ఆన్ లైన్ క్లాసులను తీసుకుని లేదా యూట్యూబ్ క్లాసులను తీసుకుని పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ కాగలమా?
గతంలో ఆన్ లైన్ క్లాస్ లు, ఆన్ లైన్ పరీక్షలు దాదాపు కనిపించేవి కావు. నాకు గుర్తు . . . సుమారు 10 సంవత్సరాల క్రితం నవచైతన్య కాంపిటీషన్స్ ను మేము ప్రారంభించినపుడు ఈనాడు వారి ప్రతిభ వెబ్ సైట్, సాక్షి వారి ఎడ్యుకేషనల్ వెబ్ సైట్ మినహా ఎడ్యుకేషనల్ వెబ్ సైట్ లు దాదాపు లేవనే చెప్పాలి. మనబడి వంటి వెబ్ సైట్ లు అన్ని సర్వీస్ లతో పాటు అప్పుడప్పుడూ ఈ తరహా వ్యవస్థలను అందించేది. కానీ గత రెండు సంవత్సరాలుగా జియో పుణ్యమాని దాదాపుగా అనేక వెబ్ సైట్ లు ఆన్ లైన్ క్లాసులు అందిస్తామంటూ, ఆన్ లైన్ లో పరీక్షలను నిర్వహిస్తాంటూ ప్రకటనలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నాయి. అయితే వీటిలో కొన్ని పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులే అందిస్తున్నవి కాగా, మరికొన్ని ‘ఈ వ్యవస్థను మంచి ప్లాట్ పామ్’ గా భావించి నిష్ణాతులైన అధ్యాపకులతో వీడియోలను సిద్ధం చేసి అందుబాటులోకి తెస్తున్నవి.
కనుక అభ్యర్ధులు ఆన్ లైన్ క్లాసుల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటికే ఫాలో అయిన అభ్యర్ధులనుంచి సమాచారం సేకరించుకుని, ఏ వెబ్ సైట్ పూర్తిగా అన్ని సబ్జక్టులను కవర్ చేసేలా చక్కని ఆన్ లైన్ క్లాసులను అందిస్తుందో తెలుసుకుని చేరాల్సి ఉంటుంది. అలాగే నాణ్యమైన వీడియో క్లాసులు ఉచితంగా కావాలంటే దొరకవు. కనుక కొంచెం డబ్బు చెల్లించి అయినా మంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంస్థతో ప్రయాణం ప్రారంభించి విజయానికి చేరువయ్యేలా మన ఆలోచన ఉండాలి. మనం ఆన్ లైన్ క్లాసులను ఎంచుకోవడానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవాల్సియుంటుంది
1) పూర్తి సబ్జక్టులను కవర్ చేసేలా వారి ఆన్ లైన్ క్లాసులు ఉన్నాయా? లేక కొన్ని సబ్జక్టులకు మాత్రమే పరిమితమా?
2) అధ్యాయంలోని అన్ని అంశాలను కవర్ చేసేలా వీడియోలను ఇస్తారా? లేక పేరుకు ప్రతి చాప్టర్ కు ఇస్తున్నామని చెబుతూ ప్రతి చాప్టర్ కు ఓ పది, పదిహేను నిముషాల వీడియోలతో సరిపెడుతున్నారా?
3) ఆయా ఆన్ లైన్ క్లాసులను నిష్ణాతులైన అధ్యాపకులు చెబుతున్నారా? లేక జస్ట్ సాధారణ పరిజ్ఞానంతో బట్టీ పట్టిన సమాచారం చెబుతూ వీడియోలను సిద్దం చేస్తున్నారా?
4) ఆయా ఆన్ లైన్ క్లాసులకు సంబంధించిన రుసుము అందుబాటులో ఉందా? లేక మరీ ఎక్కువగా ఉన్నదా?
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తగిన పోర్టల్ ను ఎంచుకుని ఆన్ లైన్ క్లాసులను తీసుకోవడం మంచిది.