December 24 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 24/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) తెలంగాణ RIC సంస్థ తాజాగా ఎన్ని నూతన సూపర్ లగ్జరీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏనగరంలో రానున్న ఏడాది G-20 దేశాల సన్నాహక సదస్సు జరగనుంది.
3) IPL క్రికెట్ వేలంలో అత్యధికధర పలికిన క్రికెటర్ సామ్ కరన్ (18.5 కో॥) ఏదేశానికి చెందిన ఆటగాడు?
4) Forbes పత్రిక అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణుల జాబితాలో 423 కో॥రూ.లతో తొలిస్థానంలో నిలిచిన నవోమి ఒసాకా ఏదేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ?
5) Forbes పత్రిక అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణుల జాబితాలో భారత షట్లర్ PVసింధు ఎన్నవ స్థానంలో నిలిచింది.
6) జాతీయ ఆహార భద్రతాచట్టం క్రింద (NFCA) దేశంలో ఎన్నికోట్ల మందికి ఏడాదిపాటు ఆహారధాన్యాలు ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది.
7) భారతకేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన క్రింద కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల చొప్పున బియ్యం, గోధుమలు అందించాలని నిర్ణయించింది.
8) 2022 జనవరి-నవంబర్ మధ్యకాలంలో జమ్ముకాశ్మీర్ ప్రాంతంలో ఎన్ని ఉగ్రఘటనలు చోటు చేసుకొన్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
9) వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నూతన చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
10) భారత కేంద్ర ప్రభుత్వం దేశంలో అంకుర వ్యవస్థను అభివృద్ధిపరిచేందుకు Start up India కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
11) Flipkart, Phone Peలు వాల్ మార్ట్ నేతృత్వంలో తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అయితే వాల్ మార్ట్ ఏ దేశానికి చెందిన రిటైల్ దిగ్గజ కంపెనీ.
12) 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని IMF అంచనావేసింది.
13) ప్రస్తుత ఏడాది 662 జిల్లాల్లో అంకుర సంస్థల ద్వారా ఎన్ని లక్షలు ఉద్యోగాలు లభించాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
14) ఒకానొక సమయంలో 20వరుస హత్యలతో సంచలన మారణకాండ సృష్టించిన ఛార్లెస్ శోభరాజ్ ఇటీవల ఏదేశజైల్ నుండి విడుదలయ్యాడు?
15) ఈ క్రింది ఏ రాష్ట్రంలో టక్కులోయలో పడిన కారణంగా 16మంది భారత జవాన్లు మరణించడం జరిగింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.