జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 04. జంతువులు ఏమి తింటాయి?
6వ తరగతి
జనరల్ సైన్స్ – 03. జంతువులు ఏమి తింటాయి?
---
+ కొన్ని జంతువులు ఆహారం
కోసం కేవలం మొక్కలమీద ఆధారపడతాయి.
+ కొన్ని జంతువులు ఆహారం
కోసం కేవలం జంతువుల మీద ఆధారపడతాయి.
+ మరికొన్ని జంతువులు
మొక్కలు మరియు జంతువులపై ఆహార అవసరాల నిమిత్తం ఆధారపడతాయి.
+ ఆహారం కోసం కేవలం
మొక్కలపై ఆధారపడే జంతువులను శాఖాఖారులు అంటారు.
+ ఆహారం కోసం ఇతర
జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు.
+ ఆహారం కోసం మొక్కలు
మరియు జంతువులు రెండింటిపై ఆధారపడేవాటిని ఉభయాహారులు అంటారు.
+ జంతువులు ఆహార సేకరణ
కోసం తమదైన పద్ధతులను అనుసరిస్తాయి.
+ మన పరిసరాలలో ఉన్న
మొక్కలు, జంతువులు ప్రధాన ఆహారపు వనరులు.
+ దాదాపుగా జంతువులన్నీ
తరచూ దొరికే ఆహారాన్ని తీసుకుంటాయి.
+ దానికోసమై ఆహారం కోసం
జంతువులు అన్వేషించాల్సిఉంటుంది.
+ జంతువుల ఆహారాన్వేషణలో
జ్ఞానేంద్రియాలు సహకరిస్తాయి.
+ వాసన, చూపు, వినడం,
స్పర్శను ఉపయోగించుకుని ఆహారాన్ని సేకరించుకుంటాయి.
+ కొన్ని జంతువులు ఆహార
సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపై ఆధారపడతాయి.
+ కుక్క వాసన ద్వారా
ఆహారాన్ని అన్వేషిస్తుంది.
+ గద్దలు ఉన్నతమైన చూపు
ద్వారా ఆహారాన్ని అన్వేషిస్తాయి.
+ గబ్బిలాలు వినికిడిపై
ఆధారపడి ఆహారాన్ని అన్వేషిస్తాయి.
+ సరీసృపాలు వాసన చూడటం
ద్వారా ఆహారాన్ని అన్వేషిస్తాయి.
+ నీటిపైన ఈదే కీటకాలు
నీటి ఉపరితలంపై ఏర్పడే అలజడులను బట్టి ఆహారాన్ని గుర్తించి ఆ దిశగా కదులుతాయి.
+ ఆహారాన్ని వెతకడంతో
పాటు సేకరించడం లేదా పట్టుకోవడం కూడా కీలకమే.
+ ఆహార సేకరణ మరియు
పట్టుకోవడం కోసం నోటి భాగాలు, చేతులు లేదా కాళ్లు ఉపకరిస్తుంటాయి.
+ కుక్కలు నాలుకను
నాకడానికి ఉపయోగిస్తే, కప్ప, ఆహారాన్ని పట్టుకుని మింగడానికి ఉపయోగిస్తుంది.
+ ఆహారంగా కీటకాలను
పట్టుకోవడానిక కోళ్లు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి.
+ పక్షుల యొక్క ముక్కులు
అవి తీసుకునే ఆహారంబట్టి మారుతాయి.
+ ఒక జంతువు తినే
ఆహారము దానిని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది.
+ పీల్చడనము, నాకడము,
ఏరడము, నమలడము, మింగడము మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి.
+ వివిధ రకాలైన
ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కులలో వైవిధ్యం ఉంటుంది.
+ వడ్రంగి పిట్టకు ఉన్న
బలమైన ముక్కును ఉపయోగించి అది చెట్ల బెరళ్లను తొలగించి వాటి క్రింద ఉండే చీమలను,
చెదలను, పురుగులను తింటుంది.
+ కొంగ తన పొడవాటి
ముక్కుతో నీటిలోని చేపలను పడుతుంది.
+ గ్రద్ధకు ఉండే బలమైన
ముక్కు జంతువుల మాంసాన్ని చీల్చేందుకు వీలుగా ఉంటుంది.
+ పండ్లు విత్తనాలను
కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది.
+ జంతువుల మాంసాన్ని
చీల్చడానికి వీలుగా కొన్ని పక్షులకు వాడిగా ఉండే గోర్లతో పాటు బలమైన కొక్కెం వంటి
ముక్కు ఉంటుంది. ఉదాహరణకు గ్రద్ద.
+ తేనెపిట్ట వంటి వాటికి
పొడవాటి, సన్నని ముక్కు ఉంటుంది. వాటికి వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు.
+ మన పరిసరాలలో నివసించే
కాకులు సాధారణంగా వృధాగా పారేసిన, కుళ్లిన ఆహార పదార్ధాలను, చనిపోయిన జంతువుల
మొదలైన వాటిని తింటాయి.
+ మన పరిసరాలు శుభ్రంగా
ఉంచడంలో కాకులు సహకరిస్తాయి కనుక వీటిని ‘సహజ పారిశుధ్య కార్మికులు’ అంటారు.
+ కాకులతో పాటు గ్రద్ధలు
కూడా సహజ పారిశుధ్య కార్మికులే.
+ కప్ప జిగురుగా ఉండే
పొడవైన నాలుకను కీటకం వైపు విసిరి, కీటకం నాలుకకు అంటుకున్న తరువాత దానిని
లాక్కొని మింగేస్తుంది.
+ ఆవు, మేక,
బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక వంటి జంతువులు పచ్చి/ఎండు గడ్డి, ఆకులు,
కొమ్మలు తింటాయి. ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడే ఈ తరహా జంతువులను శాకాహారులు
అంటారు.
+ ఆవు, గేదె, ఒంటె
మొదలైన జంతువులు ఆహారాన్ని మొదట గబగబా నమిలి, జీర్ణాశయంలో ఒకభాగంలో నిలువ
చేస్తాయి.
+ కొంత సమయం తరువాత
మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్లీ బాగా నములుతాయి.
దీనినే నెమరువేయుట అంటారు.
+ క్రేన్ ఫ్లై
లార్వాదశలో ఉన్నపుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటుంది కానీ ప్రౌఢ జీవిగా అది మారిన
తరువాత దానికి ఆహారాన్ని తినవలసిన అవసరమే ఉండదు.
+ కుక్కలు, సింహము,
నక్క, తోడేలు, పులి వంటి జంతువులకు మాంసాన్ని చీల్చడానికి తగినట్లుగా పదునైన
దంతాలు ఉంటాయి.
+ వేటాడే జంతువులకు
పరుగెత్తడానికి బలమైన కాళ్లు పట్టుకోవడానికి పదునైన గోర్లు, మాంసం చీల్చడానికి
పదునైన దంతాలు ఉంటాయి.
+ కుందేళ్లకూ ఉడతలకూ
ఉండే పండ్లను ఉపయోగించుకుని అవి గింజలు, దుంపలు, ఆకులను కొరికి తింటాయి.
+ కుక్క లేదా పిల్లికి
నోట్లో పదునైన దంతాలు అండటం మనం చూడవచ్చు. వీటితో అవి జంతువుల మాంసం చీల్చి
తింటాయి.
+ బాతులకు ఉండే దంతాలు
నీటి నుంచి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి.
+ చేపలకు ఉండే పళ్లు కూడా
బాతులవలె ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడతాయి.
+ పశువులు, మనుషుల
చర్మాలకు అంటుకునే జలగలు రక్తాన్ని పీల్చుకుంటాయి.
+ రక్తాన్ని పీల్చడానికి
జలగ నోటిచుట్టూ ‘చూషకాలు’ అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
+ బొద్దింకలు, ఎడారి
సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ (రెక్కలపురుగు)లు, ఇలకోడి మొదలైన
జంతువులు రాత్రివేళలోనే ఆహారాన్ని సేకరిస్తాయి.
+ పగటి వేళలో చీకటి
ప్రదేశాలలో దాక్కుని, రాత్రిపూట, చీకటి ప్రదేశాలలో మాత్రమే తిరిగే జంతువులను
‘నిశాచరులు’ అంటారు.
+ ప్రకృతిలో మొక్కల,
జంతువుల ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది.
+ కొలనులో గుడ్లు,
లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి.
+ ఆహారపు అలవాట్లను
బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు అవుతుంది.
+ ఆహారపు గొలుసు
ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని, జీవవైవిధ్యాన్ని తెలుపుతుంది.
+ ఆహారపు గొలుసులు
ఎల్లపుడూ సరళరేఖలో ఉండాల్సిన అవసరంలేదు. అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం
ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహారజాలకంగా ఏర్పడతాయి.
+ ఆహారపు గొలుసులతో
ఆహారపు జాలకము ఏర్పడుతుంది.
+ ఆహారపు జాలకంలో
జంతువులు ఆహారం కోసం ఒకటి కంటే ఎక్కువ రకాల ఆహారపు వనరులపై ఆధారపడతాయి.
+ ప్రస్తుత కాలంలో
పంటలను కాపాడటానికి ఉపయోగించే అనేక పురుగుమందులు, కీటకనాశనులు అనేక కప్పలు
చనిపోవడానికి కారణము అవుతున్నాయి.
+ ఆహారపు గొలుసులో ఏ
స్థానంలో అంతరాయం ఏర్పడ్డా అది మొత్తం ఆహారపు జాలకాన్ని ప్రభావితం చేస్తుంది.
+ చీమలదండులోని కూలీ
చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమలకోసం ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలను
నిర్వహిస్తాయి.
+ మనం ఆవులను పాలకోసం
పెంచినట్లు, చీమలు ‘హనీ డ్యూ’ అనే పదార్ధం కోసం ‘ఏపిడ్స్’ అనే కీటకాలను పెంచుతాయి.
+ చీమలు ఒకరకమైన
శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి
ఒక పాన్పు వలె తయారుచేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి.
ఇవి కూడా . . .
+ 600
మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
+ పెంగ్విన్,
ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగురలేవు.
+ కొన్ని
రకాల కోతులు మాంసాహారులవలె ఇతర జంతువులను తింటాయి.
+ జంతువులను
ఆరు ప్రాధమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకసేరుకాలు, చేపలు, ఉభయచరాలు,
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
+ ప్రస్తుతం
భూమి మీద జీవించియున్న జంతుజాలంలో 5400 ల క్షీరద జాతులు నివసిస్తున్నాయి.
+ స్పంజికలు
అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి.
+ జంతువులు
పరపోషకాలు అవి తమకై తాము ఆహారాన్ని తయారుచేసుకోలేవు.
+ జంతువులలో
నీలి తిమింగలం చాలా పెద్దది
+ నీలి
తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగియుంటుంది.
+ 150
మిలియన్ల సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాలనుంచి పక్షులు ఉద్భవించాయి.
+ ఎడారి
జంతువులు చాలావరకూ నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియలలో
నివసిస్తాయి.
+ చిరుతపులి
పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాలపాటు జీవిస్తుంది.
+ పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడమే.