జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 06. ఆవాసం
6వ తరగతి
జనరల్ సైన్స్ – 06. ఆవాసం
---
+ కొలను అంచులల వెంబడి
ఉండే గుబురుగా ఉన్న మొక్కల ఆకుల పై చేపగుడ్లను గమనించవచ్చు.
+ సాధారణంగా మన చుట్టూ
అనేక జీవులు నివసిస్తుంటాయి.
+ కొన్ని జీవులు భూమిపైన
నివసిస్తుంటాయి. మరికొన్ని భూమిలోపల నివసిస్తుంటాయి. ఇంకొన్ని జీవులు నీటిలోపల,
నీటిపైన కూడా జీవిస్తుంటాయి.
+ ఒక్కొక్కప్పుడు రకరకాల
జంతువులు ఒకే ప్రదేశంలో నివసిస్తాయి.
+ ప్రతి జీవికి అవసరాలు
వేరు వేరుగా ఉంటాయి.
+ సాధారణంగా జీవులన్నీ
ఎక్కువగా తమ అవసరాలు తీర్చే స్థలంలో అంటే తగినంత ఆహారం లభించే స్థలంలో, నివాసం
లభించే స్థలంలో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోట ఉంటాయి.
+ జీవులన్నీ ఆహారం,
నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపైన ఆధారపడతాయి.
+ జీవి యొక్క అవసరాలన్నీ
తీర్చే పరిసరాలను ఆ జీవి ఆవాసంగా వ్యవహరిస్తారు.
+ ఉదాహరణకు కొలను
మంచినీటి రొయ్యల ఆవాసం. కొలను చేపలకు కూడా ఆవాసమే.
+ కాకి చెట్లపైన గూడు
కడుతుంది కనుక కాకికి చెట్టు ఆవాసము అవుతుంది.
+ కొన్ని కీటకాలు గేదె
చర్మముపై నివాసం ఉంటుంటాయి. కనుక వాటికి గేదె చర్మము ఆవాసం అవుతుంది.
+ సాధారణంగా ఒక
ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్య ఆ ప్రదేశము యొక్క స్థల వైశాల్యంపై ఆధారపడుతుంది.
+ స్థల వైశాల్యం
పెరిగితే జీవుల సంఖ్య కూడా పెరుగుతుంది.
+ ఎక్కువ వైశాల్యం గల
ప్రదేశాలు ఎక్కువ జీవులు జీవించడానికి అవకాశం కల్పిస్తాయి.
+ కొలనులో లభించే
ఆహారపదార్ధాలు, గాలి, సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జీవులు వివిధ
ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి.
+ తూనీగ, మేఫ్లై,
లకుముకిపిట్ట, నీటికాకుల్లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలంపైన ఎగురుతూ
కనిపిస్తాయి.
+ ఒక్కొక్కసారి నీటి
కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు, నీళ్లనుంచి పైకి చొచ్చుకుని వచ్చిన కర్రల మీద
ఇవి వాలుతూ, అక్కడ నుంచి ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి.
+ నత్తలు, తిరుగుడు
పురుగు మరియు గుంట గురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి.
+ తూనీగలు, మేఫ్లై,
డింభకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి.
+ అంతర తామర, బుడగ తామర
వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతున్నట్లు ఉంటాయి. అయితే వీటి
వేళ్లు మాత్రం కొలను అడుగున నేలలో విస్తరించి ఉంటాయి.
+ నీటి ఉపరితలంపై
నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉండటం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ.
+ అయితే నీటి ఉపరితలంపై
జీవించే జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహారపదార్ధాలు, సూర్యరశ్మి లభిస్తుంది.
+ గాలి, ఆహార పదార్థాల
కోసమే చేపలు తరచుగా నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి.
+ నీటి బొద్దింకలు, జలగ,
దోమ డింభకాలు ఉపరితలానికి లోపల గానీ, కొలను మధ్య ప్రాంతంలో కానీ కనిపిస్తుంటాయి.
+ చేపలు, పీతలు వంటివి
కూడా కొలను మధ్య ప్రాంతంలో నివసిస్తుంటాయి.
+ కొలను అంచులలో వివిధ
రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలైనవి ఉంటాయి.
+ చేపలు కొలను అంచులలోనే
గ్రుడ్లు పెడతాయి.
+ కొలను ఉపరితలంలో
కొంగలు ఉంటాయి.
+ కొలను అడుగున
హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగుల, మెగ్గాట్ (కీటకాల డింభకాలు)
కనబడుతుంటాయి.
+ కొలను అడుగుభాగం
ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది. కాని చనిపోయి కుళ్లిపోయిన పదార్థాలు ఆహారంగా
ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి.
+ నీటి ఉపరితలంపైన
పెరిగే మొక్క పత్రాలకు, నీటి అడుగుభాగాన పెరిగే మొక్క పత్రాలకు మధ్య బేధం ఉంటుంది.
+ నీటిలో ఉండే మొక్కలను
నీటి మొక్కలు అనీ, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని, వీటి ఆవాసాన్ని జలావాసం అని
అంటారు.
+ భూమిపైన అనేక రకాల
జలావాసాలు ఉన్నాయి. చెరువులు, గుంటలు, కొలనులు, వర్షపు నీటి గుంటలు, తోటలో గుంటలు
ఇలా చిన్న చిన్న నీటి ఆవాసాలతో పాటుగా పెద్ద పెద్ద నీటి ఆవాసాలైన ఉప్పునీటి
సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి.
+ చెట్టు వివిధ రకాల
జంతువులకు ఒక మంచి స్థావరము. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు మొదలైన వాటితో
పాటు చెట్టు బెరడుపైన చిన్న మొక్కలు పెరగడాన్ని గమనించవచ్చు.
+ ఎండ, చలి, వానల నుండి
రక్షణ పొందడానికి మనము ఇండ్లలో నివసిస్తాము. అంతే కాకుండా ఇండ్లు మనకు ఉండటానికి
స్థలాన్ని ఇస్తాయి.
+ కొన్ని జంతువులను,
పక్షులను మన ఇండ్లలో పెంపుడు జంతువులుగా పెంచుకుంటాము.
+ కొన్ని కూరగాయలు,
పండ్లు ఇచ్చే మొక్కలను పెంచుకుంటాము.
+ కుక్కలు, పిల్లులు,
మేకలు, ఆవులు, పక్షులు (కోడి, బాతు, పావురం) సాలెపురుగు, చీమలు, బొద్దింకలు మొదలైన
అనేకరకాల జంతువులకు మన ఇల్లు ఒక ఆవాసము.
+ మనీప్లాంట్, క్రోటన్స్
వంటి మొక్కలకు కూడా ఇల్లు ఒక ఆవాసము.
+ చింత, మామిడి, ఉసిరి
మొదలైన చెట్లు అడవులలోనూ, ఇండ్లలోనూ, తోటలలోనూ పెరుగుతాయి.
+ నేలపైన వివిధ
ప్రదేవాలలో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, ఇండ్లలో, పొలాల్లో, అడవులలో
నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి.
+ నేలపైన ఉండే అన్ని
రకాల ఆవాసాలను కలిపి ‘భౌమ ఆవాసాలు’ అంటారు.
+ సముద్ర తీర ప్రాంతాలలో
పెరిగే మొక్కలను మడ అడవులు అంటారు.
+ మడ అడవులు సముద్ర తీరప్రాంతాలలో,
కోస్తా జిల్లాలలో కనబడతాయి.
+ ద్రాక్ష తోటలను
తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు.
+ బ్రహ్మజెముడు, తుమ్మ,
కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది.
+ బ్రహ్మజెముడు, తుమ్మ,
కలబంద వంటి మొక్కలను ఎడారి మొక్కలు అంటారు.
+ ఒంటెలు ఎడారి
ప్రాంతంలో మాత్రమే జీవిసత్యి.
+ ఎడారి మొక్కలు,
జంతువులు పొడి వాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉంటాయి.
+ పాములు, ఎలుకల వంటి
బొరియలలో నివసించే జంతువులు కూడా ఉంటాయి.
+ ఎడారిలోని వివిధ
ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి.
+ కోకిల పాటలను వసంత
రుతువులో మాత్రమే వింటాము.
+ వర్షాకాలంలో మాత్రమే
కొంగలను చూస్తుంటాము.
+ రకరకాల పక్షులు చాలా
దూరప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి.
+ అక్టోబర్ నుంచి మార్చి
వరకూ కొల్లేరు, పులికాట్ సరస్సు ప్రాంతాలలో పెలికాన్ పక్షులు కనబడతాయి.
+ కర్నూలు జిల్లాలో
‘బట్టమేక పిట్ట’ అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది.
+ సాధారణంగా
ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు
ఎగురుతూ వస్తుంటాయి.
+ తాబేళ్లు, చేపలు కూడా ఒక
ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తుంటాయి.
+ కొన్ని రకాల తాబేళ్లు
పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల నుంచి విశాఖపట్నం తీరానికి గుడ్లు
పెట్టడానికి వస్తుంటాయి.
+ పులస చేపలు కూడా గోదావరి
నీటి ప్రవాహానికి ఎదురీది వలస వస్తుంటాయి.
+ ఉష్ణోగ్రత, తేమ, గాలి,
నీరు, ఆహారం, నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్యమైన అంశాలు.
+ ఆవాసాలను సాధారణంగా
రెండు రకాలు గా విభజిస్తారు. అవి భౌమ (నేల) ఆవరణ వ్యవస్థ, జల (నీరు) ఆవరణ వ్యవస్థ.
+ ఆవాసాలు ప్రకృతి
వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
+ సుఖవంతమైన జీవితాన్ని
గడపడానికి పక్షులు తరచుగా ఆవాసాలను మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని పక్షులు
గుడ్లు పెట్టడానికి ఆవాసాలను మారుస్తూ ఉంటాయి.
---
ఇవి కూడా . . .
+ షార్క్
చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మి.మీ., పొడవు ఉంటుంది.
+ ఆల్ఫైన్ పర్వత
ఆవాసాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు
+ పర్వత
ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది.
+ నదులు,
సముద్ర తీరాలలో నేల, నీరు కలిసేచోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం,
పునరుత్పత్తికోసం నివసిస్తాయి.
+
సముద్రగర్భంలో మైళ్ల కొద్దీ వ్యాపించి ఉండే ‘కోరల్ రీఫ్’ కూడా ఒక ఆవాసమే
+ ఎడారి
ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి.
+ భూగోళం
మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో మూడువంతుల వృక్షజాలమే ఉంటుంది.
+ సవానా
గడ్డిభూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది.
+ కుంటలు,
చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలవలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే
పరిగణిస్తారు
+ నదులలోని
మంచినీరు సముద్రాలలోని ఉప్పునీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు (మాంగ్రూవ్)
పెరుగుతాయి.
+ భూమి మీద విస్తరించియున్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ల
నీరు ఉంటుంది.