| About us | Contact us | Advertise with us

6వ తరగతి జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 05 పదార్ధాలు - వస్తువులు | General Science Study Material - 6th Class - Materials and Things

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 05. పదార్థాలు - వస్తువులు డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప... thumbnail 1 summary

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 05. పదార్థాలు - వస్తువులు

materials and things
డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


6వ తరగతి జనరల్ సైన్స్ – 05. పదార్దాలు - వస్తువులు
---
+ సాధారణంగా ప్రతి వస్తువు ఏదో ఒక పదార్ధముతో తయారవుతుంది.
+ కొన్ని వస్తువులను తయారుచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కూడా అవసరం కావచ్చు.
+ ఉదాహరణకు పెన్నులో గొట్టము ప్లాస్టిక్ తోనూ, క్లిప్ స్టీలుతోనూ తయారవుతుంది.
+ వస్తువులు అన్నీ వేరు వేరు పదార్థాలతో తయారై ఉంటాయి.
+ అలాగే ఒకే పదార్థం నుంచి వేరు వేరు వస్తువులను తయారుచేయవచ్చు.
+ వస్తువు యొక్క ఉపయోగం అనుసరించి ఏ పదార్థంతో తయారుచేయాలన్న విషయం నిర్ణయించబడుతుంది.
+ అలాగే పదార్థాలకు ఉండే ధర్మాలు మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండటం, మెరుపు లేకపోవడం వంటి ధర్మాలు ఏ వస్తువులను తయారుచేయగలమో నిర్ణయిస్తాయి.
+ అవతలి వస్తువులను స్పష్టంగా చూసేందుకు అవకాశం ఇచ్చే పదార్ధాలను పారదర్శక పదార్ధాలు అంటారు.
+ గాజు ఒక పారదర్శక పదార్ధము. అందుకే దుకాణదారులు మిఠాయి దుకాణాలలో తినుబండారాలను గాజు పెట్టెలలో అమర్చుతారు.
+ చెక్క, స్టీలు, కార్డుబోర్డు వంటి కొన్ని పదార్ధాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను ’అపారదర్శక పదార్థాలు’ అంటారు
+ మరికొన్న పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలము కానీ స్పష్టంగా చూడలేము. అటువంటి వాటిని ‘పాక్షిక పారదర్శక పదార్థాలు’ అంటారు.
+ నూనెలో ముంచిన కాగితము పాక్షిక పారదర్శక పదార్థానికి చక్కని ఉదాహరణ.
+ మంచు ముక్కలను ఒక గ్లాసులో తీసుకుని వేడిచేసినపుడు అవి క్రమంగా కరగడం గమనించవచ్చు. పూర్తిగా కరిగిన తరువాత ఆ నీటిని తీసుకుని వేడిచేసినపుడు కొద్ది సమయం తరువాత నీరు ఆవిరిగా మారడాన్ని గమనించవచ్చు.
+ అంటే వేడిచేసినపుడు కొన్ని పదార్ధాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారతాయి.
+ అదేవిధంగా చల్లబరచినపుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారతాయి.
+ కావునా సాధారణ ఉష్ణోగ్రతను బట్టి పదార్ధాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు.
+ నీరు వంటి పదార్థాలు అవి ఉంచిన పాత్రను బట్టి ఆకారాన్ని పొందుతాయి.
+ చెక్క వంటి పదార్థాలు నిర్ధిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటికి ఆకారాన్ని మార్చుకునే లక్షణం ఉండదు.
+ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలనై నీరు, పాలు, కిరోసిన్ వంటి వాటిని ద్రవపదార్థాలు అంటారు.
+ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు వంటి పదార్థాలను ‘ఘన పదార్థాలు’ అంటారు.
+ పంచదార పోసిన పాత్ర ఆకారాన్ని పొందుతున్నప్పటికీ అది ద్రవపదార్థం కాదు. పంచదార స్పటికము ఘన పదార్తము.
+ సాధారణంగా కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి. మరికొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి.
+ ఇనుముతో తయారైన ఇనుప మేకు నీటిలో మునుగుతుంది. ఇనుముతోనే తయారైన ఖాళీ డబ్బా మాత్రం నీటిపై తేలుతుంది.
+ అంటే నీటిలో మునిగే స్వభావము పదార్థం మీదనే కాక అది ఉన్న ఆకారంపై కూడా ఆధారపడుతుంది.
+ నీటిలో మునిగే వస్తువులను ఆకారాన్ని మార్చడం ద్వారా తేలేలా చేయవచ్చు. కానీ నీటిలో తేల స్వభావం గల వస్తువులన్నింటినీ మునిగేటట్లు చేయలేము.
+ కొన్ని పదార్థాలు నీటిలో కలిపినపుడు పూర్తిగా కరుగుతాయి. ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు.
+ వెనిగర్, నిమ్మరసము వంటివి నీటిలో కరిగే పదార్థాలు.
+ మరికొన్ని పదార్థాలు నీటిలో కలిపినపుడు కరగవు. ఇటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటారు.
+ కొబ్బరి నూనె, కిరోసిన్ వంటివి నీటిలో కరగని పదార్థాలకు ఉదాహరణలు.


ఇవి కూడా . . .
+ ఒక వస్తువు రంగు దానినుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది
+ ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం.
+ ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది.
+ నీటి సాంద్రత 1 గ్రా/మి.లీ. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రా/మి.లీ. కన్నా తక్కువ ఉండాలి.
+ మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండటం వల్ల నీటిపై తేలుతుంది.
+ ‘క్యాండిల్’ అనే పదము ‘క్యాండేర్’ అనే లాటిన్ పదము నుంచి వచ్చింది. క్యాండేర్ అంటే అర్ధం మెరుపు.
+ బివ్యాక్స్ తో తయారుచేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగియుంటాయి. తక్కువ పొగనిస్తాయి.
+ ఒక పారదర్శక పదార్దం గుండా ఏ రంగు కాంతికిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణము బయటకు వస్తుంది.
+ పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది.



exams.navachaitanya.net