| About us | Contact us | Advertise with us

6వ తరగతి జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 03 వర్షం ఎక్కడినుంచి వస్తుంది? | General Science Study Material - 6th Class - Rain: Where does it come from?

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 03. వర్షం ఎక్కడినుంచి వస్తుంది? డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్ర... thumbnail 1 summary

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 03. వర్షం ఎక్కడినుంచి వస్తుంది?

డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


6వ తరగతి జనరల్ సైన్స్ – 03. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది?
---


+ వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి.
+ ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురుస్తుందని అంచనాకు రావచ్చు.
+ నీరు ప్రకృతిలో మూడు రూపాలలో లభిస్తుంది. అవి
  1. ఘన రూపము
  2. ద్రవ రూపము
  3. వాయు రూపము
+ నీరు గట్టిగా, గడ్డకట్టినట్లుగా ఉంటే దానిని మనం మంచుగడ్డ అంటారు. ఇది నీటి యొక్క ఘనరూపము
+ మంచును ఆరుబయట ఉంచినపుడు అది నీరుగా మారుతుంది.
+ మంచును వేడిచేస్తే అది నీరుగా మారుతుంది.
+ నీరు ద్రవరూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులలో నిలువ ఉంటుంది.
+ భూగర్భంలో నీరు ద్రవరూపంలో ఉంటుంది.
+ నీటి యొక్క వాయురూపమే నీటి ఆవిరి.
+ మన చుట్టూగల గాలిలో నీరు ఆవిరి రూపంలో ఉంటుంది.
+ నదులు, సముద్రాలలో నీరు, సూర్యరశ్మి వల్ల వేడెక్కి నీటి ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది.
+ ఇలా గాలిలో చేరిన నీటి ఆవిరి చల్లబడి వర్షంగా కురుస్తుంది.
+ మంచు గడ్డను వేడిచేస్తే నీరుగా మారుతుంది. నీటిని వేడిచేస్తే నీటి ఆవిరిగా మారుతుంది.
+ నీటి ఆవిరిని చల్లబరిస్తే నీరుగా మారుతుంది. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది.
+ తడి దుస్తులను ఎండలో ఆరవేసినపుడు ఎండవేడికి బట్టలలో ఉన్న నీరు ఆవిరిగా మారి గాలిలో కలసిపోవడం జరుగుతుంది.
+ బట్టలు త్వరగా ఆరాలనుకుంటే వాటిని రెపరెపలాడించడమో లేదా ఫ్యాను క్రిందగా ఉంచడమో చేస్తుంటారు.
+ వర్షం కురసిన తరువాత తడిసిన రోడ్లపై ఉండే నీరు, ఇంటి పైకప్పులపై నిలిచే నీరు, ఇతర ప్రదేశాలలో నిలిచే నీరు కొంతకాలం తరువాత ఆవిరి కావడాన్ని గమనిస్తుంటాము.
+ ఒక గిన్నెలో నీటిని తీసుకుని స్టౌ పై ఉంచి వేడిచేసినపుడు నీటి ఉపరితలం నుంచి నీటి ఆవిరి వెలపలికి రావడాన్ని పరిశీలించవచ్చు.
+ నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ‘భాష్పీభవనం’ అంటారు.
+ నీటిని కొంచెం వేడిచేసినపుడు వెచ్చబడతాయి. ఇంకా వేడిచేస్తే మరుగుతాయి – ఆవిరవుతాయి.
+ నీళ్లు గ్రహించే ఉష్ణము యొక్క పరిమాణము భాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు.
+ కనుక నీటికి అధికంగా ఉష్ణాన్ని ఇచ్చినపుడు అది త్వరగా ఆవిరి అవుతుంది.
+ భూమిపైన భాష్పీభవనము సహజంగా జరిగే ఒక ప్రక్రియ.
+ నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరాయంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది.
+ సూర్యరశ్మి వల్ల, వీచే గాలివల్ల వాటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది.
+ గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి గాలికంటే తేలికగా ఉండటం మూలంగా మేఘాలుగా మారుతుంది.
+ శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నపుడు నోటిలో నుండి చిన్న మేఘాలుగా పొగలు రావడాన్ని మనం పరిశీలించవచ్చు. ఇది సాంద్రీకరణము యొక్క ఫలితమే.
+ మనంనోటి నుంచి వదిలిన గాలి కంటే బయటి వాతావరణంలోని గాలి చాలా చల్లగా ఉండటం వల్ల, నీటి ఆవిరి వెలపలికి రాగానే సూక్ష్మమైన బిందువులుగా మారి ఇలా కనిపిస్తుంది.
+ శీతాకాలంలో ఉదయంపూట గడ్డిమీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమబిందువులు ఏర్పడి ఉండటం కూడా సాంద్రీకరణము యొక్క ఫలితమే.
+ గ్లాసులో చల్లని మంచు ముక్కలను తీసుకున్నపుడు గ్లాసు బయటి భాగంపై చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటం కూడా సాంద్రీకరణం యొక్క ఫలితమే.
+ గాలిలోని నీటి ఆవిరి, ఈ మంచు గ్లాసను తాకినపుడు చల్లబడి చిన్న చిన్న నీటిబిందువులుగా గ్లాసుపైకి చేరుతుంది.
+ నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణము అంటారు.
+ బాగా ఎండగా ఉన్నరోజులలో సూర్యరశ్మి వల్ల భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువుల మొదలైన వాటిలోని నీరు కూడా వెడెక్కుతుంది.
+ ఆ నీరు బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారి గాలిలోకి చేరుతుంది.
+ గాలి కంటే నీటి ఆవిరి తేలికైనది కావడం మూలంగా పైకి పోతుంది.
+ భూ తలం నుండి పైకి పోయేకొద్దీ గాలి చల్లబడుతుంది కనుక అలా వాతావరణంలోకి చేరిన నీటి ఆవిరి చల్లబడి సూక్ష్మమైన నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతవరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి.
+ ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి.
+ అలా కదులుతూ కొన్ని మేఘాలు కలసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి.
+ ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుంచి భూతలంవైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి.
+ ఇలా భూతలాన్ని చేరిన మేఘాలు, వాతావరణంలోని పై పొరలలో ఉండే చల్లని గాలులవల్ల చల్లబడతాయి. ఫలితంగా సూక్ష్మనీటి బిందువులు కలసి పెద్దవిగా మారి భూమిని చేరతాయి. ఈ ప్రక్రియనే మనంవర్షం అంటాము.
+ మేఘాలు లేకుండా వర్షాలు కురవవు.
+ అలాగే అన్ని మేఘాలు వర్షాలను కురిపించలేవు.
+ మేఘాలు చల్లబడి, సూక్ష్మ నీటి బిందువులు కలసి పెద్దవిగా మారినపుడు మేఘాల రంగు తెలుపు నుంచి నలుపుకు మారడాన్ని గమనించవచ్చు.
+ అందుకే కారుమబ్బులు కమ్మిన సమయంలో వర్షం కురుస్తుందని అంచనాకు వస్తుంటాము.
+ వర్షం కురిసే ముందు మేఘాలు భూమివైపుకు దిగడము, చల్లని గాలులు వీచడాన్ని కూడా గమనించవచ్చు.
+ బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు మరింత చల్లబడి చిన్న చిన్న మంచు స్పటికాలుగా ఘనీభవించి మంచు కురిసినట్లు అనిపిస్తుంది.
+ మరింత చల్లగా ఉన్న సందర్భంలో పెద్ద పెద్ద నీటి బిందువులు కూడా ఘనీభవించి మంచుముక్కలుగా మారి క్రిందకు పడతాయి. వీటినే వడగండ్లు అంటారు.
+ ప్రతి సంవత్సరమూ కొన్ని నెలల్లో వర్షాలు కురవడాన్ని గమనిస్తుంటాము.
+ మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాలు కురుస్తుంటాయి. ఈ రోజులలో నైరుతి మూల నుండి గాలులు వీస్తుంటాయి కనుక వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు.
+ నవంబర్, డిసెంబర్ నెలలో కురిసే వర్షాలకు కారణమయ్యే చల్లని గాలులు ఈశాన్యం మూల నుంచి వస్తుంటాయి. కనుక వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు.
+ వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలుగా మారుతుంది.
+ నీరు భాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మేఘాలుగా రూపాంతరం చెందడం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవడం ఒకదాని వెంట మరొకటి జరుగుతూ ఉంటాయి. కనుక ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి ‘జలచక్రము’ అంటారు.
+ అడవులు నరికివేయడం, కర్మాగారాలు వదజల్లే కాలుష్యాలవల్ల భూ వాతావరణం వేడెక్కుతున్నది.
+ దీనివల్ల మేఘాలు చల్లబడేందుకు తగినంత చల్లదనం ఏర్పడక వర్షాలు కురవడంలేదు.
+ జలచక్రంలో అంతరాయాలు వరదలు, కరువులకు దారితీస్తున్నవి.
+ నేలమీద పొరలు పొరలుగా ప్లాస్టిక్, పాలిథీన్ సంచులు పేరుకుని పోవడం మూలంగా వర్షపు నీరు నేలలోకి ఇంకడానికి ఆటంకం కలిగించి భూగర్భజలాలు తగ్గి కరువులకు కారణం అవుతున్నాయి.

ఇవి కూడా . . .
+ వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
+ వానచినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడుతున్నపుడు అలా కనిపిస్తుంది.
+ వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్ధం కలిగియుంటుంది.
+ ఈజిప్టు దేశస్తులు ఎండనుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత కాలంలో వానలో కూడా గొడుగులను ఉపయోగించడం మొదలుపెట్టారు
+ పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ లతో మేఘాలు కలుషితమైనపుడు ఆమ్లవర్షాలు కురుస్తాయి.
+ సతతహరితారణ్యాలలో ఎగిరే ఉడుతలు, పాములు ఉంటాయి.
+ ప్రతిరోజూ వర్షం కురిసే భూ మధ్యరేఖా ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడుతలు, పాములు ఉంటాయి.

exams.navachaitanya.net