How to score good marks in TET exam for house wives and others
TET PREPRATION - PLANNING - SCHEDULE - టెట్ లో మంచి మార్కులు సాధించడం ఎలా
Steps to be followed for TET preparation
డియస్సీలో
విజయం సాధించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్న ప్రతి అభ్యర్ధీ మొదట టీచర్స్ ఎలిజిబిలిటీ
టెస్ట్ (టెట్) లో విజయం సాధించాలి. అంతే కాదు టెట్ లో సాధించిన మార్కులకు
డియస్సీలో వెయిటేజి కూడా ఉండటంతో టెట్ లో అభ్యర్ధి సాధించే ప్రతి మార్కు అత్యంత
కీలకం అయినదే. డియస్సీలో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్ధి,
మంచి టెట్ స్కోరు వల్ల ఉద్యోగాన్ని సాధించిన సందర్భాలూ, అదే డియస్సీలో ఎక్కువ
మార్కులు ఉన్నప్పటికీ టెట్ వెయిటేజి తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన
సందర్భాలూ టెట్ పరీక్ష యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంటాయి.
అందుకే ఈ రోజు వీడియోలో మనం ఎపి టెట్
పరీక్షలో మంచి మార్కులను సాధించాలంటే ఏం చేయాలనే విషయాన్ని గురించి చర్చిద్దాం. ఈ
వీడియోను చివరి వరకూ చూసి, నచ్చితే వీడియోలో చెప్పిన సూచనలను అనుసరించి మీరు మంచి
మార్కులు సాధించాలని నవచైతన్య కాంపిటీషన్స్ కోరుకుంటోంది.
టెట్
పరీక్ష ప్యాట్రన్ తెలుసుకోండి
టెట్ పరీక్షకు సన్నద్ధం
కావాలనుకుంటున్న ప్రతి అభ్యర్ధి మొదట చేయాల్సిన పని ‘టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్’
వ్రాత పరీక్ష యొక్క సిలబస్ ప్యాట్రన్ ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలి. ఏ సబ్జక్టులో
ఎన్ని మార్కులకు ప్రశ్నలు అడగటం జరుగుతుంది, ఏ సబ్జక్టులో ఎంత స్థాయి వరకూ
చదవాల్సి ఉంటుందన్న విషయాలను నోటిఫికేషన్ ద్వారా అభ్యర్ధులు తెలుసుకోవాల్సి
ఉంటుంది. ఆయా సబ్జక్టులకు ఉన్న మార్కుల ప్రాధాన్యత ఆధారంగానే ఆ తరువాత ప్రిపేర్
అయ్యే విధానం నిర్ణయించబడుతుందన్న విషయం అభ్యర్ధులు మరువరాదు. టెట్ సిలబస్
ప్యాట్రన్ గురించి డీటెయిల్డ్ గా మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రీవియస్
ప్రశ్నాపత్రాలను పరిశీలించండి.
సిలబస్ ప్యాట్రన్ ను తెలుసుకున్న
తరువాత అభ్యర్ధులు గత టెట్ ప్రశ్నాపత్రాలలో ఏ రకమైన ప్రశ్నలు అడిగారో
విశ్లేషించుకునే ప్రయత్నం చేయాలి. సబ్జక్టుల వారీగా అత్యంత ప్రాధాన్యమైన
చాప్టర్లను గుర్తించే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రశ్నల
స్థాయిని నిశితంగా పరిశీలించాలి. ఇలా విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో పాఠ్యపుస్తకాలు,
మెటీరియల్స్ చదివే సందర్భంలో ప్రతి అంశంపైన, ప్రశ్నలు ఎలా అడిగే అవకాశం ఉంటుందో
ఆలోచిస్తూ చదవగలం. అలా చేయడం ద్వారా మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది.
ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు నవచైతన్య
కాంపిటీషన్స్ వెబ్ సైట్ లో కానీ, ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్ ఇతర ప్రముఖ
ఎడ్యుకేషనల్ వెబ్ సైట్ లలో సులభంగానే దొరికే అవకాశం ఉంటుంది. వీలుంటే వాటన్నింటినీ
డౌన్ లోడ్ చేసుకుని ఒకసారి విశ్లేషణ చేసి గత పరీక్షల సరళిపై ఒక అంచనాకు రావాలి.
ప్లాన్
ను సిద్ధం చేసుకోండి
మనో విజ్ఞానశాస్త్రంలో అభ్యసన
సోపానాలలో ‘ప్రణాళికను సిద్దం చేసుకోవడం’ అతి ముఖ్యమైనదిగా మనం భావిస్తుంటాము.
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో మీరు రాణిస్తారా లేదా అన్నది మీరు సిద్ధం చేసుకున్న
ప్రిపరేషన్ ప్లాన్ చెప్పేస్తుంది. చాలా మంది అభ్యర్ధులు ‘లేడికి లేచిందే పరుగు’
అన్నట్లు నోటిఫికేషన్ గురించిన మాటలు వినిపించిన రోజు ప్రిపరేషన్ ప్రారంభించేసి ఓ
పది గంటలు చదివేస్తారు. ఆ తరువాత రోజు ఐదు గంటలు, ఆ మరుసటి రోజు గంటో రెండు గంటలో
చదువుతూ నెమ్మదిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోతారు. మరికొంత మంది అభ్యర్ధులు ఏ
ప్రణాళికా లేకుండా కనిపించిన పుస్తకం పట్టుకుని ఓ ఐదారు గంటల పాటు చదివేస్తుంటారు.
ఆ పుస్తకం కూడా వాళ్లకు దాదాపు ఇష్టమైన సబ్జక్టుది అయి ఉండవచ్చు. ఏ సబ్జక్టుకు
ఎన్ని రోజులు పడుతుంది, ఏ సబ్జక్టుకు ఎక్కువ సమయం కేటాయించాలి, ఏ సబ్జక్టులో మనం
వీక్ గా ఉన్నాము – ఇటువంటి విశ్లేషణ ఏమీ ఉండదు. ‘గుడ్డెద్దు చేలో పడ్డట్లు’
సాగుతుంది వీరి ప్రిపరేషన్.
అనుభవంతో చెబుతున్నాము – సరియైన
ప్రణాళిక లేకుండా, ఏమి చదువుతున్నామో తెలియకుండా చదివే అభ్యర్ధులు పరీక్షలో
రాణించేందుకు అవకాశాలు చాలా తక్కువ. కనుక ప్రతి అభ్యర్ధి తన బలాలు, బలహీనతలను
ఆధారంగా చేసుకుని చక్కని షెడ్యూల్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూల్ సిద్ధం
చేసుకునే సమయంలో రోజులో మీరు ఎంత సమయం కేటాయించగలుగుతారు, ఏ సబ్జక్టును రోజులో ఎంత
సమయం చదివితే సిలబస్ ను సకాలంలో పూర్తి చేయగలరు, ఏ సబ్జక్టు తరువాత ఏ సబ్జక్టు
చదవాలి వంటి విషయాలను క్లియర్ గా రాసుకుంటూ షెడ్యూల్ ను సిద్ధం చేసుకోవాలి.
షెడ్యూల్ సిద్ధం చేసుకోవడంలో నవచైతన్య
కాంపిటీషన్స్ వివిధ పోటీ పరీక్షలతో పాటు టెట్ కు కూడా అందిస్తున్న షెడ్యూల్ ఒక
చక్కని మార్గదర్శిగా నిలుస్తుంది. మీరు నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ నుంచి
మోడల్ కోసం ఆ షెడ్యూల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నచ్చితే యదాతధంగా ఫాలో కావచ్చు
లేదంటే దానిని ఆధారంగా చేసుకుని సొంతంగా ఒక షెడ్యూల్ ను సిద్ధం చేసుకోవచ్చు.
పుస్తకాలను
సేకరించుకోండి
షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్న
అభ్యర్ధి తరువాత చేయవలసిన కీలకమైన పని ఆయా సబ్జక్టులపై పట్టు సాధించడానికి తగిన
పుస్తకాలను ఎంపిక చేసుకోవడం. సాధారణంగా కంటెంట్, మెథడాలజీల విషయంలో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ వారి ప్రామాణిక పుస్తకాలు అత్యంత
ఉపయుక్తమైనవి. జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ విభాగాలకు ప్రామాణిక గ్రామర్
పుస్తకాలను సేకరించుకోవాలి. వాటితో పాటు పాఠ్యపుస్తకాలను కూడా చదవాల్సి ఉంటుంది.
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ, మెథడాలజీ వంటి విభాగాలకు తెలుగు అకాడమీ
పాఠ్యపుస్తకాలను కానీ లేదా అవి దొరకని పక్షంలో ఆయా పుస్తకాలను ఆధారంగా చేసుకుని
రూపొందించబడిన మార్కెట్ లోని ఫేమస్ పబ్లికేషన్ పుస్తకాలను సేకరించుకుని చదవడం
ప్రారంభించాలి.
ఎలా
చదవాలి?
ప్రతి పుస్తకాన్ని మూడంచెల వ్యూహంలో
చదివి పట్టు సాధించవచ్చు. మొదటి అంచెలో పాఠ్యపుస్తకాన్ని ఆసాంతం చదువుతూ ముఖ్యమైన
విశేషాలను అండర్ లైన్ చేసుకోవాలి. రెండవ అంచెలో అండర్ లైన్ చేసుకున్న అంశాలను
మాత్రం రివిజన్ చేస్తూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నించినా
గుర్తుండని అంశాలను నోటు పుస్తకంలో రాసుకుని మూడో అంచెలో పదే పదే చదవడం ద్వారా ఆయా
పాఠ్యపుస్తకాలపై పట్టు సాధించాలి.
వీలైనంత
ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.
కేవలం పాఠ్యపుస్తకాలను చదవడం పైనే
దృష్టి పెట్టిన అభ్యర్ధులు పరీక్షలో మంచి మార్కులు సాధించలేకపోవచ్చు. కనుక ప్రతి
పాఠ్యాంశమును చదివిన తరువాత చక్కని క్వాలిటీ గల ప్రాక్టీస్ బిట్స్ రాయడానికి
ప్రయత్నించాలి. ఈ ప్రాక్టీస్ బిట్స్ కై ఎంచుకున్న పుస్తకం కానీ ఆన్ లైన్ ఎగ్జామ్స్
పోర్టల్ కానీ, టెట్ పరీక్ష లో అడుగుతున్న రీతిన కఠినమైన ప్రశ్నలను అందిస్తున్నదో
లేదో చెక్ చేసుకోవాలి. ఏవో తేలికైన బిట్స్ రాసేసి మంచి మార్కులు సాధించి లెసన్ పై
పట్టు సాధించినట్లు భ్రమ పడకూడదు. కఠినమైన బిట్స్ గల ప్రాక్టీస్ పేపర్లను ఎంచుకుని
పరీక్షలు రాయాలి. సమాధానం గుర్తించలేకపోయిన బిట్స్ ను ఆధారంగా చేసుకుని ఆయా
టాపిక్స్ ను మరోసారి రివిజన్ చేసుకోవాలి.
ఇలా ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్
చేస్తూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా టెట్ లో మంచి మార్కులు సాధించాలనే మీ
లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు మిత్రమా. మీ ఈ ప్రయాణంలో సదా తోడుగా
నిలిచేందుకు నవచైతన్య కాంపిటీషన్స్ ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుంది.