జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ - 6వ తరగతి - 02. అయస్కాంతంతో ఆటలు
6వ తరగతి
జనరల్ సైన్స్ – 02. అయస్కాంతాలతో ఆటలు
---
+ ఫ్రిజ్, ఇనుప
బీరువాలకు ఉండే లోహపు తలుపులకు అతికించే రకరకాల బొమ్మలు గల లోహపు బిళ్లలు
అయస్కాంతమును కలిగియుంటాయి.
+ గుండుసూదులు, పేపర్
క్లిప్స్, ఇనుపమేకులు డబ్బామూతకు (అయస్కాంతానికి) అతుక్కోవడాన్ని పరిశీలించవచ్చు.
+ కాగితపు ముక్కలు,
పెన్సిల్, రబ్బరు వంటివి డబ్బామూతకు (అయస్కాంతానికి) అతుక్కోకపోవడాన్ని
గమనించవచ్చు.
+ సుమారు 2500 సంవత్సరాల
క్రితం ‘మాగ్నస్’ అనే గొర్రెల కాపరి తాను రోజూ గొర్రెలను మేపుకునే పనిలో భాగంగా
అయస్కాంతపు లక్షణము కలిగిన రాళ్లను గుర్తించాడు.
+ ఇనుప వస్తువులను
ఆకర్షించే సహజ లక్షణము కలిగిన రాళ్లను సహజ అయస్కాంతాలు లేదా ‘లోడ్ స్టోన్’ అంటారు.
+ మానవులు వివిధ
పద్ధతులలో తయారుచేసే అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు.
+ అయస్కాంతాలను వివిధ
ఆకారాలను బట్టి క్రింది రకాలుగా పిలువవచ్చు
+ దండాయస్కాంతం
+ వలయాకారపు అయస్కాంతం
+ బిళ్ల అయస్కాంతం
+ గుర్రపునాడాకారపు అయస్కాతం
+ అయస్కాంతం చేత
ఆకర్షించబడే పదార్ధాలను అయస్కాంత పదార్ధాలు అంటారు.
+ అయస్కాంతం చేత
ఆకర్షింపబడని పదార్ధాలను అనయస్కాంత పదార్ధాలు అంటారు.
+ అయస్కాంతాలకు ఇనుము
వంటి పదార్ధాలను ఆకర్షించే లక్షణము ఉన్నది కనుక ఈ లక్షణమునుఉపయోగించి కొన్ని
మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలను వాడతారు.
+ అయస్కాంతాన్ని ఇసుకలో
కొంతసేపు మట్టిలో అటూ ఇటూ దొర్లించి బయటకుతీసినపుడు దానికి నల్లని రంగులోగల కొంత
పదార్ధము అంటుకుని ఉంటుంది.
+ నల్లని రంగులోగల
పదార్ధమును ఇనుపరజను అని పిలుస్తారు.
+ ఇనుపరజను ఉపయోగించి
పరిశీలించినపుడు అయస్కాంత కొనలు వద్ద ఆకర్షణ ధర్మం అధికంగా ఉన్నట్లుగా
గమనించవచ్చు.
+ ఆకర్షించే లక్షణము
అధికముగా గల కొనలను అయస్కాంతపు ధృవాలు అంటారు.
+ ప్రతి అయస్కాంతానికి
రెండు ధృవాలు ఉంటాయి.
+ అయస్కాంతానికి మధ్యన
దారాన్ని కట్టి స్వేచ్ఛగా వేలాడదీసినపుడు నిశ్చల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర,
దక్షిణ దిక్కులను సూచిస్తుంది.
+ స్వేచ్ఛగా
వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లపుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ
నిశ్చలస్థితికి రావడాన్ని ‘అయస్కాంత దిశాధర్మము’ అంటారు.
+ అయస్కాంత దిక్సూచి –
దిక్కులను గుర్తించడానికి ఉపయోగపడే ఒక పరికరము.
+ అయస్కాంత దిక్సూచిని
‘అయస్కాంత దిశాధర్మం’ ఆధారంగా చేసుకుని రూపొందిస్తారు.
+ అయస్కాంత దిక్సూచి
ఓడలలోనూ, విమానాలలోనూ పర్వతారోహకులు, మిలటరీ జవాన్లు మొదలైనవి కొత్త ప్రదేశాలలో
ప్రయాణించాల్సిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
+ అయస్కాంత దిక్సూచిని,
వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచినపుడు దాని ప్రభావానికి దిక్సూచి లోనై సరిగా
దిక్కులను చూపలేకపోతుంది.
+ అయస్కాంతం యొక్క సజాతి
ధృవాలు వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి.
+ N-N, S-S వికర్షించుకుంటాయి
మరియు N-S ఆకర్షించుకుంటాయి.
+ బల్లపై ఒక
దండాయస్కాంతమును ఉంచి, దానికి దగ్గరగా మరొక దండాయస్కాంతమును వేలాడదీసినపుడు అది
బల్లపై గల దండాయస్కాంత ప్రభావానికి లోనై ఉత్తర దక్షిణ దిక్కులను చూపలేకపోవచ్చు.
+ ఈ సందర్భంలో బల్లపై గల
దండాయస్కాంతం ఉత్తర ధృవం వైపు, వేలాడదీసిన దండాయస్కాంతపు దక్షిణ ధ్రువము వచ్చేలా
నిశ్చలస్థితికి రావడాన్ని గమనించవచ్చు.
+ భూమి ఒక అయస్కాంతంగా,
స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే అది ఎల్లపుడూ ఉత్తర,
దక్షిణ దిక్కులను చూపుతుంది.
+ అయస్కాంతాన్ని
గుర్తించాలంటే
+ ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధృవం ఆకర్షించి రెండో ధృవం
వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు.
+ ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధృవాలూ ఆకర్షించినట్లయితే, ఆ
వస్తువు అయస్కాంత పదార్ధంతో తయారైనదని చెప్పవచ్చు.
+ ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధృవాలూ ఆకర్షణ, వికర్షణలు
చేయకపోతే ఆ వస్తువును అనయస్కాంత పదార్ధంతో తయారైనదని చెప్పవచ్చు.
+ ఒక ఇనుపమేకును
ప్రత్యేకమైన పద్ధతిలో అయస్కాంతం చేత రుద్దడం ద్వారా అయస్కాంతంగా మార్చవచ్చు.
+ అయస్కాంతీకరించిన
గుండుసూదిని ఒక బెండు ముక్కపై అతికించి, నీరుగల గ్లాసులో వదలడం ద్వారా దిక్సూచిని
తయారుచేయవచ్చు.
+ అయస్కాంతానికి
అంటుకుని ఉన్న, అయస్కాంతానికి సమీపంలో ఉన్న పిన్నీసు వంటి వస్తువులు కూడా ఇతర
వస్తువులను ఆకర్షించే లక్షణాన్ని పొందుతాయి.
+ ఒక అయస్కాంత పదార్ధం
ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నపుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని
‘అయస్కాంత ప్రేరణ’ అంటారు.
ఇవి కూడా . . .
+ ఇప్పటి
వరకూ మనకు తెలిసిన అయస్కాంత పదార్ధాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం
+ సాధారణంగా
ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారుచేస్తారు.
+ పూర్వం
శత్రువుల నౌకలనుంచి మేకులను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్
అయస్కాంతాలను ఉపయోగించేవారు
+ ఒక ఉక్కు
కడ్డీ చుట్టూ చుట్టిన తీగచుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారుచేస్తారు
+ జంతువుల
కడుపులో పేరుకుపోయిన ఇనుపతీగలను, మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను
ఉపయోగిస్తారు.
+ సాధారణ
అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారుచేస్తారు
+ వందల
సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం
చేసేవారు
+ భూమి
యొక్క అయస్కాంత క్షేత్రము దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రము వలె
ఉంటుంది.
+ భూ
అయస్కాంత తీవ్రత శీతల (ఫ్రిజ్) అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది
+ భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి ఒక పెద్ద అయస్కాంతంలా
పని చేస్తుందని భావిస్తుంటారు.