| About us | Contact us | Advertise with us

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper-2 (Social Studies)

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper-2 (Social Studies)            తెలంగాణ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయినది. తెలంగాణ టె... thumbnail 1 summary

చాలా చోట్ల వెతికినా దొరకలేదు కదా . . . ఇక వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ పేజీలో మీరు వెతుకుతున్న సిలబస్ తెలుగులో పిడిఎఫ్ కనిపిస్తుంది.

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper-2 (Social Studies)

          తెలంగాణ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయినది. తెలంగాణ టెట్ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు అంతా ఇప్పుడు సిలబస్ ను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్ధులు తాము తెలుగు మీడియంలో చదవడం మూలంగా తెలంగాణ టెట్ – 2022 పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవడం కోసం వెతుకుతూ ఉంటారు.

          Telangana TET - 2022 notification has been released. All the candidates preparing for telangana TET exam are now trying to know the syllabus. Candidates, especially from rural areas, are looking for the Telangana TET - 2022 Paper-2 Social Studies syllabus to be downloaded in the form of PDF in Telugu as they are studying in Telugu medium.

ts tet paper 2 syllabus in telugu social studies


          అటువంటి అభ్యర్ధులలో చాలా మంది ఆశ్రయించేది గూగుల్ తల్లినే. గూగుల్ సెర్చ్ ద్వారా Telangana TET Syllabus in Telugu అనో, TS TET Syllabus paper 2 in telugu medium అనో లేక TS TET syllabus in Telugu అనో టైప్ చేసి వెతకడం ప్రారంభిస్తారు. కానీ వచ్చే మొదటి పది . . . పదిహేను . . . ఇరవై వెబ్ సైట్ లలో ఎక్కడా జెన్యూన్ గా, పాఠ్యపుస్తకాలలో మాదిరి టైటిల్స్ తో సిలబస్ తెలుగులో కనిపించదు. కొన్ని వెబ్ సైట్ లలో TS TET Syllabus 2022 (PDF) అని పెట్టేసి ఏదేదో సోది రాస్తుంటారు. మరికొన్ని వెబ్ సైట్ లలో TS TET Syllabus 2022 అని పెట్టేసి అఫీషియల్ గా ఇంగ్లీష్ లో వచ్చిన సిలబస్ నే మార్చి మార్చి రాస్తుంటారు. మరికొందరు అయితే టైటిల్ చక్కగా TS TET Syllabus in Telugu అని పెడతారు. గూగుల్ ట్రాన్సిలేటర్ ఉపయోగించి సిలబస్ ను అనువదించేసి అక్కడ ఇచ్చేస్తుంటారు. వాళ్లు పెట్టే టైటిల్స్ మన పాఠ్యపుస్తకాలలో ఎక్కడా కనిపించవు.

          Most of such candidates are trying to ask Google Talli. Through Google search, they will start searching by typing Telangana TET Syllabus in Telugu, TS TET Syllables paper 2 Maths and Science in telugu medium or TS TET syllables in telugu. But the first . . . ten . . . fifteen... twenty websites they won’t find Genuine TS TET Syllabus in Telugu. Some websites have ts tet syllabus 2022 (PDF) as main title but write something which is not relevant to it. Some websites have ts tet syllabus 2022 and the put the syllabus which is released by the Educational Department. Others put the title as ts tet syllabus in telugu.. by using google translactar, the syllabus is translated and given there. It won’t match with textbook even one line.

          ఈ సమస్యలేవీ లేకుండా నవచైతన్య కాంపిటీషన్స్ నిష్ణాతులైన ఫ్యాకల్టీ టీమ్ తో కలిసి తెలంగాణ టెట్ 2022 పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ ను తెలుగులోకి అనువదించి పిడిఎఫ్ రూపంలో అందిస్తోంది. మన ఈ సిలబస్ లో టైటిల్స్ అన్నీ మీ పాఠ్యపుస్తకాలలో మీరు గమనించేవే . . . గుర్తుపట్టేవే. జెన్యూన్ గా తెలంగాణ టెట్ సిలబస్ ను ట్రాన్సిలేట్ చేసి మీకు అందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ గురించి మీ మిత్రులకు కూడా తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

          Without any of these problems, Nava Chaitanya Competitions along with an accomplished faculty team is translating the Telangana TET 2022 Paper-2 (Social Studies) syllabus into Telugu and providing it in pdf form. All the titles in this syllabus of ours are what you observe in your textbooks . . . Recognizable. We sincerely hope that you will also inform your friends about the Nava Chaitanya competitions offered to you by translating the Telangana TET syllabus as a genuine.

తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) గురించిన ప్రాధమిక విశేషాలు:

          టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అనేది B.Ed లేదా D.Ed పూర్తి చేసిన ప్రతి అభ్యర్ధి DSC/TRT పరీక్షను రాయడానికంటే ముందు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన పరీక్ష. తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సహజంగా DSC / TRT నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే 24.03.2022 న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. రెండు పేపర్లుగా నిర్వహించే ఈ తెలంగాణ టెట్ పరీక్షలో 6 నుంచి 8వ తరగతి వరకూ బోధించాలని భావిస్తూ, B.Ed పూర్తి చేసిన అభ్యర్ధులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయిలో సోషల్ స్టడీస్ ను సబ్జక్టుగా కలిగిన అభ్యర్ధులు తెలంగాణ టెట్ పేపర్-2 లో ఆప్షనల్ సబ్జక్టులుగా సోషల్ స్టడీస్ ను ఎంచుకుని టెట్ రాయాల్సి ఉంటుంది.

The basics of Telangana TET Paper-I are:

          Teachers' Eability Test (TET) is a test that every candidate who has completed B.Ed or D.Ed must qualify before writing the DSC/TRT exam. Telangana Government – Educational Department they have to conduct TET exam twice every year. But naturally before going to conduct DSC/TRT Telangana TET exam before issuing the notification. In this context, the Telangana TET notification was released by the Telangana Government - Educational Department on 24.03.2022 . Candidates who have completed B.Ed. hoping to teach from 6th to 8th standard will have to write Paper-II in this Telangana TET exam which will be conducted in two papers. Candidates with Social Studies subjects at degree level will have to select Social Studies as optional subjects in Telangana TET Paper-II and write TET.

తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్షను రాయడానికి ఎవరు అర్హులు?

          ఎవరైతే B.Ed పూర్తి చేసి, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని భావిస్తారో, వారు తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) రాయడానికి అర్హులు. B.Ed చివరి సంవత్సరం చదువుతూ ఉన్న అభ్యర్ధులు కూడా తెలంగాణ టెట్ రాయడానికి అర్హులే అని తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.

Who is eligible to write Telangana TET Paper-II exam?

          Those who completed their B.Ed and take up the teaching profession of classes 6 to 8 in Upper primary, high schools are eligible to write Telangana TET Paper-II. The Telangana TET notification stated that candidates who are studying B.Ed in the last year are also eligible to write telangana TET.

తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది?

          తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు గానూ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు అభ్యర్ధులు రెండున్నర గంటలలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. కానీ ఈ తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) లో అభ్యర్ధి సాధించిన మార్కుల ఆధారంగా DSC/TRT పరీక్షలో వెయిటేజి ఇవ్వబడుతుంది. కనుక అభ్యర్ధులు తెలంగాణ టెట్ ను సీరియస్ గా తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు.

పరీక్ష స్వరూపాన్ని గమనించినపుడు తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్ష మొత్తంగా నాలుగు సెక్షన్లుగా విభజించబడి ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. కంటెంట్ విభాగానికి మాత్రం 60 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్ గా అభ్యర్ధులు సాధించిన మార్కుల ఆధారంగా క్వాలిఫికేషన్ నిర్ణయించడం జరుగుతుంది.

          1. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ

          2. మొదటి లాంగ్వేజ్ (తెలుగు లేదా ఇతర భాషలు)

          3. రెండవ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

          4. సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ

What will be the nature of Telangana TET Paper-I exam?

          The Telangana TET Paper-II (Social Studies) exam will be conducted with purely objective questions. Candidates will have to identify answers to 150 multiple choice questions of 150 marks in two-and-a-half hours. There is no negative marking. But weightage will be given in DSC/TRT exam based on the marks obtained by the candidate in this Telangana TET Paper-2. So, the candidates take Telangana TET seriously and prepare.

The Telangana TET Paper-I examination is divided into five sections. 30 marks will be allotted with 30 multiple choice questions from each section, 60 marks will be allotted to social studies content and the qualification will be decided on the basis of marks obtained by the candidates overall.

          1. Child Development and Pedagogy

          2. First language (Telugu or other languages)

          3. Second Language (English)

          4. Social Studies Content and Methodology

తెలంగాణ టెట్ – పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో

          తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ ను పాఠ్యపుస్తకాలలోని టైటిల్స్ ఆధారంగా చేసుకుని దాదాపుగా పాఠ్యపుస్తకాలతో ఏకీభవించేలా సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందించడం జరుగుతున్నది. క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

telangana ts tet Paper 2 social Syllabus in telugu

ఇవి కూడా చూడండి

1. తెలంగాణ టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో

2. తెలంగాణ టెట్ పేపర్-2 (గణితము/సైన్స్) సిలబస్ తెలుగులో

3. తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో

4. తెలంగాణ టెట్ 2022 నోటిఫికేషన్ వివరాలు తెలుగులో

Telangana TET - Paper-2 (Social Studies) Syllabus in the form of PDF in Telugu

          The Telangana TET Paper-2 (Social Studies) syllabus is being translated into Telugu and provided to almost agree with the textbooks based on the titles in the textbooks. You can download the Telangana TET Paper-2 (Social Studies) syllabus directly in the form of PDF in Telugu by clicking on the link below.

తెలంగాణ టెట్ – చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ సిలబస్ తెలుగులో (Telangana TET Child Development and Pedagogy Syllabus in Telugu)

1. DEVELOPMENT OF CHILD

- Development, Growth & Maturation - Concept & Nature

- Principles of Development & their educational implications

- Factors influencing Development - Biological, Psychological, Sociological

- Dimensions of Development and their interrelationships - Physical & Motor, Cognitive, Emotional, Social, Moral, Language relating to Infancy, early Childhood, late Child hood, Adolescence.

- Understanding Development - Piaget, Kohlberg, Chomsky, Carl Rogers and Erikson

- Individual differences - Intra & Inter Individual differences in the areas of Attitudes, Aptitude, Interest, Habits, Thinking (Divergent & Convergent), Intelligence and their Assessment

- Development of Personality - Concept, Factors effecting development of Personality, Child Rearing

 Practices, Self-Concept

- Adjustment, Behavioural problems, Défense Mechanisms, Mental Health

- Methods and Approaches of Child Development – Introspection, Observation, Interview, Case study,

Experimental, Rating Scales, Anecdotal Records, Questionnaire, Cross sectional and Longitudinal

- Developmental tasks and Hazards

1. పెరుగుదల వికాసం

- పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము

- వికాస నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము

- వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు

- వికాసంలోని అంశాలు – భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం

- వివిధ దశలలో వికాసం – శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ, వయోజన దశ

- శిశు వికాస అవగాహన – పియాజీ, కోల్బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ సన్ – సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం, ఆత్మభావనా సిద్ధాంతం, మనో సాంఘిక వికాస సిద్ధాంతం

- వైయుక్తిక భేదాలు – ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ఆలోచన

- మూర్తిమత్వ వికాసం – భావన, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్దాంతాల, మనోలైంగిక వికాస సిద్ధాంతం

- సర్ధుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు

- శిశు వికాస అధ్యయన పద్ధతులు

- వికాసృత్యాలు – ఆటంకాలు

2. UNDERSTANDING LEARNING

- Concept, Nature of Learning - Input - Process - Outcome

- Factors of Learning - Personal and Environmental

- Approaches to Learning and their applicability - Behaviorism (Skinner, Pavlov, Thorndike), Constructivism (Piaget, Vygotsky), Gestalt (Kohler, Koffka) and Observational (Bandura)

- Dimensions of Learning - Cognitive, Affective and Performance

- Motivation and Sustenance -its role in learning.

- Memory & Forgetting

- Transfer of Learning

2. అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం

- అభ్యసనం – భావన – స్వభావం – లక్షనాలు – రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు

- అభ్యసనా సిద్ధాంతాలు – ప్రవర్తనా వాదం, నిర్మాణాత్మక వాదం, గెస్టాల్ట్ వాదం మరియు పరిశీలనా వాదం – ధార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం, పావలోవ్ శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనా సిద్ధాంతం, వైగోట్ స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం, కోహెలర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, బందూరా పరిశీలనా సిద్దాంతం

- అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*

- అభ్యసనములో ప్రేరణ పాత్ర

- స్మృతి – విస్మృతి

- అభ్యసనా బదలాయింపు, అభ్యసనా బదలాయింపు సిద్దాంతాలు, అభ్యసనా వక్రాలు

3. PEDAGOGICAL CONCERNS

- Teaching and its relationship with learning and learner

- Learners in Contexts: Situating learner in the socio-political and cultural context

- Children from diverse contexts - Children With Special Needs (CWSN), Inclusive Education

- Understanding of Pedagogic methods - Enquiry based learning, Project based learning, Survey, Observation and Activity based learning, Co-operative & Collaborative learning

- Individual and Group learning: Issues and concerns with respect to organizing learning in class room like Study habits, Self learning and Learning to learn skills

- Organizing learning in heterogeneous class room groups - Socio-economic background, Abilities and Interest

- Paradigms of organizing Learning - Teacher centric, Subject centric and Learner centric

- Theory of Instruction - Bruner

- Teaching as Planned activity - Elements of Planning

- Phases of Teaching - Pre active, Interactive and Post active

- General and Subject related skills, competencies required in teaching and attributes of good facilitator

- Learning resources - Self, Home, School, Play, Community, Technology

- Class room Management: Role of student, teacher, Leadership style of teacher, Creation of non-threatening learning environment, Managing behavior problems, Guidance & Counseling, Child Abuse, Punishment and its legal implications, Rights of a child, Time Management.

- Distinction between Assessment for Learning & Assessment of Learning, School based Assessment, Continuous & Comprehensive Evaluation : Perspective & Practice

- Understanding teaching & learning in the context of NCF, 2005 & Right To Education Act, 2009.

3. బోధనా శాస్త్ర అవగాహన

- బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం

- విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య

- బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన

- వైయుక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనము

- తరగతి గది సమూహము – నాయకత్వం

- వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు,

- బోధనా ప్రణాళ, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన

- బోధనలోని దశలు – హెర్బార్ట్ సోపానాలు

- సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు

- తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం – మంత్రణం

- అభ్యసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం

- విద్యా హక్కు చట్టం – 2009, బాలల హక్కులు

- జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005

తెలంగాణ టెట్ – లాంగ్వేజ్ - 1 తెలుగు సిలబస్ (Telangana TET – First Language Telugu Syllabus)

1. పఠనావగాహన

   ఎ. అపరిచిత పద్యం

   బి. అపరిచిత గద్యం

2. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) – 2015 లో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఆధారంగా

   ఎ. తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు

   బి) ప్రక్రియలు

   సి) శతకాలు

   డి) కళలు, కళాకారులు

   ఇ) వేడుకలు

   ఎఫ్) క్రీడలు/పాటలు

3. పదజాలం

   ఎ) సామెతలు

   బి) జాతీయాలు

   సి) పొడుపు కథలు

   డి) తెలంగాణ పదజాలం

   ఇ) అర్ధాలు

   ఎఫ్) నానార్ధాలు

   జి) పర్యాయ పదాలు

   హెచ్) వ్యుత్పత్యర్ధాలు

   ఐ) ప్రకృతి వికృతులు

4. భాషాంశాలు

   ఎ. భాషాభాగాలు, క్రియలు (సమాపక, అసమాపక క్రియలు)

   బి. కాలాలు, విభక్తులు

   సి. లింగాలు

   డి. విరామ చిహ్నాలు

   ఇ. వచనాలు

   ఎఫ్. పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, దృత ప్రకృతికములు)

   జి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)

   హెచ్. సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాన పదాలుగా కూర్చడం)

   ఐ. ఛందస్సు – గురు, లఘువులను గుర్తించడం

   జె. అలంకారాలు –

   కె. వాక్యాలు – రకాలు - ఆశ్చర్యార్ధక, విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్ధక, అనుమత్యర్ధక, నిషేధార్ధక వాక్యాలు – ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మణి వాక్యాలు – సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం

   ఎల్) అర్థవిపరిణామం

తెలంగాణ టెట్ – తెలుగు మెథడాలజీ సిలబస్ (Telangana TET Telugu methodology Syllabus)

ఎ. భాష – మాతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు

బి. భాష – వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం

సి. భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్ధ్యాలు, తరగతి గది అన్వయం

డి. బోధనా పద్ధతులు

ఇ. ప్రణాళికా రచన – వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం

ఎఫ్.. బోధనాభ్యసన ఉపకరణాలు

జి. మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)

గమనిక: అభ్యర్ధులు తాము చదివిన మాధ్యమాన్ని బట్టి, పదవ తరగతి స్థాయిలో తాము ఎంచుకున్న ఆప్షనల్ లాంగ్వేజ్ ను బట్టి తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతంలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఇవ్వబడుతుంది. ఆయా లాంగ్వేజ్ లకు సంబంధించిన సిలబస్ ను నేరుగా అధికారిక వెబ్ సైట్ http://tstet.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోగలరు.

తెలంగాణ టెట్ – లాంగ్వేజ్-2 – ఇంగ్లీష్ సిలబస్ (TS TET Second Language English Syllabus)

1. Parts of Speech

2. Tenses

3. Types of Sentences

4. Prepositions

5. Articles

6. Degrees of Comparison

7. Direct and Indirect Speech

8. Questions and question tags

9. Active & Passive Voice

10. Use of Phrases

11. Comprehension

12. Composition

13. Vocabulary (Synonyms, Antonyms, Spelling test)

14. Meaning of Idiomatic expressions

15. Correction of sentences

16. Sequencing of the Sentences in the given paragraph

17. Error identification within a sentence

తెలంగాణ టెట్ – ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ (TS TET English Methodology Syllabus)

1. Aspects of English:- (a) English language - History, nature, importance, principles of English as second language (b) Problems of teaching / learning English.

2. Objectives of Teaching English

3. Phonetics

4. Development of Language skills:- a Listening, Speaking, Reading & Writing (LSRW). b) Communicative skills

5. Approaches, Methods and Techniques of teaching English (Introduction, Definition, Types of approaches, methods and techniques of teaching including remidial teaching)

6. Teaching of structures, Vocabulary and Grammar

7. Teaching Learning materials in English

8. Lesson Planning

9. Curriculum and Text books – Importance and need.

10. Evaluation in English Language

తెలంగాణ టెట్ – సోషల్ స్టడీస్ కంటెంట్ డీటెయిల్డ్ సిలబస్ తెలుగులో (Telangana TET Social Studies Content Syllabus in Telugu)

I. DIVERSITY ON THE EARTH

1. Maps – scale – cardinal points – types of maps – evolution of  maps - conventional signs – contour lines.

2. Globe – oceans and continents - latitudes and longitudes – origin of earth - realms of the earth (lithosphere, atmosphere, hydrosphere, biosphere)– landforms – movements of the earth and its effect – seasons - interior of the earth.

3. Solar Energy – insolation – temperature and its measuring – polar regions.

4. Elements of climate – types of rainfall.

5. Europe, Africa and Antarctica – location – physical features– climate – forests and wild life – population – agriculture – minerals – industries – transportation – trade , exports and imports.

6. Geography of India and Telangana – physical features – rivers and other water sources – seasons – forests – climate and its factors affecting – floods and droughts – forests and animal wealth – soils – electricity – agriculture – mineral wealth – industries – population, literacy rate – density of population - settlements and migration- transportation.

I. భూమి - వైవిధ్యం

1. పటములు – స్కేలు, కార్డినల్ బిందువులు, పటాలలో రకాలు, పటాల పరిణామక్రమము, సాంప్రదాయ గుర్తులు, కాంటూర్ రేఖలు

2. గ్లోబు – మహాసముద్రాలు మరియు ఖండాలు – లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్, భూ పరిణామక్రమము, భూ ఆవరణములు (శిలావరణము, వాతావరణము, జలావరణము, జీవావరణము) – భూ స్వరూపాలు, భూ చలనాలు మరియు వాటి ఫలితాలు – కాలాలు, భూ అంతర్భాగము

3. సౌరశక్తి – భూ వికిరణము, ఉష్ణోగ్రత మరియు దాని కొలమానము, ధృవపు ప్రాంతాలు

4. శీతోష్ణస్థితిలోని అంశాలు, వర్షపాతంలోని రకాలు

5. యూరప్, ఆఫ్రికా మరియు అంటార్కిటికా – ఉనికి, భౌతిక లక్షణాలు, శీతోష్ణస్థితి, అడవులు మరియు వన్యప్రాణులు, జనాభా విస్తరణ, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం ఎగుమతులు మరియు దిగుమతులు.

6. భారతదేశము మరియు తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రములు, భౌతిక లక్షణములు, నదులు మరియు ఇతర నీటి వనరులు, కాలాలు, అడవులు, విద్యుత్ శక్తి, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రమలు, జనాభా, అక్షరాస్యతా రేటు, జనసాంద్రత, వలసలు, స్థిర నివాసాలు, రవాణా వ్యవస్థ

II. PRODUCTION – EXCHANGE AND LIVELIHOODS

1. Production : Handicrafts, hand-looms – trade – factors of production (land, labour , capital and organization) employment- organized and unorganized sectors.

2. Exchange : money and banking- types of accounts -banking system – loans – commercial banks – their new services - price index , constructing a Consumer Price Index , regulating prices,, barter system , evolution of money , paper money, plastic money – Internet banking – Financial Literacy Reserve Banks and Self Help Groups.

3. Budget: Family budget – government budget – taxes – types of taxes – VAT – government

expenditures.

4. Livelihoods: Changes in technology - Impact of Technology on the three sectors : agriculture industries and services.

5. Public Health : health services – public and private -health insurances – state of health in Telangana – Nutrition – safe drinking water – Public Health centers.

6. Inflation : types of inflation – reasons and effects.

7. New economic reforms: Globalization, Liberalization, privatization, FDI.

8. National Income : GNP, NNP, GDP, NDP and nominal and real GDP, National Income of India, Per capita Income of India standards of living- Development – meaning and its consequences.

9. Food Security -need – increase of food security – increase in food grains – PDS and Sustainable Development.

II. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు

1. ఉత్పత్తి – చేతివృత్తులు, చేతి మగ్గాలు వాణిజ్యం, ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు (భూమి, కార్మికులు, మూలధనము మరియు సంస్థాగత ఏర్పాట్లు) సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉద్యోగాలు.

2. ద్రవ్య మారకం – ద్రవ్యము మరియు బ్యాంకింగ్, అకౌంట్స్ లో రకాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, లోన్లు, వాణిజ్య బ్యాంకులు మరియు వాటి కొత్త సేవలు, ద్రవ్య సూచీ, వినియోగదారుల ద్రవ్యసూచీ తయారీ, ద్రవ్యం పరిణామ క్రమము, పేపర్ మనీ, ప్లాస్టిక్ మనీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆర్ధిక అక్షరాస్యత, రిజర్వ్ బ్యాంకు మరియు స్వయం సహాయక సంఘాలు

3. బడ్జెట్ – కుటుంబ బడ్జెట్ – ప్రభుత్వ బడ్జెట్, పన్నులు, పన్నులలో రకాలు, VAT, ప్రభుత్వ ఖర్చులు

4. జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన మార్పులు, జీవనోపాధులపై సాంకేతిక విజ్ఞాన ప్రభావం (వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలు)

5. ప్రజారోగ్యం – ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య సేవలు, ఆరోగ్య భీమా, తెలంగాణ లో వైద్య రంగ పరిస్థితి, పోషణ, సురక్షితమైన త్రాగునీరు, ప్రజారోగ్య కేంద్రాలు

6. ఆర్ధికరంగంలో నూతన సంస్కరణలు – ప్రపంచీకరణ, సరళీకరణ మరియు ప్రైవేటీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)

8. జాతీయాదాయం – GNP, NNP, GDP, NCP మరియు వాస్తవిక తలసరి ఆదాయం, భారతదేశం యొక్క జాతీయ ఆదాయం, జీవన స్థాయి స్థితిగతులు, అభివృద్ధి – భావన మరియు అనుసరణలు

9. ఆహారభద్రత – ఆహార అవసరం, ఆహార భద్రతను పెంపొందించడం, ఆహారధాన్యాలను పెంచడం, ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు సుస్థిరాభివృద్ధి

II. POLITICAL SYSTEMS AND GOVERNANCE

1. Tribal Panchayat system – present local body system ( Gram Panchayat , Mandal Parishad and Zilla Parishad) & Urban Governments – formation and functions.

2. Emergence of kingdoms and republics – first empires – Mouryas – Rajputs – Rastrakutas – Cholas – Deccan kingdoms.

3. Regional Kingdoms : Kakatiyas – Vijayanagara Empires – Qutubshahis.

4. Moghals – Asafjahis – British Empire – landlords and tenants under the British and Nizams and Moghals – peasant movement in Hyderabad.

5. National Movement in India - Muslim League – partition and migration – merging of princely states - and Freedom Movement in Hyderabad State.

6. Making of laws – Assembly - Council and Parliament – Election process.

7. Implementation of Laws – Role of Collector, Tahasildar and VRO

8. Indian Constitution – formation – features and preamble - Justice – Rule of Law – Judicial System - civil and criminal laws.

9. Changing cultural traditions in Europe 1300-1800 – renaissance – reformation – modern science.

10. Democratic and National Movements – England , American and French revolutions -unification of Germany and Italy. Expansion of Democracy in Myanmar and Libya – Civil Liberties.

11. Industrialization and social change - Britain, Germany and France – movements of women,

workers (Socialism).

12. Colonialism in Latin America, Asia and Africa – impact on India and other regional movements.

13. World Wars I and II – reasons –Treaty of Versailles – League of Nations Holocaust – consequences – Great depression.

14. National Liberation Movements in China , Vietnam and Nigeria

15. Post war world and India -UNO – NAM - west Asian conflicts – peace movements and collapse of USSR.

16. Independent India – first general elections - SRC – Relation with  neighbouring countries - regional agitations and formation of parties – coalition governments – Emergency period – Mandal commission.

18. The Movement for the formation of Telangana – gentle men's agreement – reasons for Telangana demand – different JACs – TRS – achieving Telangana.

III. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన

1. తెగలు - సామాజిక నిర్ణయాధికారం – ప్రస్తుత స్థానిక పరిపాలన (గ్రామ పంచాయితీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్) & పట్టణ స్థానిక ప్రభుత్వాలు, ఏర్పాటు మరియు విధులు

2. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

3. ప్రాంతీయ రాజ్యాలు – కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు

4. మొఘలులు – అసఫ్ జాహీలు, బ్రిటీష్ సామ్రాజ్యం, బ్రిటీష్ మరియు నిజాం ప్రభుత్వంలో భూస్వాములు మరియు కౌలుదార్లు, మొఘలులు, హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం

5. భారతదేశంలో జాతీయోద్యమం, ముస్లిం లీగ్, దేశ విభజన మరియు వలస పోవడం, సంస్థానాల విలీనం, హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం

6. చట్టాలను తయారుచేయడం, అసెంబ్లీ, కౌన్సిల్ మరియు పార్లమెంట్ – ఎన్నికల ప్రక్రియ

7. చట్టాలను అమలు చేయడం – కలెక్టర్, తహసీల్దార్ మరియు VRO పాత్ర

8. భారత రాజ్యాంగం – రూపకల్పన, లక్షణాలు, ప్రవేశిక, చట్టం, న్యాయం, న్యాయ వ్యవస్థ, సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు.

9. యూరప్ లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు (1300-1800), సామాజిక నిరసనోద్యమాలు

10. ప్రజాస్వామ్య మరియు జాతీయ ఉద్యమాలు – ఇంగ్లాండ్, అమెరికా మరియు ఫ్రెంచి విప్లవాలు, జర్మనీ మరియు ఇటలీ ఏకీకరణ, మయన్మార్ మరియు లిబియాలలో ప్రజాస్వామ్య విస్తరణ, మహిళా ఉద్యమాలు, సోషలిజం

12. లాటిన్ అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో వలసవాదం, భారతదేశంపై ప్రభావం మరియు ఇతర ప్రాంతీయ ఉద్యమాలు

13. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్దాలు. కారణాలు, వర్సెయిల్స్ సంధి, నానాజాతి సమితి, తదనంతర పరిణామాలు, తీవ్రమైన మాంద్యం

14. చైనా, వియత్నాం మరియు నైజీరియాలలో జాతీయ నిరసనోద్యమాలు

15. ప్రపంచ యుద్ధాల అనంతరం భారతదేశం, ఐక్యరాజ్యసమితి, నామ్, పశ్చిమ ఆసియా  సంక్షోభం, USSR విచ్ఛిన్నం మరియు శాంతి ఉద్యమాలు

16. భారతదేశ స్వాతంత్రం – మొదటి సాధారణ ఎన్నికలు, రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్, పొరుగుదేశాలతో సంబంధాలు, ప్రాంతీయ ఉద్యమాలు, పార్టీల ఆవిర్భావం, సంకీర్ణ ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ పిరియడ్, మండల్ కమిషన్

17. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం, పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కారణాలు, విభిన్న JAC లు, తెలంగాణ రాష్ట్రసమితి, తెలంగాణ సాధన

IV. SOCIAL ORGANIZATION AND INEQUITIES

1. Diversity in India – gender inequalities – sex ratio – employment – status of women and their work with wages – women protection acts.

2. Caste discriminations- reformers initiations.

3. Abolition of Zamindari System – poverty -Land ceiling.

4. Right to Education Act – Human Rights and Fundamental Rights.

5. Social Movements – Civil Rights movements – Green Peace. movements – Bhopal gas disaster – NBM – meria paibi.

IV. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు

1. భారతదేశంలో వైవిధ్యత, లింగ సమానత్వం, స్త్రీ, పురుషుల నిష్పత్తి, ఉద్యోగాల కల్పన, మహిళల యొక్క స్థితిగతులు మరియు వారి పనులు, మహిళా రక్షణ చట్టాలు.

2. అంటరానితనం, సంస్కరణలు

3. జమీందారి వ్యవస్థ రద్దు, పేదరికము, గరిష్ట భూ కమతాలపై పరిమితులు

4. విద్యాహక్కు చట్టం, పౌర హక్కుల ఉద్యమాలు, గ్రీన్ పీస్ ఉద్యమం, భోపాల్ గ్యాస్ ప్రమాదం, NBM, పైరా పైబీ ఉద్యమం

V. RELIGION AND SOCIETY

1. Religion and society in early times – Indus Valley Civilization – Vedas – Gautama Buddha.

2. Early Religious beliefs – Hinduism , Bhakti movement, Alvars and  Nayanars– Christianity and Islam – Sufism.

3. Folk Gods – worship – Bonalu - Medaram jatara – Moharram.

4. Christian Missionary activities – Social Reformers.

5. Understanding Secularism.

V. మతం, సమాజం

1. ప్రాచీన కాలంలో మతం, సమాజం, సింధూలోయ నాగరికత, వేదాలు, గౌతమ బుద్ధుడు

2. ప్రాచీన సాంప్రదాయాలు – హిందుత్వం, భక్తి ఉద్యమాలు, ఆళ్వారులు మరియు నయనార్లు, కైస్త్రవం మరియు ఇస్లాం, సూఫీతత్వం

3. గ్రామ దేవతలు, పూజలు, బోనాలు, మేడారం జాతర, మొహరం

4. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, సాంఘిక సంస్కరణోద్యమాలు

5. లౌకికత్వాన్ని అవగాహన చేసుకోవడం

VI. CULTURE AND COMMUNICATION

1. Language – script -great epics.

2. Sangam Literature.

3. Sculpture and Buildings – Mauryan and Buddhist.

4. Rulers and Buildings -Engineering skills , temples, mosques , tanks and temples.

5. Performing Arts – film and print media – role in National Movement.

6. Sports, Nationalism and Commerce.

VI. సంస్కృతి - సమాచారం

1. భాష – లిపి, గొప్ప గ్రంధాలు

2. సంఘం సాహిత్యం

3. శిల్పం, కట్టడాలు – మౌర్యులు మరియు బౌద్ధులు

4. రాజులు మరియు కట్టడాలు – ఇంజనీరింగ్ నైపుణ్యాలు, దేవాలయాలు, మసీదులు, చెరువులు మరియు దేవాలయాలు

5. ఆధునిక కాలంలో కళలు, కళాకారులు – చలన చిత్రాలు మరియు ప్రింట్ మీడియా – జాతీయోద్యమంలో వాటి పాత్ర

6. క్రీడలు జాతీయత మరియు వాణిజ్యం

తెలంగాణ టెట్ – సోషల్ మెథడాలజీ సిలబస్ తెలుగులో (Telangana TET Social methodology Syllabus in Telugu)

PEDAGOGY (Marks: 12)

1. Nature and Scope of Social Studies.

2. Aims, Objectives and values of Teaching Social Studies.

3. Methods & techniques of Teaching Social Studies.

4. Teaching, Learning Material and Resources.

5. Instructional Planning.

6. Evaluation.

7. Social Studies Teacher.

8. Curriculum and Text Book

9. Disaster Management , Deforestation, Socio Economic Problems

10. National Identity -Civic affairs - International Relations.

1. సాంఘిక శాస్త్రము – స్వభావము మరియు పరిధి

2. సాంఘికశాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు

3. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు మరియు వ్యూహాలు

4. బోధనాభ్యసన పరికరాలు మరియు వనరులు

5. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమంగా బోధన

6. మూల్యాంకనం

7. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు

8. పాఠ్యప్రణాళిక మరియు పాఠ్య పుస్తకము

9. విపత్తుల నిర్వహణ, అడవుల నిర్మూలన వలన కలిగే సాంఘిక ఆర్ధిక సమస్యలు

10. జాతీయ గుర్తింపు, సివిక్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు.

అభ్యర్దులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సిలబస్ ను తెలుగులోకి అనువదించడం జరిగింది. మాకున్న అవగాహన మేరకు ఈ అనువాదం జరిగింది. కొన్ని సందర్భాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలకు బదులుగా, సమానార్ధకాలను వాడటం జరిగింది. అలాగే అతి కొద్ది పదాలకు తెలుగులో సమానార్ధకాలు లభించనందున యధాతధంగా ఆంగ్లంలో రాయడం జరిగింది.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని తెలియచేస్తున్నాము. అధికారిక సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ఫాలో అవుతూ చదువుకోవలసిందిగా సూచించడమైనది

 

తెలంగాణ టెట్ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని మొత్తం 70 రోజులలో సిలబస్ ను పూర్తి చేసేలా చక్కని షెడ్యూల్ తో పాటు క్వాలిటీ ప్రశ్నలతో ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

పూర్తి వివరాలకోసం TELANGANA TET అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి

 

Useful for the Aspirants Who are searching for ts tet syllabus paper 2 in telugu medium | ts tet syllabus 2021 pdf | ts tet syllabus 2021 paper 2 in telugu | ts tet syllabus 2022 pdf download | ts tet paper 2 syllabus pdf download | Telangana tet syllabus 2022 in telugu medium pdf download | t stet | ts tet syllabus in telugu medium




exams.navachaitanya.net