| About us | Contact us | Advertise with us

7వ తరగతి గణితము స్టడీ మెటీరియల్ - 02. భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు | Mathematics Study Material - 7th Class - Fractions, Decimals And Rational Numbers

మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ - 7వ తరగతి - 02. భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప... thumbnail 1 summary

మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ - 7వ తరగతి - 02. భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు

డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు గణితము/అరిథ్ మెటిక్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


7వ తరగతి గణితము – 2. భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు
---
+ మొత్తములో కొంత భాగాన్ని సూచించేందుకు భిన్నములను ఉపయోగించడం జరుగుతుంది.
+ భిన్నములో పై సంఖ్యను లవము అని, క్రింది సంఖ్యను హారము అని పిలుస్తారు.
+ లవము, హారము కన్నా తక్కువగా ఉండే భిన్నములను క్రమ భిన్నములు అంటారు.
  ఉదాహరణకు     2/3,    5/9,    14/15     మొదలైనవి క్రమ భిన్నములు
+ లవము, హారము కన్నా ఎక్కువగా ఉండే భిన్నములను అపక్రమ భిన్నములు అంటారు.
  ఉదాహరణకు 5/3,  19/17,  24/10 మొదలైనవి అపక్రమ భిన్నములు
+ పూర్ణాంక భాగము మరియు భిన్న భాగము రెండూ కలిగియున్న భిన్నములను మిశ్రమ భిన్నములు అంటారు.
  ఉదాహరణకు 8  3/2
+ హారములు సమానంగా ఉండే భిన్నములను సజాతి భిన్నములు అంటారు.
  ఉదాహరణ 1/5, 2/5, 3/5, 4/5
+ హారములు సమానముగా లేని భిన్నములను విజాతి భిన్నములు అంటారు.
  ఉదాహరణ 1/5, 3/7, 4/9
+ భిన్నములను సంకలనము లేదా వ్యవకలనము చేయవలెనన్నపుడు వాటిని సజాతి భిన్నములుగా మార్చవలెను.
+ ఒక భిన్నము యొక్క లవ హారములను ఒకే సంఖ్యతో భాగించిన లేదా గుణించిన యెడల ఆ భిన్నము యొక్క విలువ మారదు.
+ భిన్నములను పూర్ణాంకముచే గుణించు సందర్భములలో పూర్ణాంకమును, లవమును గుణించాల్సియుంటుంది.
+ ఒక పూర్ణాంకమును, మిశ్రమ భిన్నముచే గుణించవలెనంటే మొదట మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నముగా మార్చి ఆ తరువాత పూర్ణాంకము చేత గుణించాలి.
+ క్రమ, అప క్రమ భిన్నాలను పూర్ణాంకాలతో గుణించునపుడు భిన్నంలో గల లవమును పూర్ణాంకముచే గుణించి, దానిని లబ్ధములో లవముగానూ, భిన్నంలో హారమును లబ్ధములో హారముగానూ వ్రాస్తాము.
+ ఒక భిన్నమును మరొక భిన్నముతో గుణించవలసిన సందర్భములో లవములను విడివిడిగానూ, హారములను విడివిడిగాను గుణించి వాటిని వరుసగా లవ, హారములుగా రాసి లబ్ధమును గుర్తించవలెను.
+ అంటే రెండు భిన్నముల లబ్ధము = (లవముల లబ్ధము) / (హారముల లబ్ధము)
+ పూర్ణాంకాలను, భిన్నముతో భాగించాల్సిన సందర్భంలో అదే పూర్ణాంకమును, భిన్నము యొక్క వ్యుత్క్రమముతో గుణించాలి.
+ భిన్నములోని లవ, హారములను తారుమారు చేయగా లభించే భిన్నమును మొదటి భిన్నము యొక్క వ్యుత్క్రమము లేదా గుణకార విలోమము అంటారు.
  ఉదాహరణకు 3/5 యొక్క వ్యుత్క్రమము 5/3
+ ఒక పూర్ణాంకాన్ని, మిశ్రమ భిన్నంచే భాగించునపుడు, మిశ్రమ భిన్నాన్ని మొదట అపక్రమ భిన్నముగా మార్చి సాధించాలి.
+ మిశ్రమ భిన్నాలను పూర్ణాంకాలచే భాగించునపుడు, మిశ్రమ భిన్నాలను మొదట అపక్రమ భిన్నాలుగా మార్చి సాధన చేయాలి.
+ ఒక భిన్నము ను, మరొక భిన్నముచే భాగించవలెనన్న, మొదటి భిన్నమును రెండవ భిన్నము యొక్క వ్యుత్క్రమముచే గుణించవలెను.
+ దశాంశ బిందువు ( . ) గల సంఖ్యలు దశాంశ సంఖ్యలు.
+ దశాంశ సంఖ్యలో పూర్ణాంక భాగము, దశాంశ భాగము రెండూ ఉండును.
+ దశాంశ బిందువుకు కుడివైపున గల సంఖ్యా భాగాన్ని దశాంశ భాగము అంటారు.
+ దశాంశ బిందువుకు ఎడమవైపున గల సంఖ్యా భాగాన్ని పూర్ణాంక భాగము అంటారు.
+ దశాంశ సంఖ్యల సంకలనం లేదా వ్యవకలనంలో ఒకే స్థాన విలువలు కలిగిన అంకెలను కూడాలి లేదా తీసివేయాలి.
+ వ్యవకలనం లేదా సంకలనం సమయంలో దశాంశ స్థానాలు సమానం చేయడానికి కుడివైపున సున్నలను చేర్చవచ్చు.
+ దశాంశ సంఖ్యలను 10, 100, 1000 . . . వంటి సంఖ్యలతో గుణించినపుడు దశాంశ బిందువు కుడివైపుకు ఈ సంఖ్యలలో గల సున్నల సంఖ్యకు సమాన స్థానాలు జరుగుతుంది.
+ దశాంశ సంఖ్యలను 10, 100, 1000 . . . వంటి సంఖ్యలతో భాగించినపుడు దశాంశ బిందువు ఎడమవైపుకు ఈ సంఖ్యలలో గల సున్నల సంఖ్యకు సమాన స్థానాలు జరుగుతుంది.
+ దశాంశ సంఖ్యలను గుణించడం లేదా భాగించడం చేయు సందర్భంలో వాటిని భిన్న రూపానికి మార్చి గుణించడం లేదా భాగించడం చేయవలెను.
+ సంఖ్యా రేఖపై ఎడమవైపుకు పోవు కొలదీ సంఖ్య విలువ తగ్గుతూ పోతుంది.
+ సున్నకు ఎడమ ఎంత దూరం జరిగితే ఆ సంఖ్య అంత చిన్నది అవుతుంది.
+ భిన్నములను ధనాత్మక భిన్నములు, ఋణాత్మక భిన్నములు గా వర్గీకరించవచ్చు.
+ అకరణీయ సంఖ్యలు అనేవి పూర్ణ సంఖ్యలు, ధనాత్మక భిన్నాలు మరియు ఋణాత్మక భిన్నాలతో కూడిన ఒక పెద్ద సంఖ్యల సముదాయం.
+ ఈ సంఖ్యలన్నియూ రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా చెప్పవచ్చు.
+ p, q లు ఏవేని రెండు పూర్ణ సంఖ్యలు, q సున్నకు సమానం కానపుడు p/q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు.
+ అకరణీయ సంఖ్యలను పోల్చవలెనన్న ముందుగా వాటిని సజాతి భిన్నములుగా మార్చవలెను.
+ సమాన అకరణీయ సంఖ్యలు కావాలంటే ఇచ్చిన సంఖ్యలో లవ, హారాలలో గల పూర్ణ సంఖ్యలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి.
+ స్కాట్ లాండ్ కు చెందిన జాన్ నేపియర్ సంవర్గమానాలను రూపొందించాడు.
+ గుణకారాలకు నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టాడు.

+ అలాగే దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త కూడా నేపియరే.
Part-1
Part-2
Part-3 Will update here soon . . .



exams.navachaitanya.net