| About us | Contact us | Advertise with us

Syllabus In Telugu PDF | AP TS TET DSC | APPSC | TSPSC | Constables

 Syllabus In Telugu PDF | AP TS TET DSC | APPSC | TSPSC | Constables            సిద్దం అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా పోటీ పెరిగిన ఈ నేపథ్యంలో అ... thumbnail 1 summary

 Syllabus In Telugu PDF | AP TS TET DSC | APPSC | TSPSC | Constables

          సిద్దం అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా పోటీ పెరిగిన ఈ నేపథ్యంలో అభ్యర్ధి ప్రిపరేషన్ ప్రారంభించిన తొలి రోజు నుంచి పరీక్ష రోజున అభ్యర్ధి ప్రగతి వరకూ ప్రతి అంశం కీలకంగా మారింది. చక్కగా సిలబస్ ను తెలుసుకోవడం, తగిన పుస్తకాలను ఎంచుకోవడం, ఎంచుకున్న పుస్తకాలను శ్రద్ధగా చదవడం, ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావడం, తగిన పరీక్షలను ప్రాక్టీస్ చేయడం, పరీక్ష రోజున ఉన్నతంగా ప్రగతిని కనబడరచడం ఇవన్నీ అభ్యర్ధి యొక్క విజయావకాశాలను నిర్ణయించేవే

Syllabus in Telugu pdf


          అభ్యర్ధి ప్రిపరేషన్ ప్రారంభించడంలో తొలి మెట్టు, తాను ప్రిపేర్ అవ్వాలనుకున్న పరీక్ష యొక్క స్వరూపం మరియు సిలబస్ ఏమిటో తెలుసుకోవడమే. ఎందుకంటే సిలబస్ పై సంపూర్ణ అవగాహన ఏర్పడినప్పుడు మాత్రమే అభ్యర్ధి తాను ఏ ఏ సబ్జక్టులలో మంచి స్కోరు సాధించగలడు, ఏ సబ్జక్టులపై మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, ఏ పుస్తకాలు ఈ సిలబస్ ను పూర్తిగా కవర్ చేయగలుగుతాయి వంటి విషయాలు తెలియడంతో పాటు ప్రిపరేషన్ సమయంలో తాను సిలబస్ లో ఉదహరించి ప్రతి అంశాన్ని చదువుతున్నానో లేదో తెలుసుకోవచ్చు.

          సాధారణంగా ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్ధులలో ఎక్కువశాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులే ఉంటుంటారు. వీరంతా తెలుగు మీడియంలో చదివిన వారు కావడం, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదివినా, ఏమంత పట్టు లేకపోవడం మూలంగా సిలబస్ ను తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఏ పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ లో అయినా సిలబస్ ను సంక్షిప్తంగా మరియు ఇంగ్లీష్ లో ఇవ్వడం పరిపాటి. AP/TS TET, DSC, APPSC, TSPSC, AP/TS POLICE JOBS మరియు ఇతర నోటిఫికేషన్స్ లో సిలబస్ ను ఇంగ్లీష్ లో ఇస్తుంటారు.

          ఇలా సిలబస్ ను ఇంగ్లీష్ లో చదివినా, అవగాహన ఏర్పడని తెలుగు మీడియం అభ్యర్ధులు ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ తెలుగులో ఉందేమో అంటూ ఎంక్వయిరీలు మొదలుపెడుతుంటారు. గూగుల్ లో Syllabus in Telugu అనో Syllabus pdf in telugu అనో సెర్చ్ చేసినా మొదట్లో వచ్చే చాలా వెబ్ సైట్ లలో సోది ఉంటుంది తప్ప సిలబస్ తెలుగులో కనిపించదు.

          ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండి సీరియస్ గా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని నవచైతన్య కాంపిటీషన్స్ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అధికారిక సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందిస్తోంది. ఈ అనువాదం కూడా ప్రామాణిక పాఠ్యపుస్తకాలను దగ్గర పెట్టుకుని సిలబస్ లోని పదానికి పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన సమానార్ధకాలను ఉపయోగిస్తూ, సిలబస్ చూసి, పుస్తకాలను చదవడం సులభం అనేంతగా చక్కని నాణ్యతతో సిలబస్ ను తెలుగులో నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

          ఈ NavaCHAITANYA Competitions Syllabus in telugu వెబ్ పేజిలో మీరు సిద్ధం అవుతున్న దాదాపు అన్ని పరీక్షలకు సంబంధించిన సిలబస్ యొక్క తెలుగు అనువాదప్రతులు లభిస్తాయి. అయితే ఈ తెలుగు అనువాదాలు అవగాహన కోసమే అని గుర్తించి అధికారిక సిలబస్ ను ఫాలో అవ్వవలసిందిగా కోరుచున్నాము.

Andhra Pradesh TET (AP TET-2022) Syllabus in Telugu PDF:

          ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సిద్ధం అయ్యే అభ్యర్ధులకు అధికారికంగా విడుదల చేయబడిన ఎపి టెట్ – 2022 సిలబస్ యొక్క తెలుగు అనువాదం నవచైతన్య కాంపిటీషన్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. క్రింది లింక్స్ ద్వారా ఎపి టెట్ -2022 సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

1. ఎపిటెట్ పేపర్-1(ఎ) సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

2. ఎపిటెట్ పేపర్-2(ఎ) గణితం/సైన్స్ సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్చేయండి

3. ఎపిటెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్చేయండి


Telangana TET-2022 Syllabus In Telugu PDF:

          తెలంగాణ లో టీచర్ ఉద్యోగాలను సాధించాలన్న ఆకాంక్షతో ముందుకు వెళ్లే అభ్యర్ధులు దాటాల్సిన మొదటి క్వాలిఫైయింగ్ పరీక్ష అయిన తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను మీరు ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

2. తెలంగాణ టెట్ పేపర్-2 (గణితం/సైన్స్) సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

3. తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

Andhra Pradesh TET (AP TET-2022) Syllabus in Telugu PDF:

          ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సిద్ధం అయ్యే అభ్యర్ధులకు అధికారికంగా విడుదల చేయబడిన ఎపి టెట్ – 2022 సిలబస్ యొక్క తెలుగు అనువాదం నవచైతన్య కాంపిటీషన్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. క్రింది లింక్స్ ద్వారా ఎపి టెట్ -2022 సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

1. ఎపిటెట్ పేపర్-1(ఎ) సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

2. ఎపిటెట్ పేపర్-2(ఎ) గణితం/సైన్స్ సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్చేయండి

3. ఎపిటెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్చేయండి

APPSC Executive Officer (Endowment Department) EO Grade-3 Syllabus in Telugu:

          ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (ఈవో గ్రేడ్-3) పోస్టుల భర్తీకై ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు క్రింది లింక్ నుంచి

ఎండోమెంట్ ఆఫీసర్స్ (ఈవో గ్రేడ్-3)

సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి

ఇక్కడ క్లిక్ చేయండి

APPSC Junior cum Computer Assistant (Group-4) Syllabus in Telugu

          ఎపిపియస్సీ నుంచి ఇటీవల విడుదల అయిన మరొక చక్కని నోటిఫికేషన్ జూనియర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4). పోస్టుల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు ప్రస్తుతం ఎపిపియస్సీ నుంచి వచ్చిన మొదటి నోటిఫికేషన్ కావడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్ధులు అప్లై చేసి, ప్రిపరేషన్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్ సిలబస్ తెలుగులో ఉందేమో అని వెతుకుతున్నారు. వీరికోసమే నవచైతన్య కాంపిటీషన్స్ జూనియర్ అసిస్టెంట్ సిలబస్ ను తెలుగులో అందిస్తోంది.

జూనియర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్-4 సిలబస్ ను

తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవడానికి

ఇక్కడ క్లిక్ చేయండి

APPSC Group-2 Syllabus in Telugu PDF

          ఎపిపియస్సీ నుంచి త్వరలో గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేషన్స్ రానున్నాయి. సిలబస్ లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ దాదాపుగా గ్రూప్-2 సిలబస్ గతంలో మాదిరిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూప్-2 కోసం లాంగ్ టర్మ్ లో సిద్ధం అయ్యే అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఎపిపియస్సీ గ్రూప్-2 సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో అందిస్తోంది.

ఎపిపియస్సీ గ్రూప్-2 సిలబస్ ను తెలుగులో

పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి

ఇక్కడ క్లిక్ చేయండి

Grama Sachivalayam Syllabus in Telugu:

          ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో ఒకటి ‘గ్రామ సచివాలయాలు’ ఏర్పాటు చేయడం. ఈ ప్రయత్నంలో భాగంగానే నిరుద్యోగులకు వరంలా సుమారుగా లక్షన్నర గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహించడం జరిగింది. గ్రామ సచివాలయాలలో ఏర్పడుతున్న ఖాళీలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటంతో ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న గ్రామ సచివాలయ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను క్రింది లింక్స్ నుంచి మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

1. గ్రామ సచివాలయం డీటెయిల్డ్ సిలబస్ తెలుగులో – కేటగిరీ-1 (డిగ్రీ క్వాలిఫికేషన్) – ఇక్కడ క్లిక్ చేయండి

2. గ్రామ సచివాలయం – ఏఎన్ఎం సిలబస్ తెలుగులో – ఇక్కడ క్లిక్ చేయండి

3. గ్రామ సచివాలయం – వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సిలబస్ తెలుగులో – ఇక్కడ క్లిక్ చేయండి

4. గ్రామ సచివాలయం – వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ సిలబస్ తెలుగులో – ఇక్కడ క్లిక్ చేయండి

Constable Syllabus in Telugu PDF:

          కానిస్టేబుల్ ఉద్యోగం అనేది చాలా మంది నిరుద్యోగుల కల. ఒకింత భిన్నమైన వ్యక్తిత్వం కలిగి, తనదైన స్థానాన్ని సమాజంలో సంపాదించుకోవాలన్న ఆకాంక్షతో కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధం అవుతుంటారు. అటువంటి అభ్యర్ధులకు కానిస్టేబుల్ డీటెయిల్డ్ సిలబస్ ను తెలుగులో అందించి తద్వారా ప్రిపరేషన్ సరళతరం కావడానికి నవచైతన్య కాంపిటీషన్స్ సహకారం అందిస్తోంది.

కానిస్టేబుల్ సిలబస్ ను

తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి

ఇక్కడ క్లిక్ చేయండి

RRB NTPC, Group–D Syllabus in Telugu pdf:

          రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు గ్రూప్-డి మరియు ఎన్టీపీసీ సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడం కోసం చూస్తుంటారు. ఇటువంటి అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని ప్రీవియస్ పేపర్ల ఆధారంగా నవచైతన్య కాంపిటీషన్స్ ఎన్టీపీసీ మరియు గ్రూప్-డి సిలబస్ ను పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

1. RRB NTPC సిలబస్ ను తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

2. గ్రూప్-డి సిలబస్ ను తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

AP DSC – 2018 Syllabus in Telugu PDF:

          ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న ఆకాంక్షతో టెట్ పరీక్షను పూర్తి చేసుకుని డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు సిలబస్ పై అవగాహన కోసం ఎపి డియస్సీ 2018 సిలబస్ యొక్క తెలుగు అనువాదాలను అడుగుతున్న నేపథ్యంలో నవచైతన్య కాంపిటీషన్స్ ఎపి డియస్సీ 2018 సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో అందిస్తోంది.

1. డియస్సీ యస్జీటీ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

2. డియస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితము సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

3. డియస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

4. డియస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

5. డియస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి

6. డియస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి – ఇక్కడ క్లిక్ చేయండి