| About us | Contact us | Advertise with us

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఆన్ లైన్ లో దొరికే మెటీరియల్ ఉపయుక్తమేనా? | Is Online material or PDF useful for Police Constable Exams?

పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దొరకే మెటీరియల్ ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుంది? చాలా మంది అభ్యర్ధుల నుంచి వస్తున్న ప్రశ్న ఆ... thumbnail 1 summary

పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దొరకే మెటీరియల్ ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుంది?


పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఆన్ లైన్ మెటీరియల్ ఉంటుందా?
చాలా మంది అభ్యర్ధుల నుంచి వస్తున్న ప్రశ్న ఆన్ లైన్ లో దొరకే పిడిఎఫ్ మెటీరియల్స్ ను నమ్మి చదవవచ్చా? అని. అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తి కానిస్టేబుల్ మెటీరియల్ ను పిడిఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా ఖర్చుతో కూడిన పని. చాలా మంది అధ్యాపకుల సహకారంతో మాత్రమే అది నిర్వహించగలము. కనుక లాభాపేక్ష లేకుండా ఆ తరహా పనులను చేస్తున్న వెబ్ సైట్స్ అయితే మాకు ఇప్పటి వరకూ కనిపించలేదు. కొందరు నిష్ణాతులైన ఫ్యాకల్టీ మాత్రం వారి సబ్జక్టులకు సంబంధించిన చక్కని స్టడీ మెటీరియల్స్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ తరహా వ్యక్తులు పరిమితంగా మాత్రమే కనిపిస్తున్న కారణంగా నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ లో దొరికే మెటీరియల్స్ సహాయంతో కానిస్టేబుల్ పరీక్షను సాధించడం సాధ్యం కాదని నిస్సందేహంగా చెప్పగలదు.

మంచి ఫ్యాకల్టీ అని నమ్మి, ఆయా సబ్జక్టులకు సంబంధించిన పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్స్ ను ఎవరైనా మీకు అందిస్తే తప్పకుండా స్వీకరించండి చదవండి. అలా కాకుండా జస్ట్ ఒకటి రెండు చాప్టర్లో, ఒక్కో చాప్టర్లో ఒకటి రెండు పేజీల మెటీరియల్ నో అందిస్తే దానికి దూరంగా ఉండటం మంచిది. హార్డ్ కాపీ రూపంలో లభించే స్టడీ మెటీరియల్ ను కానీ లేదా మార్కెట్ లో దొరికే ప్రముఖ పబ్లికేషన్ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ ను కొనసాగించడం మంచిది.


exams.navachaitanya.net