| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 02/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 02 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 02/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి U.U.లలిత్ ఇటీవల ఈ క్రింది ఏ కేసు వాదనలను వినటానికి తన అర్హత లేనికారణంగా వైదొలిగారు? 2) ఈ క్రింది ఏ దేశంలో తొలిసారిగా పోఖరెల్ అనే 100 సంవత్సరాల వృద్ధుడు MP నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచాడు. 3) అన్నిరకాల కాన్సర్లనూ గుర్తించగలిగే ఉమ్మడి పరీక్ష MCEDను ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 4) సౌరకుటుంబం కన్నా 600 రెట్లు పెద్దగా గల పేలిపోయిన నక్షత్ర అవశేషాలను ఏనగరంలో గల VLT సర్వే టెలిస్కోప్ తో అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 5) భారత రైల్వేశాఖ విశాఖ పట్నం రైల్వే స్టేషన్ ను ఎన్ని కోట్లరూపాయలతో నవీకరణం చేయనున్నట్లు ప్రకటించింది. 6) అక్టోబర్ నెల GST వసూళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 7) దక్షిణాది రాష్ట్రాలలో అక్టోబర్ నెల GST వసూళ్ళ పరంగా ఏ రాష్ట్రం / కేంద్ర పాలితప్రాంతం ప్రధమ స్థానంలో నిలిచింది. 8) భారతదేశ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది. 9) భారత కేంద్ర రవాణాశాఖ Directior Generalగా ఏ తెలుగు వ్యక్తినియమితులయ్యారు. 10) ఆసియా కాంటినెంటల్ చెస్ పోటీలు ఏనగరంలో జరుగుతున్నాయి. 11) అక్టోబర్ నెలలో భారత కేంద్ర ప్రభుత్వం GST వసూళ్ళు ఎన్ని లక్షల కోట్లరూపాయలుగా నమోదయ్యాయి. 12) భారత ప్రభుత్వం GSTను ఏ తేదీన ప్రవేశపెట్టింది. 13) ఇటీవల టాటా సంస్థలో కీలక సభ్యులు జెమ్ షెడ్ J ఇరానీ కన్నుమూశారు. ఈయనకు ఈ క్రింది ఏ పేరు కలదు? 14) ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా ఏ భారతీయ అమెరికన్ నియమితులయ్యారు. 15) ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఆపిల్ 14 ప్రో మాక్స్ ఫోన్ విడుదలైంది. దీని ఖరీదు ఎన్ని కోట్లరూపాయలు? ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net