| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 05/01/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

January 05 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 05/01/2023
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఇటీవల ఏ దేశ ప్రభుత్వం త్వరలో తమ దేశ పిల్లలందరూ 18 సంవత్సరాలవరకూ లెక్కలు ఒక సబ్జెక్ట్ గా చదవడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించింది. 2) భారతదేశంలో ఎన్ని కోట్లమంది తీవ్ర ఫంగస్ సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పుందని AIMS అధ్యయనంలో వెల్లడైంది. 3) జమ్ముకాశ్మీర్ లో వరుస పౌరహత్యలనేపధ్యంలో ఎన్నివేల మంది అదనపు సైనికులను పంపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 4) భారత్ లో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారకేసులో ఇదివరకు దోషులను విడుదలచేసిన సుప్రీం న్యాయమూర్తిని ఆ కేసునుండి తొలగించారు. ఆ న్యాయమూర్తి పేరును గుర్తించండి. 5) ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాజాగా ఎన్ని దేశాలు తాత్కాలిక సభ్యత్వ చోటును దక్కించుకొన్నాయి. 6) భారతదేశ వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల (CS)2వ జాతీయ సదస్సు ఏనగరంలో జరగనుంది. 7) A.తులసీరావు అనే ప్రముఖ ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్త ఇటీవల మరణించారు. ఈయన ఈ క్రింది ఏ ప్రముఖ పాలఉత్పత్తుల సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు. 8) ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం కోర్టులలో కేసు వివరాలను అందించేందుకు రోబోల వ్యవస్థను తీసుకువచ్చింది? 9) భారతదేశ అన్ని కోర్టులలోను ఎన్ని కోట్లకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. 10) 2021లో రోడ్డు ప్రమాదాల కారణం ఎంతమందికి పైగా మరణించారు. భారతకేంద్ర రహదారులు, రవాణాశాఖ వెల్లడించింది. 11) భారతప్రభుత్వం ఈ క్రింది ఏదేశంతో 155 MM హోవిట్జర్ శతఘ్నులను కొనుగోలుచేయడానికి 1200 కో॥రూల ఒప్పందాన్ని నవంబర్ 2022 నెలలో కుదుర్చుకోవడం జరిగింది. 12) ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి. 13) టెన్నిస్ లో సింగిల్స్ ఫార్మాట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్ యుకి బాంబ్రి ఏ సంవత్సరంలో జూనియర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను గెలిచాడు. 14) పురుషుల ప్రపంచ హాకీ కప్ భారత్ లోని ఏ నగరంలో జరగనుంది. 15) ప్రపంచ వ్యాప్తంగా ఎంతశాతం చిన్నారుల ఒత్తిడి, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చైనాదేశంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.