో పొందవచ్చు

ఏ పుస్తకాలను చదవడం మంచిది?

ఎక్కువ మంది అభ్యర్ధులు పిడిఎఫ్ లు పంపండి అంటూ వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. చిన్నా చితకా పిడిఎఫ్ లు చదివేసి ఉద్యోగాలను సాధించాలన్న భ్రమ నుంచి కొంచెం బయటకు రండి. ఈ పోటీ పరీక్షలలో మీరు మంచి ప్రతిభను కనబరచాలంటే ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకాలను ఎండోమెంట్ ఆఫీసర్స్ బుక్స్, జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్-4) బుక్స్ ను కొనుగోలు చేసి చదవాల్సి ఉంటుంది. ఏ పుస్తకాలను చదవడం ద్వారా మీరు విజయానికి చేరువకావచ్చో నవచైతన్య కాంపిటీషన్స్ స్పష్టంగా తెలియచేయడం జరిగింది.
+ Endowment Officer Books, Junior Officer Books ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎండోమెంట్ ఆఫీసర్స్ / జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వివరాలు తెలుగులో:

ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు APPSC విడుదల చేసిన నోటిఫికేషన్ లోని ముఖ్యాంశాలను తెలుగు మీడియం అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ తెలుగులోకి అనువదించి అందించే ప్రయత్నం చేసింది. మీరు క్రింది లింక్స్ పై క్లిక్ చేసి ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ తెలుగులో, జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడం తో పాటు, పే స్కేల్ వివరాలు, క్వాలిఫికేషన్ వివరాలు, ఏజ్ రిలాక్సేషన్, సిలబస్, పోస్టుల సంఖ్య మొదలైన వివరాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలను గురించి వివరాలు:

ఎండోమెంట్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలను అందిస్తోంది. దీనికోసమై Endowment Officers – 70 Days preparation plan, Junior Assistant – 70 Days Preparation Plan ను అందుబాటులో ఉంచింది. ఈ ప్రిపరేషన్ ప్లాన్ లను క్రింది లింక్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రూ. 600 చెల్లించి ఈ పరీక్షలకోసం రిజిస్టర్ చేసుకుని 70 రోజులలో ప్రిపరేషన్ ను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయవచ్చు.

ఇవి కూడా చూడండి

Junior Assistant, Endowment Officers Notifications Released:

Unemployed candidates have been waiting for notifications for a long time. The release of the Junior Assistant and Endowment Officers notification was a bit of a relief from the disappointment that the notifications did not come to the candidates who were expecting group-1 and group-2 as well as other notifications from The APPSC. However, endowment officers have only 60  vacancies and junior assistant has about 670 vacancies and candidates are confusing whether to prepare for these exams or wait for notifications for some more time.
The candidates who are looking forward to TET and DSC notification are very embarrassed to decide whether to continue preparing for their life's ambition to get a teacher job or prepare for the posts of Junior Assistant or Endowment Officers as notifications have been released.

Are endowment officer and junior assistant posts good?

The question being asked innocently by the candidates who are waiting for TET and DSC notification is 'Endowment Officers and Junior Assistant notification has come up, are these posts good sir? ’. In fact, there are no good posts and bad posts in the posts. When endowment officers and junior assistant notifications are examined, the pay scale is between 16,400 and 49,870. When considered following the payscale, it can be decided that this is a good paying job.
Executive Officers posts are related to jobs to be done in the Devadaya Dharmadhaya Department. Promotions are very fast in this jobs channel, which is in a peaceful atmosphere in the presence of God. So this post helps you to go to a good position in a short period of time. As well as junior assistant is also related to revenue department, these posts will definitely help them go to a good high position through promotion in a short period of time.

The number of posts is very low, is success possible?

It is certainly possible to succeed if you believe that it is certainly possible and can read the syllabus thoroughly without your lack of effort, get a grip and show good talent in the test. But many candidates say they are reading something, and they read a book in the morning and an hour in the evening, and say that they are going to achieve something in the dream world. Perhaps they will not get a job but the chances of success will improve for the candidates who prepare the syllabus dedicatedly.
The number of these posts seems to be low compared to the number of posts as we follow a notification like DSC. But in fact, this number is very high in this series of notifications, so every candidate who believes that if I have one post, I will compete, show my talent and succeed, can definitely prepare.

Who is better for the post of Endowment Officer?

The number of endowment officer posts is limited to single digit when viewed district wise. So only the highest level of preparation can be posted here. It is advisable for those who want to study for just time pass and study for two to three hours a day to study for some job and stay away from preparation.
Those who have already almost caught up with subjects in Group-I, Group-II or DSC Preparation can improve their chances of success by paying a little attention to Section-B (Hindu philosophy, temple system) as they already have almost a grip on the General Studies subject. Especially from childhood, candidates who have read the Pedabala shiksha and are interested in Hindu philosophy can improve their chances of success by looking at the Ramayana Mahabharatas and Bhagavatham at grandmother and grandmother.

Who is the best for junior assistant post?

When the junior assistant syllabus is examined, it can be noted that general studies are the main subject for 100 marks out of a total of 150 marks. The remaining fifty marks have Telugu and English subjects. Candidates who naturally prepare for DSC are likely to have some hold on Telugu and English subjects. Candidates who are already preparing for Group-I and Group-II will have the opportunity to hold on to General Studies. So candidates preparing for Group-I, Group-II and DSC are likely to achieve the post of Junior Assistant if they are a little focused and seriously prepared.

Can't you start preparation now and get a junior assistant or endowment officer job?

A little difficult but not impossible. Success will be easier as the candidates who are already preparing for other examinations will have some hold on their respective subjects. Without looking at the book till now, it is not possible to get a job if the candidates who have just started the preparation can't get a job if they can't just take fun and focus on preparation thinking as a surprise. At the same time, the exam dates are yet to be revealed and the candidates who are going to start the preparation from today are likely to get a grip on the syllabus and reach success.

When will tet DSC be?

The question is not answered but looking at the current situation, tet and DSC notifications seem to be delayed a little further. There is no possibility of tet notification for another two to three months. If you think about it, the chances of getting a Diussy notification till August this year are very low.

Is it better to look forward to DSC? Or is it better to prepare for these posts?

A Bird in the Hand is Worth Two in the Bush
The above proverb fits your doubt well. Tet notification is yet to come. Junior Assistant and Endowment EO notifications have already arrived. Therefore, it is better to prepare for the posts where the current notification has been released than to look forward to the notification that is not currently available. But here are some things that the candidates need to consider.
Firstly, it is advisable to prepare for these examinations only by candidates who want to do serious preparation. Only those who can focus on preparation for at least eight hours a day are likely to succeed as there is more syllabus and fewer posts. Secondly, it is advisable for candidates who read a book and are disillusioned that we are preparing for the exam by downloading some PDF. Jobs do not come with half a half preparation. Don't forget that only the preparation you do in a planned manner will bring you to success.

Endowment Officers / Junior Assistant Syllabus in Telugu

Most of the candidates contesting for the government job are studying in Telugu medium. Seeing the difficulties they face by giving the syllabus in English, Navchaitanya Competitions Endowment Officers syllabus and junior assistant syllabus are translated into Telugu and offered detailed syllabus. You can get this detailed syllabus in Telugu from the following links
+ Click here to download Endowment Officers Syllabus in Telugu
+ Click here to download Junior Assistant Syllabus in Telugu

Which books are better to read?

Most of the candidates are sending Pdfs on WhatsApp. Come out of the illusion of reading small pdfs and achieving jobs. To show good talent in these competitive examinations, you will definitely need to buy and read standard books like Endowment Officers Books and Junior Assistant (Group-4) Books.  Navchaitanya Competitions has made it clear which books you can reach success by reading.

Endowment Officers / Junior Assistant Notification Details in Telugu:

Navchaitanya Competitions has tried to translate the highlights of the notification released APPSC for Endowment Officers and Junior Assistant posts into Telugu. You can click on the following links and download the endowment officers notification in Telugu, junior assistant notification telugu and clearly know the details of pay scale details, qualification details, age relaxation,syllabus, number of posts etc.

Details about Navchaitanya Competitions online exams:

Navchaitanya Competitions is providing online examinations for candidates preparing for endowment officers and junior assistant jobs. For this purpose, Endowment Officers – 70 Days preparation plan, Junior Assistant – 70 Days Preparation Plan has been made available. These preparation plans can be downloaded through the following links. You can register for these tests for Rs.600 and complete the preparation in a planned manner within 70 days.


exams.navachaitanya.net