| About us | Contact us | Advertise with us

7వ తరగతి గణితము స్టడీ మెటీరియల్ - 01. పూర్ణ సంఖ్యలు | Mathematics Study Material - 7th Class - Integers

మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ - 7వ తరగతి - 01. పూర్ణ సంఖ్యలు డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచ... thumbnail 1 summary

మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ - 7వ తరగతి - 01. పూర్ణ సంఖ్యలు

డియస్సీ, టెట్ తో పాటు ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయతీ సెక్రటరీ), గ్రూప్-4, గ్రామ సచివాలయం, పోలీస్ ఉద్యోగాలు (కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్), రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు గణితము/అరిథ్ మెటిక్ విభాగం కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను చదవాలంటూ చాలా మంది నిష్ణాతులు తెలియచేస్తుంటారు. అయితే అభ్యర్ధులు సమయం లేకపోవడం మూలంగానో లేక ఆయా పుస్తకాలను సేకరించడం కష్టమయ్యో సాధారణ పుస్తకాలపై ఆధారపడి ప్రిపరేషన్ కానిచ్చేస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని లైన్ టూ లైన్ ముఖ్యమైన అంశాలతో కూడిన చక్కని సంక్షిప్త నోట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. కనుక మా వెబ్ సైట్ ను అనుసరించండి. మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


7వ తరగతి గణితము – 01. పూర్ణ సంఖ్యలు
---


+ 1, 2, 3 . . . అంటూ లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు.
+ సహజ సంఖ్యలలో
  కనిష్ట సంఖ్య 1
  గరిష్ట సంఖ్య చెప్పలేము.
+ సహజ సంఖ్యా సమితిని N తో సూచిస్తారు
  N = {1, 2, 3, 4, 5, . . . . }
+ సహజ సంఖ్యలకు ‘0’ (పూర్ణము లేదా సున్నా) ను చేర్చితే ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాల సంఖ్యలు లేదా పూర్ణాంకాలు అంటారు.
+ పూర్ణాంకాలు 0, 1, 2, . . .
+ పూర్ణాంకాలలో
  కనిష్ట సంఖ్య 0
  గరిష్ట సంఖ్య చెప్పలేము.
+ పూర్ణాంకాల సమితిని W తో సూచిస్తారు
  W = {0, 1, 2, 3, 4, 5, . . . }
+ ఋణ సంఖ్యలను, పూర్ణాంకాలను కలుపగా ఏర్పడే సంఖ్యలను ‘పూర్ణ సంఖ్యలు’ అంటారు.
+ పూర్ణ సంఖ్యలు . . . -3, -2, -1, 0, 1, 2, 3, . . .
+ పూర్ణ సంఖ్యలలో
  కనిష్ట సంఖ్య చెప్పలేము.
  గరిష్ట సంఖ్య చెప్పలేము.
+ పూర్ణ సంఖ్యా సమితిని Z చే సూచిస్తారు.
  Z = { . . . -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 . . . .}
+ ఒక సంఖ్యకు ధన పూర్ణ సంఖ్యను కలిపినపుడు సంఖ్యారేఖపై కుడివైపునకు, ఋణపూర్ణ సంఖ్యను కలిపినపుడు సంఖ్యా రేఖపై ఎడమవైపునకు జరుగుతాము.
+ ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినపుడు సంఖ్యా రేఖపై ఎడమవైపునకు, ఋణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినపుడు సంఖ్యారేఖపై కుడివైపునకు జరుగుతాము.
+ పూర్ణ సంఖ్యల గుణకారం విషయంలో
  ధన పూర్ణ సంఖ్య, ధన పూర్ణ సంఖ్యల లబ్ధము – ధనపూర్ణ సంఖ్య అవుతుంది.
  ధన పూర్ణ సంఖ్య, ఋణ పూర్ణ సంఖ్యల లబ్ధము – ఋణపూర్ణ సంఖ్య అవుతుంది.
  ఋణ పూర్ణ సంఖ్య, ధన పూర్ణ సంఖ్యల లబ్ధము – ఋణ పూర్ణ సంఖ్య అవుతుంది.
  ఋణపూర్ణ సంఖ్య, ఋణ పూర్ణ సంఖ్యల లబ్ధము – ధనపూర్ణ సంఖ్య అవుతుంది.
+ గుణకారాలలో ఋణపూర్ణ సంఖ్యల సంఖ్య ‘సరి సంఖ్య’ అయితే లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది.
+ గుణకారాలలో ఋణపూర్ణ సంఖ్యల సంఖ్య ‘బేసి సంఖ్య’ అయితే లబ్ధము ఋణపూర్ణ సంఖ్య అవుతుంది.
+ ఒక ఋణపూర్ణ సంఖ్యను మరొక ఋణపూర్ణ సంఖ్య చే భాగించగా భాగఫలము ఒక ధన సంఖ్య అవుతుంది.
సంకలనం విషయంలో
+ పూర్ణ సంఖ్యల ధర్మాలు – సంవృత ధర్మం ప్రకారం రెండు పూర్ణ సంఖ్యల మొత్తము ఎల్లపుడూ పూర్ణ సంఖ్యయే అవుతుంది.
  అంటే a మరియు b లు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైన a+b కూడా పూర్ణ సంఖ్యయే అవుతుంది.
+ స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ న్యాయం అనుసరించి రెండు పూర్ణాంకాలను కూడే క్రమంలో సంఖ్యలను పరస్పరం మార్చినా ఫలితంలో ఎటువంటి భేదము రాదు.
  అంటే a మరియు b లు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయితే a + b = b + a
+ పూర్ణ సంఖ్యల సంకలనమునకు సహచర ధర్మము వర్తిస్తుంది.
  అంటే a, b మరియు c లు ఏవైనా మూడు పూర్ణ సంఖ్యలు అయితే (a+b)+c = a+(b+c)
+ పూర్ణ సంఖ్యకు ‘0’ ను కూడినా అదే పూర్ణ సంఖ్య ఫలితముగా వస్తుంది. కనుక ‘0’ ను పూర్ణ సంఖ్యలకు సంకలన తత్సమాంశం అంటారు.
  a ఏదైనా పూర్ణ సంఖ్య అయిన a+0 = 0+a = a
+ పూర్ణ సంఖ్యలు సంకలన విలోమమును కలిగియుంటాయి.
  అంటే a ఒక పూర్ణ సంఖ్య అయితే a + (-a) = 0 అగునట్లుగా (-a) అను పూర్ణ సంఖ్య ఉంటుంది.
  a మరియు (-a) లు ఒకదానికొకటి సంకలన విలోమాలు.
గుణకారం విషయంలో
+ పూర్ణ సంఖ్యలలో గుణకార ధర్మాలు – సంవృత ధర్మం అనుసరించి రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము కూడా ఎల్లపుడూ పూర్ణ సంఖ్యయే అవుతుంది.
  అంటే a మరియు b లు రెండు పూర్ణ సంఖ్యలు అయిన axb కూడా పూర్ణ సంఖ్యయే అవుతుంది.
+ పూర్ణ సంఖ్యలు గుణకార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. అంటే గుణకారం విషయంలో పూర్ణ సంఖ్యలను పరస్పరం వాటి స్థానాలను మార్చినా ఫలితము మారదు.
  అంటే a మరియు b లు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైన a x b = b x a
+ పూర్ణ సంఖ్యల సహచర ధర్మము అనుసరించి a, b, c లు ఏవైనా మూడు పూర్ణ సంఖ్యలు అయితే (axb) x c = a x (bxc)
+ పూర్ణ సంఖ్యలు విభాగ న్యాయం పాటిస్తాయి. a, b మరియు c లు ఏవైనా మూడు పూర్ణ సంఖ్యలు అయితే ax(b+c) = axb + axc
+ పూర్ణ సంఖ్యలలో గుణకార తత్పమాంశము 1. అంటే ఏ పూర్ణ సంఖ్యనైనా 1 తో గుణించినపుడు అదే పూర్ణ సంఖ్య ఫలితంగా వస్తుంది.
  a ఒక పూర్ణ సంఖ్య అయిన a x 1 = 1 x a = a
+ ఏ పూర్ణ సంఖ్య సంఖ్యను అయినా సున్నాతో గుణించినపుడు వచ్చే ఫలితము సున్నానే అవుతుంది.
  a ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయిన a x 0 = 0 x a = 0
వ్యవకలనం విషయంలో
+ పూర్ణ సంఖ్యలలో వ్యవకలనం విషయంలో సంవృత ధర్మము వర్తిస్తుంది.
  అంటే a మరియు b లు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయితే a – b కూడా పూర్ణ సంఖ్యయే అవుతుంది.
+ పూర్ణ సంఖ్యలలో స్థిత్యంతర ధర్మం వ్యవకలనం విషయంలో వర్తించదు.
  అంటే a, b లు రెండు పూర్ణ సంఖ్యలు అయినపుడు a – b, b – a లు రెండూ సమానం కావు.
భాగాహారం విషయంలో
+ పూర్ణ సంఖ్యలు భాగాహారం విషయంలో సంవృత ధర్మం వర్తించదు.
  అంటే a, b లు రెండు పూర్ణ సంఖ్యలు అయితే a/b, b/a లు రెండూ సమానం కావు.
+ పూర్ణ సంఖ్యల విషయంలో భాగాహారమునకు స్థిత్యంతర ధర్మము కూడా వర్తించదు.
+ a ఒక పూర్ణ సంఖ్య అయితే a ÷ 0 నిర్వచింపబడదు. a ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయితే 0 ÷ a = 0.

+ a ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయితే a ÷ 1 = a.
7వ తరగతి గణితము - 01. పూర్ణసంఖ్యలు - వీడియో లెసన్ - శ్రీ నవీన్ గారిచే


exams.navachaitanya.net