| About us | Contact us | Advertise with us

పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? | AP Police Constables / Sub Inspector Recruitment Notification

ది. 20.12.2019 నాటికి ఉన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని – దినపత్రికలు ఇతర సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని చేస్తున్న విశ్లేషణ – కేవలం అ... thumbnail 1 summary

ది. 20.12.2019 నాటికి ఉన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని – దినపత్రికలు ఇతర సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని చేస్తున్న విశ్లేషణ – కేవలం అవగాహన కోసం మాత్రమే అని అభ్యర్ధులు గుర్తించగలరు


ఎపి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుుడు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం లోకి వచ్చాక గ్రామ సచివాలయం పేరిట లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అంటూ ప్రకటించడంతో పాటుగా ఆ దిశగా కొన్ని అడుగులను వేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసు శాఖలో ఖాళీగా కానిస్టేబుల్, SI ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో చాలామంది ఉద్యోగార్ధులు, పోలీసు ఉద్యోగాల పట్ల ఆసక్తిని కలిగియున్న ఎందరో నిరుద్యోగులు సీరియస్ గా ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ కోసం వేయికళ్లతో ఎదురు చూడటం జరుగుతున్నది. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్/యస్ఐ నోటిఫికేషన్ సుమారుగా ఎప్పుడు ఉండవచ్చునో తెలిపేందుకు ఒక విశ్లేషణ

నిజానికి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని చాలా రోజుల క్రితమే వెల్లడించినప్పటికీ, మొదట ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటును ప్రాధాన్యత గల అంశంగా భావించి, ఆ దిశగా భర్తి ప్రక్రియను చేపట్టడంతో గ్రామ సచివాలయం మినహా ఇతర నోటిఫికేషన్లు అన్నీ ఆలస్యం అయినట్లుగా అవగతమవుతున్నది. అయితే ప్రస్తుతం దాదాపుగా గ్రామ సచివాలయం నియామకాలతో పాటు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చివరి అంకానికి చేరుకున్న విషయం విదితమే. కనుక ఇక మిగతా నోటిఫికేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం కలదు.

ఈ మధ్యకాలంలో జరిగిన ఒక బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ప్రతి యేటా జనవరి మాసంలో అప్పటి వరకూ ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, భర్తీ ప్రక్రియను నిర్వహిస్తామని, జనవరి మాసాన్ని ఉద్యోగాల భర్తీ మాసంగా ప్రకటిస్తామని తెలియచేశారు. ఈ ప్రసంగాన్ని విన్న అభ్యర్ధులు జనవరి నెలలో ఇతర ఉద్యోగాలతో పాటుగా పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా ఖాయమని భావించారు. అయితే ప్రస్తుతం తెలియవస్తున్న విషయమేమంటే జనవరి నెలలో భర్తీ ప్రక్రియ నిర్వహించడం కాకుండా, జనవరి నెలలో ఏ నెలలో ఏ పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నామో క్యాలెండర్ ను ప్రకటిస్తారని. కనుక బహుశా 2020, జనవరి మాసంలో 2020 లో చేపట్టబోతున్న నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నది.
ఈ క్యాలెండర్ ను ప్రకటించే పరిస్థితి ఉంటే దానిలో పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఎపిపియస్సీ స్థాయి ఉద్యోగాలు, గ్రామ సచివాలయం వ్యవస్థలో భర్తీకాని ఉద్యోగాలు, ఆఫీసు సబార్డినేట్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం కలదు. ఈ అన్ని ఉద్యోగాలలో ఇప్పటికే ఖాళీలను గుర్తించడంతో పాటు సూచనప్రాయంగా ఆర్ధిక శాఖ నుంచి కూడా అనుమతి పొందిన ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు. కనుక ప్రముఖ కోచింగ్ సెంటర్ నిర్వాహకుల అంచనాలను బట్టి జనవరి నెలలో ప్రకటించే క్యాలెండర్ లో తొలుత వచ్చే నోటిఫికేషన్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించే ఉంటుందని తెలియవస్తున్నది.

కనుక ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి జనవరి లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ను ప్రకటిస్తారు. ఈ క్యాలెండర్ లో తొలి భర్తీ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలే కావచ్చు. అదే కనుక జరిగితే ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్, మార్చి లేదా ఏప్రియల్ నెలలో వ్రాత పరీక్ష ఉండేందుకు అవకాశం ఉన్నది.

ఇది కేవలం అంచనా మాత్రమే వాస్తవ పరిస్తితులు దీనికి భిన్నంగా కూడా ఉండే అవకాశం కలదు. కనుక అభ్యర్ధులు ఇది ఒక సూచికగా భావించి, సాధ్యమైనంత శ్రద్ధగా సిద్ధం అవుతూ పోలీసు ఉద్యోగాన్ని సాధించాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నది.



exams.navachaitanya.net