AP TET - 2022 Hall tickets:
ఎపి టెట్ ఆగస్ట్ - 2022 లో విడుదల అయిన నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ - ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఎపి టెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు కల్పించారు. AP TET అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in నుంచి ఈ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP TET Hall tickets Download Process:
ఎపి టెట్ - 2022 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రింది సూచనలను పాటించండి.
+ ముందుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ లో గూగుల్ క్రోమ్ యాప్ ను ఓపెన్ చేయండి.
+ అడ్రస్ బార్ లో https://aptet.apcfss.in/ వెబ్ సైట్ చిరునామాను తప్పులు లేకుండా టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే క్రింది స్క్రీన్ కనిపిస్తుంది.
+ అక్కడ పాపప్ స్క్రీన్ పై కనిపించే Hall ticket(s) Download Service Available in Candidate Login అనే బటన్ పై క్లిక్ చేయండి.
+ ఆ తరువాత క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
+ ఈ పేజీలో Candidate ID, Date of Birth లను ఎంటర్ చేసి అక్కడ కనిపించే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావడం ద్వారా మీరు మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
+ అదే వెబ్ సైట్ లో మీకు మాక్ టెస్ట్ లను ఉచితంగా రాయడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
+ చాలా మంది అభ్యర్ధులు ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా నేరుగా పరీక్షకు వెళ్లడం వల్ల, పరీక్ష రోజు గందరగోళానికి గురికావడం, ఆందోళనతో ఆలోచన మందగించడం, పరీక్షలంటే సహజంగా ఉండే భయం మొదలైన కారణాలతో ఐదారు బిట్స్ కు పైగా తెలిసిన ప్రశ్నలనే తప్పుగా నమోదు చేస్తుంటారు. కనుక మాక్ టెస్ట్ లను ప్రాక్టీస్ చేసి పరీక్షకు వెళ్లడం అనేది మంచి పద్ధతి
+ ముఖ్యమైన లింక్స్
పేపర్-1 ఆన్ లైన్ మాక్ టెస్ట్ కోసం లింక్ - https://g21.digialm.com//OnlineAssessment/index.html?1950@@M87
పేపర్-2 గణితం/సైన్స్ ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం లింక్ - https://g21.digialm.com//OnlineAssessment/index.html?1950@@M85
పేపర్-2 సోషల్ స్టడీస్ ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం లింక్ - https://g21.digialm.com//OnlineAssessment/index.html?1950@@M86
పేపర్-2 తెలుగు/ఇంగ్లీష్ ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం లింక్ - https://g21.digialm.com//OnlineAssessment/index.html?1950@@M88