January 11 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 11/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడులో భాగంగా చిరువ్యాపారులకు ఎన్ని కోట్లరూపాయల వడ్డీలేని రుణాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.
2) 1951తో పోలిస్తే 2021 నాటికి భారతదేశంలో ప్రజలకు తలసరి ఆహార లభ్యత ఎన్ని కిలోలుగా ఉందని కేంద్రం ప్రకటించింది.
3) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాలపై భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రాయితీని అందించినట్లు వెల్లడించింది.
4) భారత సంతతికి చెందిన ఈ క్రింది ఏ వ్యక్తిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలోగల కీలక పదవిలో నియమించడం జరిగింది.
5) Indian National Clean Energy Programme (NCAP)2022 నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్యనగరంగా ఏనగరం తొలిస్థానంలో నిలిచింది.
6) బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హారీ ఇటీవల తన వ్యక్తిగత వివరాలను రాసిన పుస్తకం పేరును గుర్తించండి.
7) భారతదేశ తొలి నదీ పర్యాటక నౌక అయిన MV గంగావిలాస్ ను ప్రధాని మోదీ ఏనగరంలో ప్రారంభించనున్నారు.
8) ఈ క్రింది ఏ దేశానికి చెందిన యుకాన్ రాష్ట్ర ప్రభుత్వం 10వ పాలనాధికారిగా భారత సంతతికి చెందిన రంజ్ పిళ్ళై ఎన్నికయ్యారు.
9) భారత కేంద్ర ప్రభుత్వం నగరాల్లో గాలికాలుష్యాన్ని తగ్గించటం కోసం NCAP (National Clean Air Programm)ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
10) ఈ క్రింది ఏదేశంలో బర్డ్ ఫ్లూ ను నియంత్రించడం కోసం 1 కోటి కోళ్ళను ఆదేశ ప్రభుత్వం వధించింది.
11) ఈ క్రింది ఏదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 13మంది మరణించడం జరిగింది.
12) భారత ప్రధాని మోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు.
13) భారతవ్యవసాయ గణాంకాల 2021 నివేదిక ప్రకారం వ్యవసాయరంగ విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లక్షల రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ గణాంక నివేదిక స్పష్టంచేసింది.
15) భారత రక్షణశాఖ ఎన్నికోట్లరూపాయల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.