Telangana TET Notification - 2022 Details in Telugu Including Syllabus, Pattern, Exam Dates, Application Fee, Application Dates, Exam Centers etc.,
Telangana TET Notification 2022 Details In Telugu
Every candidate who has completed D.Ed or
B.Ed. will get a teacher job that will share the joy of life. For that, we will
have to go through some obstacles and achieve good results in various examinations.
The first hurdle for candidates who want to write DSC is tet. Let us try to
know the full details about this Telangana TET Notification and Details through
this PDF.
డిఈడీ లేదా బిఈడీ పూర్తి
చేసిన ప్రతి అభ్యర్ధి కల ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం. జీవితం మొత్తం ఆనందాన్ని పంచి
ఇవ్వగల ఉపాధ్యాయ ఉద్యోగం అంత తేలికగా లభించదు. దానికోసమై కొన్ని అవరోధాలను
దాటుకుంటూ, వివిధ పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
డియస్సీ రాయాలనుకునే అభ్యర్ధులు దాటాల్సిన మొదటి హర్డిల్ టెట్. ఈ టెట్ గురించిన
పూర్తి వివరాలను మనం ఈ పిడిఎఫ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
What is TET?
Teachers
Eligibility Test (TET) is briefly
treated as TET. TET is a qualifying
test conducted to test the minimum knowledge of those who want to take up the
teaching profession as per the provisions issued by the NCTE (National Council
for Teachers Education) in 2010.
టీచర్స్
ఎలిజిబిలిటీ టెస్ట్ (Teachers Eligibility Test) ను
సంక్షిప్తంగా TET గా వ్యవహరిస్తుంటారు. విద్యా హక్కు చట్టం
అనుసరించి NCTE (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్)
2010 లో విడుదల చేసిన నిబంధనలను అనుసరించి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని
చేపట్టాలనుకుంటారో, వారి యొక్క కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి నిర్వహించే
అర్హతా పరీక్షయే టెట్ (TET).
Who has to write Telangana TET?
Candidates
who wish to take up teaching profession will have to write telangana teachers'
eability test. Candidates who have
Completed D.Ed, B.Ed, Language Pandit or equivalent qualifications or are in
the last year of studying the above courses will have to write and qualify this
exam. Candidates who have qualified TET in the past can also take the Telangana
TET exam to increase their weightage marks.
The Telangana TET will be conducted in two
papers with the names of Paper-I and Paper-II. Job seekers who want to teach from 1st to 5th
standard will have to write Paper-I. Job seekers who want to teach from 6th to
8th standard will have to write Paper-II. Those who want to teach from Class 1 to Class
8 will have to write both Paper-I and Paper-II and qualify.
Paper-1 |
Candidates who want to
teach from class 1 to 5 will have to write. Candidates who want to
appear for the SGT exam in DSC will have to write. Candidates who have
completed the DEd or BEd course will have to write. |
Paper-2 |
Candidates who want to
teach from class 6 th to 8th have to write. Candidates who want to
appear for the school assistant exam in DSC will have to write. Candidates who have
completed B.Ed course will have to write. |
ఉపాధ్యాయవృత్తి చేపట్టాలనుకుంటున్న
అభ్యర్ధులు తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను రాయాల్సి ఉంటుంది. ఎవరైతే D.Ed, B.Ed, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హతలను
కలిగి ఉంటారో లేదా పై కోర్సులను చదువుతూ చివరి సంవత్సరంలో ఉంటారో వారు ఈ పరీక్షను
రాసి, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్ధులు కూడా తమ
వెయిటేజ్ మార్కులను పెంచుకోవడం కోసం తెలంగాణ టెట్ పరీక్షను రాయవచ్చు.
పేపర్-1 మరియు పేపర్-2
పేర్లతో రెండు పేపర్లుగా ఈ తెలంగాణ టెట్ నిర్వహించబడుతుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి
వరకూ బోధించాలనుకునే ఉద్యోగార్ధులు పేపర్-1 ను రాయాల్సి ఉంటుంది. 6వ తరగతి నుంచి
8వ తరగతి వరకూ బోధించాలనుకునే ఉద్యోగార్ధులు పేపర్-2 ను రాయాల్సి ఉంటుంది. ఎవరైతే
1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ బోధించాలనుకుంటారో వారు పేపర్-1 మరియు పేపర్-2 రెండూ
రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
పేపర్-1 |
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ బోధించాలనుకునే అభ్యర్ధులు రాయాల్సి
ఉంటుంది. డియస్సీ లో యస్జీటీ పరీక్ష రాయాలనుకునే అభ్యర్ధులు రాయాల్సి ఉంటుంది. బిఈడీ లేదా డిఎడ్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్ధులు రాయాల్సి ఉంటుంది. |
పేపర్-2 |
6వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ బోధించాలనుకునే అభ్యర్ధులు రాయాల్సి
ఉంటుంది. డియస్సీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్ధులు రాయాల్సి
ఉంటుంది. బిఎడ్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్ధులు రాయాల్సి ఉంటుంది. |
Telangana Teachers Eligibility Test (TET) Notification released:
Telangana Government - School Education
Department released TS TET - 2022 Notification on 24.03.2022. Through this notification, the exam
date has been released along with other details as well as the Telangana TET
syllabus. Send whatsapp message to 9640717460 TELANGANA TET to get telangana TET
syllabus in Telugu.
తెలంగాణ
ప్రభుత్వం – స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం వారు ది. 24.03.2022 న TS TET - 2022 ను
విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష తేదీ ఇతర వివరాలతో పాటు
తెలంగాణ టెట్ సిలబస్ ను కూడా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ టెట్ సిలబస్ ను
తెలుగులో పొందడం కోసం TELANGANA TET అని 9640717460 కు
వాట్సాప్ సందేశం పంపండి.
ఇవి
కూడా చూడండి
1.
తెలంగాణ
టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో
2.
తెలంగాణ టెట్ పేపర్-2 (గణితము/సైన్స్) సిలబస్ తెలుగులో
3.
తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో
4.
తెలంగాణ టెట్ – 2022 నోటిఫికేషన్
వివరాలు తెలుగులో
Date of conduct of Telangana TET-2022:
The government intends to conduct the
Telangana TET exam on the following dates as per the TS TET - 2022 (Telangana
TET) notification released by the Telangana government.
TS TET – 2022 Exam Date & Timings |
|
Paper-1: |
Exam Date: 12.06.2022 Exam Time: 9.30 am to 12.00
pm The test will be
conducted for two and a half hours. |
Paper-2: |
Exam Date: 12.06.2022
Exam Time: 2.30 pm to 5.00 pm The test will be
conducted for two and a half hours. |
తెలంగాణ
ప్రభుత్వం విడుదల చేసిన TS TET – 2022 (తెలంగాణ టెట్) నోటిఫికేషన్
అనుసరించి తెలంగాణ టెట్ పరీక్షను క్రింది తేదీలలో నిర్వహించాలని ప్రభుత్వం
భావిస్తున్నది.
TS TET – 2022 Exam Date &
Timings |
|
Paper-1:
|
పరీక్ష తేదీ: 12.06.2022 పరీక్ష సమయం:
ఉదయం గం. 9.30 నుంచి మధ్యాహ్నం గం. 12.00 వరకూ పరీక్ష రెండున్నర గంటల పాటు నిర్వహించబడుతుంది. |
Paper-2: |
పరీక్ష తేదీ: 12.06.2022 పరీక్ష సమయం: మధ్యాహ్నం గం. 2.30 నుంచి, సాయంత్రం గం. 5.00 వరకూ పరీక్ష రెండున్నర గంటల పాటు నిర్వహించబడుతుంది. |
TS TET – 2022 Application fee details:
Candidates who wish to apply for Telangana
TET exam will have to pay an application fee of Rs.200 (including examination
fee) as specified in the notification. Candidates will be given the option to
apply for Paper-I or Paper-II or both with a fee of Rs.200. The application fee
will be paid through the TS ONLINE
website or payment gateway centres. From
March 26,
2022. Application fee can be paid between April 11, 2022. April 11, 2022 has been fixed as the last
date.
Candidates who have paid the application fee will have to complete the
application online through the official website https://tstet.cgg.gov.in of Telangana TET.
Applications can be submitted between 26.03.2022 to 11.04.2022 dates. The last
date for completion of application is 12.04.2022
Fee Payment Dates: |
25.03.2022 to 11.04.2022 |
Last date to pay TS TET
Examination Fee |
11.04.2022 |
Online Application
Dates: |
26.03.2022 to 12.04.2022 |
Last date to submit TS
TET Application |
12.04.2022 |
Official Website for TS
TET - 2022 |
తెలంగాణ
టెట్ పరీక్షకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్ లో తెలియచేసినట్లుగా రూ.
300 (ఎగ్జామినేషన్ ఫీజుతో కలుపుకుని) అప్లికేషన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
పేపర్-1 లేదా పేపర్-2 లేదా రెండింటికీ రూ. 300 ఫీజుతో అప్లై చేసుకునే అవకాశం
ఇవ్వబడుతుంది. అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజును TS ONLINE వెబ్
సైట్ లేదా పేమెంట్ గేట్ వే సెంటర్ల ద్వారా ది. మార్చి 25, 2022 తేదీ నుంచి
ది. ఏప్రిల్
11, 2022 తేదీల మధ్య అప్లికేషన్ రుసుమును చెల్లించవచ్చు. అప్లికేషన్
రుసుమును చెల్లించేందుకు ది. ఏప్రిల్ 11, 2022 ఆఖరు తేదీగా నిర్ణయించడం జరిగింది.
అప్లికేషన్ ఫీజును చెల్లించిన
అభ్యర్ధులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in ద్వారా అప్లికేషన్ ను ఆన్ లైన్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్
లను ది. 26.03.2022 నుంచి ది. 12.04.2022 తేదీల మధ్య సబ్మిట్ చేయవచ్చు.
అప్లికేషన్ పూర్తి చేయడానికి ది. 12.04.2022 ఆఖరు తేదీగా నిర్ణయించడం జరిగింది.
Fee
Payment Dates: |
25.03.2022 to 11.04.2022 |
Last
date to pay TS TET Examination Fee |
11.04.2022 |
Online
Application Dates: |
26.03.2022 to 12.04.2022 |
Last
date to submit TS TET Application |
12.04.2022 |
Official
Website for TS TET - 2022 |
How to submit application online:
The procedure for submitting the Telangana
TET - 2022 online application will be given in the information bulletin given
along with the notification. This information bulletin can be downloaded from https://tstet.cgg.gov.in website or you can
submit your details to an educated Internet center in your area without any
errors and submit the online application.
Candidates who want to apply for Telangana
TET should first check their qualifications. After confirming that there are
suitable qualifications, the application fee will be Rs. 300 is required to be
paid through TS Online or Payment Gateway . The 'Journal Number' on the
subsequent receipt is required at the time of providing the TET application
online.
Candidates who have paid the application fee
and obtained the journal number will have to submit the Telangana TET - 2022
application online by carefully filling their photo, signature and details of
their education. Once the application is
submitted, the candidates will be given a reference ID number. Candidates will
have to save this reference ID for further purposes.
తెలంగాణ
టెట్ - 2022 ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం నోటిఫికేషన్ తో పాటుగా
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇవ్వబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను https://tstet.cgg.gov.in
వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ ప్రాంతంలోని అవగాహన కలిగిన ఇంటర్
నెట్ సెంటర్ ద్వారా మీ వివరాలను తప్పులు లేకుండా అందించి, ఆన్ లైన్ అప్లికేషన్ ను
సబ్మిట్ చేయించుకోవచ్చు.
తెలంగాణ టెట్ కోసం అప్లై
చేయాలనుకునే అభ్యర్ధులు మొదట తమ అర్హతలను పరిశీలించుకోవాలి. తగిన అర్హతలు ఉన్నాయని
నిర్ధారణ చేసుకున్ తరువాత అభ్యర్ధి పేరు, డేటాఫ్ బర్త్, తెలంగాణ రాష్ట్రానికి
చెందినవారా కాదా, మొబైల్ నెంబరు వంటి ప్రాధమిక వివరాలను అప్ డేట్ చేస్తూ అప్లికేషన్
రుసుము రూ. 300 లను TS Online లేదా Payment Gateway ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లభించే రిసీట్ పై గల ‘జర్నల్
నెంబరు’ ఆన్ లైన్ లో టెట్ అప్లికేషన్ అందించే సమయంలో అవసరం అవుతుంది.
అప్లికేషన్ రుసుమును
చెల్లించి, జర్నల్ నెంబరును పొందిన అభ్యర్ధులు తమ ఫోటో, సిగ్నేచర్ తో పాటు తమ
విద్యా సంబంధమైన వివరాలను జాగ్రత్తగా నింపుతూ తెలంగాణ టెట్ – 2022 అప్లికేషన్ ను
ఆన్ లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత
అభ్యర్ధులకు రిఫరెన్స్ ఐడి నెంబరు ఇవ్వబడుతుంది. తదుపరి అవసరాలకోసం ఈ రిఫరెన్స్
ఐడిను అభ్యర్ధులు భద్రపరచుకోవాల్సి ఉంటుంది.
Telangana TET - Exam Centres Details:
Telangana TET - 2022 exam is being organized to be conducted in the main
towns of all the 33 districts of Telangana State. Candidates will have to
inform in which district they want to write the exam at the time of submission
of the application. The list of examination centres will be given along with
the online application. If the number of candidates in the respective
examination centres exceeds the limit, the candidates will be given. Candidates
are advised to submit the application as soon as possible as they have to
choose a different examination centre near them.
తెలంగాణ
టెట్ – 2022 పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల
యొక్క ముఖ్యపట్టణాలలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అభ్యర్ధులు
అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో తాము ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారో
తెలియచేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ల యొక్క లిస్ట్ ఆన్ లైన్ అప్లికేషన్ తో
పాటు ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆయా ఎగ్జామినేషన్ సెంటర్లలో అభ్యర్ధుల సంఖ్య పరిమితికి
మించినట్లయితే అభ్యర్ధులు తమకు సమీపంలోని వేరే ఎగ్జామినేషన్ సెంటర్ ను
ఎంచుకోవాల్సి ఉంటుంది కనుక అభ్యర్ధులు సాధ్యమైనంత త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయడం
మంచిది.
Eligibility details of TS TET-2022:
As per the Telangana TET-2022 notification, candidates who wish to teach
from Class 1 to 5 will have to write Paper-I and paper-II examinations for
classes 6 to 8. Candidates who wish to teach for class 1 to 8 will be eligible
to appear for the exam only if they have secured suitable qualification for
these exams. Candidates studying in the final year of BEd
or DED in ncte approved colleges are also eligible to appear for the TET exam.
Telangana TET Paper-I (Class 1 to 5) Minimum Qualifications:
Intermediate
or Senior Secondary or equivalent examination should have passed with at least
50% marks. In case of SC/ST/BC/Differently
abled candidates, the minimum marks
percentage has been fixed at 45%. In addition to this, 2 years D.El.Ed/D.Ed course or 4 years B.El.Ed. Or
candidates who have completed 2 years of Diploma in Education (Special
Education) or are studying in the final year are eligible.
Candidates who have completed the degree with at least 50% marks (the minimum marks percentage in case of SC/ST/BC/Differently abled candidates has been fixed at 45%) can write Paper-I.
Telangana TET Paper-II ( Class 6 to 8) Minimum Qualifications:
Must have passed BA/BSc/BCom with at least
50% marks. In case of SC/ST/BC/Differently abled candidates, the minimum marks percentage has
been fixed at 45%. In addition to this, candidates who have completed Bachelor
in Education (B.Ed) or Bachelor of Education (Special Education – Special B.Ed)
are eligible. Or four years
B.A.Ed./B.Sc.Ed with at least 50% marks. In case of SC/ST/BC/Differently Abled candidates, the minimum marks percentage has
been fixed at 45%. Or candidates with graduation or Bachelor of Oriental
Language or Graduation in Literature or Post Graduation in Language as an
optional subject as well as language pandit training certificate or relevant
language methodology in BEd can also apply.
తెలంగాణ టెట్-2022 నోటిఫికేషన్ అనుసరించి 1 నుంచి 5వ
తరగతి వరకూ బోధించాలని భావించిన అభ్యర్ధులు పేపర్-1, 6 నుంచి 8వ తరగతి వరకూ
బోధించాలని భావించిన అభ్యర్ధులు పేపర్-2 పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు
తగిన క్వాలిఫికేషన్ అభ్యర్ధులు సాధించినట్లయితే మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు
అవుతారు. NCTE అనుమతి కలిగిన కళాశాలల్లో బిఈడీ లేదా డిఈడీ
చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా టెట్ పరీక్ష రాయడానికి అర్హులే.
తెలంగాణ
టెట్ పేపర్-1 (1 నుంచి 5వ తరగతి) కనీస అర్హతలు:
ఇంటర్
మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్షను కనీసం 50% మార్కులతో పాసై
ఉండాలి. SC/ST/BC/Differently abled అభ్యర్ధుల విషయంలో కనీస మార్కుల
శాతం 45% గా నిర్ణయించడం జరిగింది. దీనితో పాటుగా 2 సంవత్సరాల D.El.Ed/D.Ed కోర్సు లేదా 4 సంవత్సరాల B.El.Ed. లేదా 2 సంవత్సరాల డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్
ఎడ్యుకేషన్) పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు అర్హులు. 2015 కు పూర్వం డిఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్ధులకు సాధించాల్సిన కనీస మార్కులలో సడలింపు ఇవ్వబడినది. పూర్తి వివరాలను నోటిఫికేషన్ నుంచి తెలుసుకోవచ్చు.
కనీసం
50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి (SC/ST/BC/Differently abled అభ్యర్ధుల విషయంలో కనీస మార్కుల శాతం 45% గా నిర్ణయించడం జరిగింది)
బిఈడీ, బిఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్ధులు
పేపర్-1 రాయవచ్చు.
తెలంగాణ
టెట్ పేపర్-2 (6 నుంచి 8వ తరగతి) కనీస అర్హతలు:
బిఏ/బియస్సీ/బికామ్ కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. SC/ST/BC/Differently
abled అభ్యర్ధుల విషయంలో కనీస మార్కుల శాతం 45% గా నిర్ణయించడం
జరిగింది. దీనితో పాటుగా బాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (B.Ed) లేదా
బాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్ – Special B.Ed)
పూర్తి చేసిన అభ్యర్ధులు అర్హులు. లేదా నాలుగు సంవత్సరాల B.A.Ed.,/B.Sc.Ed ను కనీసం 50 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. SC/ST/BC/Differently
abled అభ్యర్ధుల విషయంలో కనీస మార్కుల శాతం 45% గా నిర్ణయించడం
జరిగింది. లేదా సంబంధిత లాంగ్వేజ్ ను ఆప్షనల్ సబ్జక్టుగా గ్రాడ్యుయేషన్ లేదా
బాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ లేదా పోస్ట్
గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ తో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా
బిఈడీలో సంబంధిత లాంగ్వేజ్ మెథడాలజీ కలిగియున్న అభ్యర్ధులు కూడా అప్లై చేయవచ్చు.
Telangana TET Exam Format and Syllabus Details:
Telangana TET Paper-I and Paper-II exams will
be conducted for 150 marks with 150 questions each. The exam will be held offline for two and a
half hours and candidates will have to
identify the answers to the questions through the OMR form. The Telangana TET – 2022
syllabus can be officially downloaded
from the Telangana TET website
https://tstet.cgg.gov.in in pdf form.
తెలంగాణ
టెట్ పేపర్-1 మరియు పేపర్-2 పరీక్షలు ఒక్కొక్కటి 150 ప్రశ్నలతో 150 మార్కులకు
నిర్వహించబడతాయి. రెండున్నర గంటలపాటు ఆఫ్ లైన్ లో జరిగే ఈ పరీక్షలో అభ్యర్ధులు OMR పత్రం ద్వారా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలంగాణ్ టెట్ –
2022 సిలబస్ ను పిడిఎఫ్ రూపంలో అధికారికంగా తెలంగాణ టెట్ వెబ్ సైట్ https://tstet.cgg.gov.in
నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Format of Paper-I examination:
1. Child Development
and Pedagogy |
30 questions for 30
marks |
2. Language – I (Telugu
or other Language) |
30 questions for 30
marks |
3. Language II
(English) |
30 questions for 30
marks |
4. Mathematics |
30 questions for 30
marks |
5. Environmental
Studies |
30 questions for 30 marks |
Questions related to
educational psychology will be given at the primary level in child development
and pedagagi subject. The language – 1 as Telugu, according to the medium or
his first language read by the candidate up to his/her class X , One has to choose between Urdu, Hindi,
Bengali, Kannada, Marathi, Tamil and Gujarati. English will be language-2.
Questions will be given to test the candidate's knowledge in the respective
languages in relation to Language-1 and Language-2. Out of the total questions,
24 questions will be from content and 6 from methodology.
In mathematics and environmental studies
sections, the contents of textbooks from class 1 to 5 should be read up to
secondary or class X level. Questions will be given for 24 marks from content
in mathematics and 6 marks from methodology. In Environmental Studies,
questions will be given for 24 marks from content and 6 marks from methodology.
పేపర్-1 పరీక్ష యొక్క స్వరూపము:
1.
Child Development and Pedagogy |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
2. Language – I (Telugu or other Language) |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
3. Language II (English) |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
4. Mathematics |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
5. Environmental Studies |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
చైల్డ్
డెవలప్మెంట్ అండ్ పెడగాగీ సబ్జక్టులో ప్రాధమిక స్థాయిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ కు
సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. అభ్యర్ధి తన పదవ తరగతి వరకూ చదివిన మీడియం లేదా
తన ఫస్ట్ లాంగ్వేజిని అనుసరించి లాంగ్వేజ్ – 1 గా తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ,
కన్నడ, మరాఠీ, తమిళం మరియు గుజరాతీలలో ఏదో ఎంచుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్-2 గా
ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్-1 మరియు లాంగ్వేజ్-2 లకు సంబంధించి ఆయా భాషలలో
అభ్యర్ధికి ఉండే పరిజ్ఞానమును పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వబడతాయి. మొత్తం ప్రశ్నలలో
24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి ఇవ్వబడతాయి.
గణితము మరియు ఎన్విరాన్మెంటల్
స్టడీస్ విభాగాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలలోని అంశాలను
సెకండరీ లేదా పదవ తరగతి స్థాయి వరకూ చదవాల్సి ఉంటుంది. గణితంలో కంటెంట్ నుంచి 24
మార్కులకు, మెథడాలజీ నుంచి 6 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. అలాగే
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నందు కంటెంట్ నుంచి 24 మార్కులకు, మెథడాలజీ నుంచి 6
మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి.
Format of Paper-II examination:
1. Child Development
and Pedagogy |
30 questions for 30
marks |
2. Language – I (Telugu
or other Language) |
30 questions for 30
marks |
3. Language II
(English) |
30 questions for 30
marks |
4. Mathematics/Science
teachers are required to answer questions from mathematics, physical sciences
and biology departments. Social Studies teachers
are required to answer questions from the social studies subject. |
60 questions will be
given for 60 marks. |
Questions related to
educational psychology will be given at the primary level in child development
and pedagagi subject. The language – 1 is Telugu, Urdu, Hindi, Bengali,
according to the medium or his first language read up to his/her class X. One has to choose between Kannada, Marathi,
Tamil and Sanskrit. Language Pandit candidates will have to select the main
language as Language-1 in their Pandit training course. Language-2 will be
English. Questions will be given to test the candidate's knowledge in the
respective languages in relation to Language-1 and Language-2. Out of the total
questions, 24 questions will be asked.
From the content, 6 questions will be given from the methodology.
Candidates who wish to write School Assistant
Mathematics, School Assistant Physical Science and School Assistant Biology in
DSc will have to select Mathematics/Science as optional subjects in Paper-II.
They will have to read topics that are relevant to the syllabus for classes 6
to 8 in Mathematics/Science up to senior secondary level (intermediate level).
24 questions from mathematics content, 06 questions from mathematics
methodology, 12 questions from physical science content, 12 questions from
biology content and 06 questions from science methodology.
Candidates who wish to write school assistant
social studies in DSC will have to study up to senior secondary level
(intermediate level) based on the syllabus of class 6 to 8 in social studies.
పేపర్-2 పరీక్ష యొక్క స్వరూపము:
1.
Child Development and Pedagogy |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
2. Language – I (Telugu or other Language) |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
3. Language II (English) |
30 మార్కులకు 30 ప్రశ్నలు |
4. గణితం/సైన్స్ ఉపాధ్యాయులు అయితే గణితము, ఫిజికల్ సైన్సెస్ మరియు బయాలజీ
విభాగాల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు అయితే సోషల్ స్టడీస్ సబ్జక్టు నుంచి ప్రశ్నలకు
సమాధానాలు రాయాల్సి ఉంటుంది. |
60 మార్కులకు 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి. |
చైల్డ్
డెవలప్మెంట్ అండ్ పెడగాగీ సబ్జక్టులో ప్రాధమిక స్థాయిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ కు
సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. అభ్యర్ధి తన పదవ తరగతి వరకూ చదివిన మీడియం లేదా తన
ఫస్ట్ లాంగ్వేజిని అనుసరించి లాంగ్వేజ్ – 1 గా తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ,
కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతంలలో ఏదో ఎంచుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్
పండిట్ అభ్యర్ధులు తమ పండిట్ ట్రైనింగ్ కోర్సులో మెయిన్ లాంగ్వేజ్ నే లాంగ్వేజ్-1
గా ఎంచుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్-2 గా ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్-1 మరియు
లాంగ్వేజ్-2 లకు సంబంధించి ఆయా భాషలలో అభ్యర్ధికి ఉండే పరిజ్ఞానమును పరీక్షించేలా
ప్రశ్నలు ఇవ్వబడతాయి. మొత్తం ప్రశ్నలలో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 6 ప్రశ్నలు
మెథడాలజీ నుంచి ఇవ్వబడతాయి.
డియస్సీలో స్కూల్ అసిస్టెంట్
గణితము, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మరియు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ
రాయాలనుకుంటున్న అభ్యర్ధులు పేపర్-2 లో ఆప్షనల్ సబ్జక్టులుగా గణితం/సైన్స్
ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరు గణితం/సైన్స్ లో 6 నుంచి 8వ తరగతి వరకూ గల సిలబస్ కు
రిలవెంట్ గా ఉండే టాపిక్స్ ను సీనియర్ సెకండరీ లెవల్ (ఇంటర్మీడియట్ స్థాయి) వరకూ
చదవాల్సి ఉంటుంది. గణితం కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, గణితం మెథడాలజీ 06 ప్రశ్నలు,
ఫిజికల్ సైన్స్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, బయాలజీ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు,
సైన్స్ మెథడాలజీ నుంచి 06 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
డియస్సీలో స్కూల్ అసిస్టెంట్
సోషల్ స్టడీస్ రాయాలనుకుంటున్న అభ్యర్ధులు సోషల్ స్టడీస్ లో 6వ తరగతి నుంచి 8వ
తరగతి వరకూ గల సిలబస్ ఆధారంగా సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియట్ స్థాయి) వరకూ
చదవాల్సి ఉంటుంది.
Telangana TET Syllabus in Telugu
NavaChaitanya
Competitions is translating the Telangana TET Paper-1 and Paper-II syllabus
into Telugu keeping in mind the rural candidates. You can get the telangana TET syllabus
details as well as the details of the online exams offered by NavaChaitanya Competitions
by sending a WhatsApp message to 9640717460 telangana tet.
గ్రామీణ
ప్రాంత అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ టెట్ పేపర్-1 మరియు పేపర్-2 సిలబస్
ను నవచైతన్య కాంపిటీషన్స్ తెలుగులోకి అనువదించి అందిస్తోంది. TELANGANA TET అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపడం
ద్వారా తెలంగాణ టెట్ సిలబస్ వివరాలతో పాటు నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఆన్
లైన్ పరీక్షల వివరాలను పొందవచ్చు.
The medium of the question paper is:
Telangana
TET - 2022 notification will be
conducted entirely offline. The question paper will be available
bilingually in English medium along with the language selected by the
candidate. I.e. Telugu medium candidates can write the exam from the question
paper in both Telugu and English languages.
తెలంగాణ
టెట్ – 2022 నోటిఫికేషన్ అనుసరించి తెలంగాణ టెట్ పరీక్ష పూర్తిగా ఆఫ్ లైన్ లో
నిర్వహించడం జరుగుతుంది. ప్రశ్నాపత్రము అభ్యర్ధి ఎంచుకున్న భాషతో పాటు, ఇంగ్లీష్
మాధ్యమంలో బైలింగ్వల్ గా లభ్యం అవుతుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్ధులు తెలుగు
మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో ఉన్న ప్రశ్నాపత్రము నుంచి పరీక్షను రాయవచ్చు.
Telangana TET - 2022 Hall Tickets:
Candidates
who have applied for TET-2022 as per the Telangana TET - 2022
notification will get their hall tickets from 06.06.2022. Candidates who have not downloaded the hall
ticket online can contact the Director, SCERT, Telangana directly on working
days for copy of the duplicate hall ticket with their journal number, reference
number, photograph and other details.
తెలంగాణ
టెట్ – 2022 నోటిఫికేషన్ అనుసరించి టెట్-2022 కు అప్లై చేసిన అభ్యర్ధులు తమ హాల్
టికెట్లను ది. ది. 06.06.2022 నుంచి టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆన్ లైన్ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ కాని అభ్యర్ధులు తమ జర్నల్ నెంబరు,
రిఫరెన్స్ నెంబరు, ఫోటోగ్రాఫ్ మరియు ఇతర వివరాలతో డూప్లికేట్ హాల్ టికెట్ కాపీ
కోసం డైరెక్టర్, SCERT, తెలంగాణ వారిని నేరుగా పనిదినాలలో
సంప్రదించవచ్చును.
Qualifying marks in TET exam:
The qualifying mark in Telangana TET - 2022
has been decided based on the community of the candidate. Only the candidates who have secured the
following minimum marks will be confirmed to have qualified in Telangana TET
and will be declared eligible to write DSC or TRT.
OC or General
Candidates |
Minimum 60% (90 marks)
or above marks are required. |
BC Candidates |
Minimum 50% (75 marks)
or above marks are required to be obtained. |
SC/ST Candidates |
Minimum 40% (60 marks)
or above marks are required to be scored. |
Differently Abled
Persons (PH) |
Minimum 40% (60 marks)
or above marks are required to be scored. |
అభ్యర్ధి
యొక్క కమ్యూనిటీ ఆధారంగా తెలంగాణ టెట్ – 2022 లో క్వాలిఫైయింగ్ మార్క్ నిర్ణయించడం
జరిగింది. క్రింద తెలిపిన కనీస మార్కులు
సాధించిన అభ్యర్ధులు మాత్రమే తెలంగాణ టెట్ లో క్వాలిఫై అయినట్లుగా నిర్ధారించి,
డియస్సీ లేదా టిఆర్టీ రాయడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది.
OC లేదా జనరల్ అభ్యర్ధులు |
కనీసం 60% (90 మార్కులు) లేదా
ఆపైన మార్కులు సాధించాల్సి ఉంటుంది. |
BC అభ్యర్ధులు |
కనీసం 50% (75 మార్కులు) లేదా ఆపైన మార్కులు సాధించాల్సి ఉంటుంది. |
SC/ST అభ్యర్ధులు |
కనీసం 40% (60 మార్కులు) లేదా ఆపైన మార్కులు సాధించాల్సి ఉంటుంది. |
దివ్యాంగులు (PH) |
కనీసం 40% (60 మార్కులు) లేదా ఆపైన మార్కులు సాధించాల్సి ఉంటుంది. |
TET validity:
Earlier, the candidates who qualified in
Telangana TET - 2022 had a validity of 7 years. However, this time the TET validity has been changed to lifetime
following the new norms of Ncte. Since there is a possibility of loss due to
weightage in DSC, you will definitely have to write tet to work hard and score
well this time too.
తెలంగాణ
టెట్ – 2022 లో క్వాలిఫై అయిన అభ్యర్ధులకు గతంలో 7 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండేది.
అయితే NCTE నూతన నిబంధనలను అనుసరించి ఈ సారి టెట్ వాలిడిటీని లైఫ్ టైమ్ గా మార్చడం జరిగింది. గతంలో క్వాలిఫై అయినా
మంచి స్కోరు లేకపోతే, డియస్సీలో వెయిటేజ్ వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక
తప్పకుండా ఈసారి కూడా కష్టపడి మంచి స్కోరు సాధించేలా టెట్ రాయాల్సి ఉంటుంది.
Weightage for TET marks in Teachers Recruitment Test:
Telangana TET - 2022 is not just a qualifying
test but 20% weightage will be given in teachers recruitment test (TRT or DSC) based
on the marks obtained by the candidates in this exam. The teacher selection
list will be prepared on merit basis along with the marks obtained by the
candidates for 80% marks in TRT or DSC along with 20% marks given as weightage
in TET.
So candidates need to continue their
preparation towards achieving the highest possible score without taking the TET
exam as smoothly. It is not possible to score in tet exam unless they read line-to-line
textbooks. Nava Chaitanya Competitions online exams with quality bits along
with a good schedule to support this type of preparation. Send a WhatsApp
message to 9640717460 called TELANGANA TET to know the full details.
తెలంగాణ
టెట్ – 2022 అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాకుండా ఈ పరీక్షలో అభ్యర్ధులు
సాధించిన మార్కుల ఆధారంగా టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT or
DSC) లో 20% వెయిటేజి ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్ధులు TRT or
DSC లోని 80% మార్కులకై సాధించే మార్కులతో పాటు టెట్ లో వెయిటేజిగా
ఇవ్వబడిన 20% మార్కులను కలిపి టీచర్ సెలక్షన్ లిస్ట్ ను మెరిట్ ప్రాతిపదికన తయారు
చేయడం జరుగుతుంది.
కనుక అభ్యర్ధులు టెట్
పరీక్షను ఆషామాషీగా తీసుకోకుండా వీలైనంత ఎక్కువ స్కోరు సాధించే దిశగా అభ్యర్ధులు
తమ ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. లైన్ టూ లైన్ పాఠ్యపుస్తకాలను చదివితే తప్ప
టెట్ పరీక్షలో స్కోర్ సాధన సాధ్యం కాదు. ఈ తరహా ప్రిపరేషన్ కు సహకరించేలా చక్కని
షెడ్యూల్ తో పాటు, క్వాలిటీ బిట్స్ తో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలను
అందిస్తోంది. పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం TELANGANA TET అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.
Telangana TET - 2022 Important Dates:
Notification Release
Date |
24.03.2022 |
Dates to pay the fee |
26.03.2022 - 11.04.2022 |
Dates to submit
application |
26.03.2022 - 12.04.2022 |
Dates on which the
information bulletin, detailed notification is available |
25.03.2022 onwards |
Date of availability of
hall tickets |
06.06.2022 |
Exam Dates: Paper-1 Paper-2 |
12.06.2022 The. 9.30 am to 12.00
Noon The. 2.30 pm to 05.00
pm |
Result Release Date |
27.06.2022 |
Telangana T
నోటిఫికేషన్
విడుదల తేదీ |
ది. 24.03.2022 |
ఫీజు చెల్లించడానికి తేదీలు |
ది. 26.03.2022 నుంచి ది. 11.04.2022 |
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి తేదీలు |
ది. 26.03.2022 నుంచి ది. 12.06.2022 |
ఇన్షర్మేషన్ బులెటిన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అందుబాటులో ఉండే తేదీలు |
ది. 25.03.2022 నుంచి |
హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చే తేదీ |
ది. 06.06.2022 |
పరీక్ష తేదీలు: పేపర్-1 పేపర్-2 |
ది.
12.06.2022 9.30 am to 12.00 Noon ది. 12.06.2022 2.30 pm to 05.00 pm |
రిజల్ట్ విడుదల తేదీ |
ది. 27.06.2022 |
ET Help Desk Numbers:
Telangana TET Help Desk Numbers:
Helpline Telephone – 040-23120340, 040-23120433
Domain-Associated HelpDesk – 8121010310, 8121010410
Nava Chaitanya Competitions – 9640717460 (WhatsApp only. Don't call)
తెలంగాణ టెట్ హెల్ప్ డెస్క్ నెంబర్లు:
హెల్ప్ లైన్ టెలిఫోన్ – 040-23120340, 040-23120433
డొమైన్ రిలేటెడ్ హెల్ప్ డెస్క్ – 8121010310, 8121010410
నవచైతన్య కాంపిటీషన్స్ – 9640717460 (వాట్సాప్ మాత్రమే. ఫోన్ చేయవద్దు)