| About us | Contact us | Advertise with us

పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ మరియు ప్రశ్నాపత్రం స్వరూపం | AP Police Constable Syllabus & Pattern of Question paper

పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ ఎలా ఉంటుంది? పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరియు సిలబస్ విషయంలో దాదాపు ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. దాదాప... thumbnail 1 summary

పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ ఎలా ఉంటుంది?
పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్ష సిలబస్ మరియు ప్రశ్నాపత్రం స్వరూపం
పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరియు సిలబస్ విషయంలో దాదాపు ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. దాదాపు గతం నోటిఫికేషన్ లలో వ్రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ నే ఈ సారి కూడా కొనసాగించేందుకు అవకాశం ఉన్నది. గత సిలబస్ సరళిని పరిశీలిస్తే పరీక్ష ఇలా ఉండబోతున్నది
1) జనరల్ ఇంగ్లీష్
2) అరిథ్ మెటిక్
3) జనరల్ సైన్స్
4) భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమము
5) ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
6) ఇంటెలిజెన్స్ రీజనింగ్ & మెంటల్ ఎబిలిటీ

సిలబస్ కఠినతా స్థాయి మరియు పరీక్షాపత్రం స్వరూపం ఎలా ఉండబోతున్నది?
పైన ఉదహరించిన సబ్జక్టులను కానిస్టేబుల్ మరియు యస్ ఐ వ్రాత పరీక్షలకు సిలబస్ గా నిర్ణయించడం జరిగింది. దాదాపుగా ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అడగటం జరుగుతున్నది. గత ప్రశ్నాపత్రాల సరళిని గమనించినపుడు వ్రాత పరీక్షలో ప్రశ్నలు సాధ్యమైనంతవరకూ కఠినంగానే అడుగుతన్న తీరును గమనించవచ్చు. కనుక అభ్యర్ధులు 6 నుంచి ఇంటర్ వరకూ పాఠ్యపుస్తకాలను సేకరించుకుని లాంగ్ టర్మ్ లో సిద్ధం కావడం ద్వారా మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చు.

ఈ వ్రాత పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలను అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లను ఇచ్చి సరియైన సమాధానం రాబట్టే దిశగా ప్రశ్నలు ఉంటాయి. గత పరీక్షల సరళిని పరిశీలించినపుడు జనరల్ ఇంగ్లీష్ నుంచి సుమారు 30 ప్రశ్నలు, అరిథ్ మెటిక్ నుంచి 20 ప్రశ్నలు రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు మరియు మిగతా 125 ప్రశ్నలు జనరల్ స్టడీస్ విభాగం నుంచి అడుగుతున్నట్లు గమనించవచ్చు.



exams.navachaitanya.net