చాలా సైట్ లు వెతికి ఉంటారు కదా . . . వదిలేయండి - ఈ వెబ్ సైట్ చూడండి. మీకు కావాల్సిన సిలబస్ తెలుగు అనువాదం పిడిఎఫ్ లో అందుబాటులో ఉంటుంది.
Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper-2 (Mathematics/Science)
తెలంగాణ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయినది.
తెలంగాణ టెట్ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు అంతా ఇప్పుడు సిలబస్ ను
తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్ధులు
తాము తెలుగు మీడియంలో చదవడం మూలంగా తెలంగాణ టెట్ – 2022 పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్)
సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవడం కోసం వెతుకుతూ ఉంటారు.
Telangana TET - 2022 notification has
been released. All the candidates preparing for telangana TET exam are now
trying to know the syllabus. Candidates, especially from rural areas, are
looking for the Telangana TET - 2022 Paper-2 Maths
and Science
syllabus to be downloaded in the form of PDF in Telugu as they are studying in
Telugu medium.
Most of such candidates are trying to
ask Google Talli. Through Google search, they will start searching by typing
Telangana TET Syllabus in Telugu, TS TET Syllables paper 2 Maths and Science in
telugu medium or TS TET syllables in telugu. But the first . . . ten . . .
fifteen... twenty websites they won’t find Genuine TS TET Syllabus in Telugu.
Some websites have ts tet syllabus 2022 (PDF) as main title but write something
which is not relevant to it. Some websites have ts tet syllabus 2022 and the
put the syllabus which is released by the Educational Department. Others put
the title as ts tet syllabus in telugu.. by using google translactar, the
syllabus is translated and given there. It won’t match with textbook even one
line.
ఈ సమస్యలేవీ లేకుండా నవచైతన్య
కాంపిటీషన్స్ నిష్ణాతులైన ఫ్యాకల్టీ టీమ్ తో కలిసి తెలంగాణ టెట్ 2022 పేపర్-2
(మ్యాథ్స్/సైన్స్) సిలబస్ ను తెలుగులోకి అనువదించి పిడిఎఫ్ రూపంలో అందిస్తోంది. మన
ఈ సిలబస్ లో టైటిల్స్ అన్నీ మీ పాఠ్యపుస్తకాలలో మీరు గమనించేవే . . .
గుర్తుపట్టేవే. జెన్యూన్ గా తెలంగాణ టెట్ సిలబస్ ను ట్రాన్సిలేట్ చేసి మీకు
అందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ గురించి మీ మిత్రులకు కూడా తెలియచేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
Without any of these problems, Nava Chaitanya Competitions
along with an accomplished faculty team is translating the Telangana TET 2022
Paper-2 (Maths / Scince) syllabus into Telugu and providing it in pdf form. All
the titles in this syllabus of ours are what you observe in your textbooks . .
. Recognizable. We sincerely hope that you will also inform your friends about
the Nava Chaitanya competitions offered to you by transilating the Telangana
TET syllabus as a genuine.
తెలంగాణ
టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) గురించిన ప్రాధమిక విశేషాలు:
టీచర్స్
ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అనేది B.Ed లేదా
D.Ed పూర్తి చేసిన ప్రతి అభ్యర్ధి DSC/TRT పరీక్షను రాయడానికంటే ముందు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన పరీక్ష.
తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం రెండుసార్లు
టెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సహజంగా DSC / TRT
నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించడం
పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే 24.03.2022 న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ను
తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. రెండు
పేపర్లుగా నిర్వహించే ఈ తెలంగాణ టెట్ పరీక్షలో 6 నుంచి 8వ తరగతి వరకూ బోధించాలని భావిస్తూ,
B.Ed పూర్తి చేసిన అభ్యర్ధులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
డిగ్రీ స్థాయిలో గణితము, సైన్స్ సబ్జక్టులగా కలిగిన అభ్యర్ధులు తెలంగాణ టెట్
పేపర్-2 లో ఆప్షనల్ సబ్జక్టులుగా గణితము, సైన్స్ లను ఎంచుకుని టెట్ రాయాల్సి
ఉంటుంది.
The basics of Telangana TET Paper-I are:
Teachers'
Eability Test (TET) is a test that every candidate who has completed B.Ed or
D.Ed must qualify before writing the DSC/TRT exam. Telangana Government –
Educational Department they have to conduct TET exam twice every year. But
naturally before going to conduct DSC/TRT Telangana TET exam before issuing the
notification. In this context, the Telangana TET notification was released by
the Telangana Government - Educational Department on 24.03.2022 . Candidates
who have completed B.Ed. hoping to teach from 6th
to 8th standard will have to write Paper-II in
this Telangana TET exam which will be conducted in two papers. Candidates with
mathematics and science subjects at degree level will have to select
Mathematics and Science as optional subjects in Telangana TET Paper-II and
write TET.
తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) పరీక్షను రాయడానికి ఎవరు అర్హులు?
ఎవరైతే B.Ed పూర్తి
చేసి, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయ
వృత్తిని చేపట్టాలని భావిస్తారో, వారు తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్)
రాయడానికి అర్హులు. B.Ed చివరి సంవత్సరం చదువుతూ ఉన్న
అభ్యర్ధులు కూడా తెలంగాణ టెట్ రాయడానికి అర్హులే అని తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో
పేర్కొనడం జరిగింది.
Who is eligible to write Telangana TET Paper-I exam?
Those who completed their B.Ed and take
up the teaching profession of classes 6 to 8
in Upper primary, high schools are eligible to write
Telangana TET Paper-II. The Telangana TET notification stated that candidates
who are studying B.Ed in the last year are also eligible to write telangana TET.
తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది?
తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్)
పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 150
మార్కులకు గానూ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు అభ్యర్ధులు రెండున్నర గంటలలో
సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. కానీ ఈ తెలంగాణ టెట్ పేపర్-2
(మ్యాథ్స్/సైన్స్) లో అభ్యర్ధి సాధించిన మార్కుల ఆధారంగా DSC/TRT పరీక్షలో వెయిటేజి ఇవ్వబడుతుంది. కనుక అభ్యర్ధులు తెలంగాణ టెట్ ను
సీరియస్ గా తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు.
పరీక్ష
స్వరూపాన్ని గమనించినపుడు తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) పరీక్ష మొత్తంగా
ఐదు సెక్షన్లుగా విభజించబడి ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్
ప్రశ్నలతో 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్ గా అభ్యర్ధులు సాధించిన
మార్కుల ఆధారంగా క్వాలిఫికేషన్ నిర్ణయించడం జరుగుతుంది.
1. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ
2. మొదటి లాంగ్వేజ్ (తెలుగు లేదా ఇతర
భాషలు)
3. రెండవ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
4. గణితము కంటెంట్ మరియు మెథడాలజీ
5. సైన్స్ (ఫిజికల్ సైన్సెస్, బయాలజీ)
కంటెంట్ మరియు మెథడాలజీ
What will be the nature of Telangana TET Paper-I exam?
The Telangana TET Paper-II (Mathematics
and Science) exam will be conducted with purely objective questions.
Candidates will have to identify answers to 150 multiple choice questions of
150 marks in two-and-a-half hours. There is no negative marking. But weightage
will be given in DSC/TRT exam based on the marks obtained by the candidate in
this Telangana TET Paper-2. So, the candidates take Telangana TET seriously and
prepare.
The
Telangana TET Paper-I examination is divided into five sections. 30 marks will
be allotted with 30 multiple choice questions from each section and the
qualification will be decided on the basis of marks obtained by the candidates
overall.
1. Child Development and Pedgagee
2. First language (Telugu or other
languages)
3. Second Language (English)
4. Mathematics Content and Methodology
5. Science (Physical
Science, Biology) Content and Methodology
తెలంగాణ టెట్ – పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో
తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్)
సిలబస్ ను పాఠ్యపుస్తకాలలోని టైటిల్స్ ఆధారంగా చేసుకుని దాదాపుగా పాఠ్యపుస్తకాలతో
ఏకీభవించేలా సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందించడం జరుగుతున్నది. క్రింది లింక్
పై క్లిక్ చేసి నేరుగా తెలంగాణ టెట్ పేపర్-2 (మ్యాథ్స్/సైన్స్) సిలబస్ ను తెలుగులో
పిడిఎఫ్ రూపంలో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇవి
కూడా చూడండి
1.
తెలంగాణ
టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో
2.
తెలంగాణ టెట్ పేపర్-2 (గణితము/సైన్స్) సిలబస్ తెలుగులో
Telangana TET - Paper-2 (Maths/Science) Syllabus in the form of PDF in Telugu
The Telangana TET Paper-2
(Maths/Science) syllabus is being translated into Telugu and provided to almost
agree with the textbooks based on the titles in the textbooks. You can download
the Telangana TET Paper-2 (Maths/Science) syllabus directly in the form of PDF
in Telugu by clicking on the link below.
తెలంగాణ టెట్ – చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ సిలబస్ తెలుగులో (Telangana TET Child Development and Pedagogy Syllabus in Telugu)
1.
DEVELOPMENT OF CHILD
-
Development, Growth & Maturation - Concept & Nature
-
Principles of Development & their educational implications
-
Factors influencing Development - Biological, Psychological,
Sociological
-
Dimensions of Development and their interrelationships - Physical &
Motor, Cognitive, Emotional, Social, Moral, Language relating to Infancy, early
Childhood, late Child hood, Adolescence.
-
Understanding Development - Piaget, Kohlberg, Chomsky, Carl Rogers and
Erikson
-
Individual differences - Intra & Inter Individual differences in the
areas of Attitudes, Aptitude, Interest, Habits, Thinking (Divergent &
Convergent), Intelligence and their Assessment
-
Development of Personality - Concept, Factors effecting development of
Personality, Child Rearing
Practices, Self-Concept
-
Adjustment, Behavioural problems, Défense Mechanisms, Mental Health
-
Methods and Approaches of Child Development – Introspection,
Observation, Interview, Case study,
Experimental,
Rating Scales, Anecdotal Records, Questionnaire, Cross sectional and
Longitudinal
-
Developmental tasks and Hazards
1. పెరుగుదల
వికాసం
- పెరుగుదల, వికాసము,
పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము
- వికాస
నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము
- వికాసాన్ని
ప్రభావితం చేసే అంశాలు
- వికాసంలోని
అంశాలు – భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక
వికాసం, భాషా వికాసం
- వివిధ
దశలలో వికాసం – శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ, వయోజన దశ
- శిశు వికాస
అవగాహన – పియాజీ,
కోల్బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్
రోజర్స్, ఎరిక్ సన్ – సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక వికాస
సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం, ఆత్మభావనా సిద్ధాంతం, మనో సాంఘిక వికాస
సిద్ధాంతం
- వైయుక్తిక
భేదాలు – ప్రజ్ఞ,
సహజ సామర్ధ్యాలు సృజనాత్మకత, అభిరుచులు,
వైఖరులు, అలవాట్లు, ఆలోచన
- మూర్తిమత్వ
వికాసం – భావన,
లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్దాంతాల, మనోలైంగిక
వికాస సిద్ధాంతం
- సర్ధుబాటు, ప్రవర్తనా
సమస్యలు, మానసిక ఆరోగ్యం, రక్షక
తంత్రాలు
- శిశు వికాస
అధ్యయన పద్ధతులు
-
వికాసృత్యాలు – ఆటంకాలు
2.
UNDERSTANDING LEARNING
-
Concept, Nature of Learning - Input - Process - Outcome
-
Factors of Learning - Personal and Environmental
-
Approaches to Learning and their applicability - Behaviorism (Skinner,
Pavlov, Thorndike), Constructivism (Piaget, Vygotsky),
Gestalt (Kohler, Koffka) and Observational (Bandura)
-
Dimensions of Learning - Cognitive, Affective and Performance
-
Motivation and Sustenance -its role in learning.
-
Memory & Forgetting
-
Transfer of Learning
2. అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం
- అభ్యసనం – భావన – స్వభావం – లక్షనాలు – రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే
కారకాలు
- అభ్యసనా సిద్ధాంతాలు – ప్రవర్తనా వాదం, నిర్మాణాత్మక వాదం, గెస్టాల్ట్ వాదం
మరియు పరిశీలనా వాదం – ధార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం, పావలోవ్ శాస్త్రీయ నిబంధనా
సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనా సిద్ధాంతం, వైగోట్ స్కీ నిర్మాణాత్మక
సిద్ధాంతం, కోహెలర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, బందూరా పరిశీలనా సిద్దాంతం
- అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*
- అభ్యసనములో ప్రేరణ పాత్ర
- స్మృతి – విస్మృతి
- అభ్యసనా బదలాయింపు, అభ్యసనా బదలాయింపు సిద్దాంతాలు, అభ్యసనా వక్రాలు
3.
PEDAGOGICAL CONCERNS
-
Teaching and its relationship with learning and learner
-
Learners in Contexts: Situating learner in the socio-political and
cultural context
-
Children from diverse contexts - Children With Special Needs (CWSN),
Inclusive Education
-
Understanding of Pedagogic methods - Enquiry based learning, Project
based learning, Survey, Observation and Activity based learning, Co-operative
& Collaborative learning
-
Individual and Group learning: Issues and concerns with respect to
organizing learning in class room like Study habits, Self learning and Learning
to learn skills
-
Organizing learning in heterogeneous class room groups - Socio-economic
background, Abilities and Interest
-
Paradigms of organizing Learning - Teacher centric, Subject centric and
Learner centric
-
Theory of Instruction - Bruner
-
Teaching as Planned activity - Elements of Planning
-
Phases of Teaching - Pre active, Interactive and Post active
-
General and Subject related skills, competencies required in teaching
and attributes of good facilitator
-
Learning resources - Self, Home, School, Play, Community, Technology
-
Class room Management: Role of student, teacher, Leadership style of
teacher, Creation of non-threatening learning environment, Managing behavior
problems, Guidance & Counseling, Child Abuse, Punishment and its legal
implications, Rights of a child, Time Management.
-
Distinction between Assessment for Learning & Assessment of
Learning, School based Assessment, Continuous & Comprehensive Evaluation :
Perspective & Practice
-
Understanding teaching & learning in the context of NCF, 2005 & Right To Education Act, 2009.
3. బోధనా శాస్త్ర అవగాహన
- బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక,
రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం
- విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత
విద్య, విలీన విద్య
- బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన
- వైయుక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనము
- తరగతి గది సమూహము – నాయకత్వం
- వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు,
- బోధనా ప్రణాళ, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన
- బోధనలోని దశలు – హెర్బార్ట్ సోపానాలు
- సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు
- తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం – మంత్రణం
- అభ్యసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం
- విద్యా హక్కు చట్టం – 2009, బాలల హక్కులు
- జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005
తెలంగాణ టెట్ – లాంగ్వేజ్ - 1 తెలుగు సిలబస్ (Telangana TET – First Language Telugu Syllabus)
1. పఠనావగాహన
ఎ. అపరిచిత పద్యం
బి. అపరిచిత గద్యం
2. తెలంగాణ సాహిత్యం,
సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) – 2015 లో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఆధారంగా
ఎ. తెలంగాణ కవులు, రచయితలు, నూతన
పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు
బి) ప్రక్రియలు
సి) శతకాలు
డి) కళలు, కళాకారులు
ఇ) వేడుకలు
ఎఫ్) క్రీడలు/పాటలు
3. పదజాలం
ఎ) సామెతలు
బి) జాతీయాలు
సి) పొడుపు కథలు
డి) తెలంగాణ పదజాలం
ఇ) అర్ధాలు
ఎఫ్) నానార్ధాలు
జి) పర్యాయ పదాలు
హెచ్) వ్యుత్పత్యర్ధాలు
ఐ) ప్రకృతి వికృతులు
4. భాషాంశాలు
ఎ. భాషాభాగాలు, క్రియలు (సమాపక, అసమాపక
క్రియలు)
బి. కాలాలు, విభక్తులు
సి. లింగాలు
డి. విరామ చిహ్నాలు
ఇ. వచనాలు
ఎఫ్. పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, దృత ప్రకృతికములు)
జి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)
హెచ్. సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను
గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాన పదాలుగా కూర్చడం)
ఐ. ఛందస్సు – గురు, లఘువులను గుర్తించడం
జె. అలంకారాలు –
కె. వాక్యాలు – రకాలు - ఆశ్చర్యార్ధక,
విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్ధక, అనుమత్యర్ధక, నిషేధార్ధక వాక్యాలు –
ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మణి వాక్యాలు – సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం
ఎల్) అర్థవిపరిణామం
తెలంగాణ టెట్ – తెలుగు మెథడాలజీ సిలబస్ (Telangana TET Telugu methodology Syllabus)
ఎ. భాష – మాతృభాష –
మాతృభాషా బోధనా లక్ష్యాలు
బి. భాష – వివిధ
భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం
సి. భాషా నైపుణ్యాలు –
సాధించాల్సిన సామర్ధ్యాలు, తరగతి గది అన్వయం
డి. బోధనా పద్ధతులు
ఇ. ప్రణాళికా రచన –
వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
ఎఫ్.. బోధనాభ్యసన
ఉపకరణాలు
జి. మూల్యాంకనం –
నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)
గమనిక: అభ్యర్ధులు తాము చదివిన మాధ్యమాన్ని బట్టి, పదవ తరగతి స్థాయిలో తాము
ఎంచుకున్న ఆప్షనల్ లాంగ్వేజ్ ను బట్టి తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ,
కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతంలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఇవ్వబడుతుంది.
ఆయా లాంగ్వేజ్ లకు సంబంధించిన సిలబస్ ను నేరుగా అధికారిక వెబ్ సైట్ http://tstet.cgg.gov.in నుంచి
డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోగలరు.
తెలంగాణ టెట్ – లాంగ్వేజ్-2 – ఇంగ్లీష్ సిలబస్ (TS TET Second Language English Syllabus)
1.
Parts of Speech
2.
Tenses
3.
Types of Sentences
4.
Prepositions
5.
Articles
6.
Degrees of Comparison
7.
Direct and Indirect Speech
8.
Questions and question tags
9.
Active & Passive Voice
10.
Use of Phrases
11.
Comprehension
12.
Composition
13.
Vocabulary (Synonyms, Antonyms, Spelling test)
14.
Meaning of Idiomatic expressions
15.
Correction of sentences
16.
Sequencing of the Sentences in the given paragraph
17.
Error identification within a sentence
తెలంగాణ టెట్ – ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ (TS TET English Methodology Syllabus)
1.
Aspects of English:- (a) English language - History, nature, importance,
principles of English as second language (b) Problems of teaching / learning
English.
2.
Objectives of Teaching English
3.
Phonetics
4.
Development of Language skills:- a Listening, Speaking, Reading &
Writing (LSRW). b) Communicative skills
5.
Approaches, Methods and Techniques of teaching English (Introduction,
Definition, Types of approaches, methods and techniques of teaching including
remidial teaching)
6.
Teaching of structures, Vocabulary and Grammar
7.
Teaching Learning materials in English
8.
Lesson Planning
9.
Curriculum and Text books – Importance and need.
10.
Evaluation in English Language
తెలంగాణ టెట్ – గణితము కంటెంట్ డీటెయిల్డ్ సిలబస్ తెలుగులో (Telangana TET Mathematics Content Syllabus in Telugu)
1.
Number System - Prime and Composite Numbers, Tests of divisibility, whole
numbers, integers, fractions, decimal fractions, L.C.M. and G.C.M. rational
numbers and irrational numbers. Properties of numbers, Real numbers; laws of
exponents, squares, square roots, cubes, cube roots, finding missing number
represented as alphabets in sums involving array of four operations, number
patterns, number puzzles, Euclid division lemma, concept of logarithms.
1. సంఖ్యామానము: ప్రధాన మరియు సంయుక్త
సంఖ్యలు, భాజనీయతా సూత్రాలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు,
దశాంశ భిన్నాలు, క.సా.గు మరియు గ.సా.భా, కరణీయ మరియు అకరణీయ సంఖ్యలు,
సంఖ్యాధర్మాలు, వాస్తవ సంఖ్యలు, ఘాతాంక నియమాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు,
ఘనమూలాలు, చతుర్విధ ప్రక్రియలను అనుసరిస్తూ ఇవ్వబడిన సంఖ్యలో ఆంగ్ల అక్షరాలతో
సూచించబడిన, లోపించిన సంఖ్యలను గుర్తించుట, నంబర్ ప్యాట్రన్, నంబర్ పజిల్స్,
యూక్లిడ్ భాగహార విధి, సంవర్గమానాలు.
2.
Arithmetic - Ratio and proportion, simple interest, compound interest, Time and
distance, Discount, tax, time and work, profit and loss
2. అరిథ్ మెటిక్ – నిష్పత్తి మరియు అనుపాతం, బారువడ్డీ, చక్రవడ్డీ, కాలము
మరియు దూరము, డిస్కౌంట్, పన్నులు, కాలము మరియు పని, లాభనష్టాలు
3. Sets
- Concept of set, set language, empty set, finite and infinite sets, subset and
equality of the set, Cartesian product of sets, cardinal number of set, set
operations, representation of sets, Venn diagrams and their properties,
3. సమితులు – సమితులు భావన, సమితుల పదజాలం, శూన్య సమితి, పరిమిత మరియు
అపరిమిత సమితులు, ఉప సమితి మరియు సమితుల సమానత్వం, సమితుల యొక్క కార్టీసియన్
లబ్ధము, కార్డినల్ సంఖ్యలు, సమితులలో ప్రక్రియలు, సమితులను వెన్ చిత్రాలలో చూపుట
మరియు వాటి అనువర్తనాలు, ధర్మాలు
4.
Algebra -Introduction to Algebra, expressions, exponents and powers,
Factorization special products and expansions, linear equations and their
graphs, polynomials, Quadratic equations and its applications, concept of
progressions, progressions (AP and GP).nth term and sum to n terms of the first
n terms in AP, nth term of GP
4. బీజగణితము – పరిచయం, సమాసం, గుణకాలు మరియు సమితి పరిమాణము, రేఖీయ
సమీకరణాలు మరియు గ్రాఫ్ లు, బహుపదులు, వర్గ సమీకరణాలు మరియు వాటి ధర్మాలు,
శ్రేఢులు, అంక శ్రేడి మరియు గుణశ్రేడి, nవ పదము, nపదాల మొత్తమును అంక శ్రేఢిలో మరియు గుణశ్రేఢిలో గణించుట.
5.
Geometry - History of Geometry, Contribution of India in the Development of
Geometry, Euclid Geometry, Lines and Angles, Similar Triangles, Pythagoras
theorem, congruency of triangles, Properties of Circles, Triangles,
Quadrilaterals and polygons, Parts of Circle : Construction of Circle,
Triangles and Quadrilaterals, Circles and concurrent lines in triangles,
Co-ordinate Geometry, Co-ordinates of a point, plotting of points, linking
linear equations into variables (of the type ax+by+c=0) in the Cartisian coordination
system), Linear equations with 2 variables, slope of a line, distance between
two points in a plane, section formula, Area of a triangle, collinearity of
points in a co-ordinate plane, centroid of a triangle, symmetry,
5. రేఖాగణితము – రేఖాగణితం యొక్క చరిత్ర, రేఖాగణిత పరిణామంలో భారతీయ
గణితవేత్తల కృషి, యూక్లిడ్ రేఖాగణితం, రేఖలు మరియు కోణాలు, సరూప త్రిభుజాలు,
పైథాగరస్ సిద్ధాంతం, త్రిభుజాల సర్వసమానత్వం, వృత్తాల యొక్క ధర్మాలు, త్రిభుజాలు,
చతుర్భుజాలు మరియు బహుభుజులు, వృత్తంలోని భాగాలు, వృత్తమును, త్రిభుజమును మరియు
చతుర్భుజములను నిర్మించుట, త్రిభుజంలో అంతర, బాహ్య వృత్తాలు, నిరూపక జ్యామితి,
బిందువుకు యొక్క నిరూపకాలు, బిందువులను గుర్తించుట, నిరూపక వ్యవస్థలో చరరాశులతో
రేఖీయ సమీకరణాలను జతచేయుట, రెండు చరరాశులతో కూడిన రేఖీయ సమీకరణాలు, రేఖయొక్క వాలు,
సతలీయాలైన రెండు బిందువుల మధ్య దూరం, సెక్షన్ ఫార్ములా, త్రిభుజ వైశాల్యం,
కార్టీజియన్ వ్యవస్థ, కోఆర్డినేట్ ప్లేన్‌లోని బిందువుల సమరేఖీయత, త్రిభుజంలోని
మధ్యబిందువు, సౌష్టవం.
6.
Mensuration - Perimeter and Area of a Square and Rectangle. Area of Triangle,
Circle, Ring and Quadrilaterals. Surface area and volume of Cube, Cuboid,
Lateral / Surface area and volume of a cylinder, cone, sphere and hemisphere,
conversion of one solid to another shape, surface area and volume of combination
of solids.
6. క్షేత్రగణితం – చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క పరిధి మరియు
వైశాల్యం, త్రిభుజం యొక్క వైశాల్యం, కంకణము మరియు చతుర్భుజాలు, ఘనము, దీర్ఘఘనాల
యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణాలు, ప్రక్కతల, సంపూర్ణతల వైశాల్యాలు,
స్థూపం, శంఖువు, గోళము మరియు అర్ధగోళము, ఒక రూపం నుంచి ఘనాన్ని మరొక రూపానికి
మార్చుట, ఘనరూపాల యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణాలు.
7. Data
Handling - Collection and Classification of Data, Frequency distribution table,
Tally marks, Bar graph, Pictograph and Pie diagrams, mean, median and mode for
un-grouped and grouped data, cumulative frequency table and ogive curves,
concept of probability, simple problems (day to day life situation) on single
events, concept of complementary events.
7. దత్తాంశ నిర్వహణ – దత్తాంశ సేకరణ మరియు వర్గీకరణ, పౌనఃపున్య విభాజన
పట్టికలు, టాలీ చిహ్నాలు, బార్ గ్రాఫ్ లు, పట చిత్రాలు మరియు పై చిత్రాలు,
వర్గీకృత మరియు అవర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతము మరియు బాహుళకము, సంచిత
పౌనఃపున్య పట్టికలు మరియు ఓగైవ్ వక్రాలు, సంభావ్యత భావన, నిజజీవిత ఆధార సమస్యలు, ప్రాధమిక
ఘటనలు, పూరక ఘటనలు
8.
Trigonometry – Introduction of Trigonometry, Relationship between ratios,
values of trigonometric ratios, (0, 30, 45, 60 and 900)
Trigonometric identities, trigonometric ratios of complementary angles, applications
of trigonometry, Angle of elevation and depression, simple problems.
8. త్రికోణమితి – త్రికోణమితి పరిచయం, త్రికోణమితీ
నిష్పత్తులు మరియు వాటి మధ్య సంబంధం, 0, 30, 45, 60 మరియు 90 త్రికోణమితీయ
నిష్పత్తుల విలువలు, త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క అనువర్తనము, ఊర్ధ్వ మరియు
నిమ్న కోణములు, తేలికపాటి త్రికోణమితీయ సమస్యలు.
తెలంగాణ టెట్ – గణితము మెథడాలజీ సిలబస్ తెలుగులో (TS TET Maths Methodology Syllabus in Telugu)
1. Definition and Nature of Mathematics
2. Aims, values and instructional objectives
of teaching Mathematics
3. Methods of Teaching Mathematics
4. Instructional material in Mathematics - TLM
in Mathematics
5. Instructional Planning
6. Designing, Administration, Analysis of
scholastic Achievement test (SAT)
7. The Mathematics Teacher
8. Resource Utilization
9. Curriculum and Text Book
10. Diagnostic and Remedial Teaching
1. గణితము – భావన
మరియు స్వభావం
2. గణితము యొక్క
బోధనా గమ్యాలు, విలువలు, లక్ష్యాలు స్పష్టీకరణములు మరియు విద్యా ప్రమాణాలు
3. గణిత బోధనా
పద్ధతుల
4. గణితంలో బోధనా
వనరులు, బోధనాభ్యసనా పరికరాల
వినియోగం
5. ప్రణాళికాబద్ధమైన
కార్యంగా బోధన
6. సాధనా నికషను
తయారుచేయడం, నిర్వహించడం మరియు విశ్లేషించడం
7. గణిత ఉపాధ్యాయుడు
8. వనరుల వినియోగం
9. విద్యా ప్రణాళికా
మరియు పాఠ్యపుస్తకం
10. మూల్యాంకనము
మరియు రెమెడియల్ బోధన
తెలంగాణ టెట్ సైన్స్ కంటెంట్ సిలబస్ తెలుగులో (Telangana TET Science content Syllabus in Telugu)
1.
Natural Resources
– Air,
Water: Water pollution, Harnessing of water, States of water, Hardness of
water, water pressure
– Air
pollution, Atmospheric Pressure, Air pressure, Archimedes' principle, Pascal's
law, Bernoulli's Principle, Hydrometer, Barometer.
- Laws
of floatation, Specific gravity, Surface tension, Fluid Mechanics.
1. సహజ వనరులు –
గాలి, నీరు: నీటి కాలుష్యం, నీటియొక్క ఉపయోగాలు, నీరు లభించే స్థితులు,
నీటి యొక్క కాఠిన్యత, నీటి పీడనం, గాలి కాలుష్యం, వాతావరణ పీడనం, వాయు పీడనం,
ఆర్కిమెడిస్ నియమము, పాస్కల్ నియమము, బెర్నూలి సూత్రము, హైడ్రోమీటర్ మరియు బారో
మీటర్, ప్రవాహ నియమాలు, విశిష్ట గురుత్వం, తలతన్యత, ప్రవాహ గతిశాస్త్రం.
2. Our
Universe: Solar eclipse – lunar eclipse - Constellation - Zodiac, Space travel;
Solar system, Satellites, stars, comets; Earth.
2. మన విశ్వం, సౌరకుటుంబం – గ్రహణాలు, రాశులు, రాశి చక్రము, సౌరకుటుంబము –
గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, భూమి
3.
Natural Phenomenon:
Light:
How can we see objects – shadows – Reflection of light – laws of reflection –
plane mirrors and images – Virtual image, real image, pinhole camera,
periscope, kaleidoscope – spherical mirrors and images – Fermat’s Principal –
Applications of reflection of light – Refraction of light – laws of refraction –
refractive index, Snell’s law – total internal reflection and its applications
– refraction through glass prisms and slabs – refraction at curved surfaces and
through lenses – images formed by lenses and ray diagrams – construction of
human eye – least distinct vision – defects of vision-formation of rainbow, dispersion
of light.
Sound:
Sources of sound, Production and propagation of sound – construction of human
ear and its working – Properties of sound – auditable range - Sound Pollution,
Sound Waves, Kinds of Sound Waves, characteristics of sound waves – reflection
of sound – echo – uses of ultrasonic sounds - Musical instruments.
Heat:
Concept of heat and temperature – thermal equilibrium - Measurement of
Temperature – Types of Thermometers – specific heat and its applications in
daily life – methods of mixtures – evaporation – condensation – boiling point –
melting point.
3. సహజ దృగ్విషయాలు – కాంతి – మనం వస్తువులను ఎలా చూడగలం?, నీడలు, కాంతి
పరావర్తనం, పరావర్తన నియమాలు, సమతల దర్పణాలు మరియు ప్రతిబింబాలు, నిజ మరియు మిధ్యా
ప్రతిబింబాలు, పిన్ హోల్ కెమెరా, పెరిస్కోప్, కెలిడయాస్కోప్, గోళాకార దర్పణాలు
మరియు ప్రతిబింబాలు, ఫెర్మాట్ సూత్రం, కాంతి యొక్క అనువర్తనాలు, కాంతి వక్రీభవనము,
కాంతి వక్రీభవన నియమాలు, వక్రీభవన గుణకము, స్నెల్ నియమము, సంపూర్ణాంతర పరావర్తనము
మరియు అనువర్తనాలు, గాజు దిమ్మెలో, పట్టకములో కాంతివక్రీభవనము, వక్రతలాల వద్ద
కాంతి, కటకాల ద్వారా కాంతి వక్రీభవనము, కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలు – కిరణ
చిత్రాలు, మానవుని కన్ను నిర్మాణం, కనిష్ట దృష్టి దూరం, దృష్టి లోపాలు, ఇంద్రధనుసు
ఏర్పడటం, కాంతి విక్షేపణం
ధ్వని – ధ్వని ఉత్పత్తి చేసే
వస్తువులు, ధ్వని ఉత్పత్తి మరియు ప్రయాణం, మానవుని చెవి నిర్మాణము మరియు పనితీరు,
ధ్వని యొక్క ధర్మాలు, వినగల శబ్ధ తీవ్రతలు, ధ్వని కాలుష్యం, ధ్వని తరంగాలు,
తరంగాలలో రకాలు, ధ్వని యొక్క లక్షణాలు, ధ్వని పరావర్తనము, ప్రతిధ్వనులు, అతిధ్వనుల
యొక్క ఉపయోగాలు, సంగీత పరికరాలు
ఉష్ణము – ఉష్ణము మరియు ఉష్ణోగ్రత
భావనలు, ఉష్ణ సమతాస్థితి, ఉష్ణమును కొలుచుట – థర్మామీటర్లలో రకాలు, విశిష్టోష్ణము
మరియు దాని నిజజీవిత అనువర్తనాలు, మిశ్రమాల పద్ధతి, భాష్పీభవనము, సాంద్రీకరణము,
బాష్పీభవన స్థానం, మరుగుస్థానం
4.
Mechanics - Kinematics, Dynamics: Concept of motion and rest. - Types of
Motion; Speed, Velocity, Acceleration, Newton's Laws of Motion, force – types
of force – resultant force – Friction - types of friction – factors influencing
the friction – fluid friction – gravitation – Newton’s law of gravitation –
centre of gravity and stability. Work and energy – types of energy –
conservation of energy.
4. యాంత్రిక శాస్త్రం – గతిశాస్త్రం, స్థితిశాస్త్రం, చలనము మరియు నిశ్చల
స్థితి భావనలు, చలనంలో రకాలు, వడి, వేగము, త్వరణము, న్యూటన్ గమన నియమాలు, బలము,
బలాలలో రకాలు, ఫలిత బలము, ఘర్షణ, ఘర్షణలో రకాలు, ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు,
ప్రవాహి ఘర్షణ, గురుత్వాకర్షణ, న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రం, గరిమనాభి మరియు
స్థిరత్వం, పని మరియు శక్తి, శక్తి రూపాలు, శక్తి పరివర్తనం
5.
Magnetism and Electricity: Magnetism:
Natural Magnets and Artificial Magnets, properties of Magnets, uses magnets –
methods of magnetization - Magnetic Induction – magnetic field – Magnetic lines
of force.
Electricity:
Electric Circuit - Primary Cells – conductors and insulators – electric charge
– electric field – electric potential – potential difference – EMF – Ohm’s law
– resistance – specific resistance – resistances in series and parallel –
heating effects of electric current – electric power – magnetic effects of
electric current – solenoid – Fleming’s left hand rule – electric motor –
electromagnetic induction – electric generator – electrical conductivity of
liquids – electro plating – Faraday’s laws of electrolysis.
5. అయస్కాంతత్వం మరియు విద్యుత్ శక్తి – అయస్కాంతత్వం సహజ
అయస్కాంతాలు మరియు కృత్రిమ అయస్కాంతాలు, అయస్కాంత ధర్మాలు, అయస్కాంతాల ఉపయోగాలు,
అయస్కాంతీకరణ పద్ధతులు, అయస్కాంత ప్రేరణ, అయస్కాంత క్షేత్రము, అయస్కాంత బలరేఖలు
విద్యుత్ శక్తి – విద్యుత్ వలయం,
ప్రాధమిక ఘటము, విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు, విద్యుత్ ఆవేశము, విద్యుత్
క్షేత్రము, విద్యుత్ పొటెన్షియల్, పొటెన్షియల్ భేదము, EMF, ఓమ్ నియమము, నిరోధము,
విశిష్ట నిరోధము, నిరోధాలను శ్రేణిలో మరియు సమాంతరంగా సంధానించుట, విద్యుత్ యొక్క
ఉష్ణ ఫలితము, విద్యుత్ సామర్ధ్యం, విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితము, సాలినాయిడ్,
ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఎలక్ట్రిక్ మోటారు, విద్యుదయస్కాంత ప్రేరణ, జనరేటర్,
ద్రవాల విద్యుత్ వాహకత, ఎలక్ట్రోప్లేటింగ్, ఫారడే విద్వుద్విశ్లేషణ నియమాలు
6.
Matter around us: States of matter – properties of matter – substances and
mixtures – methods of separation of mixtures – fibers – types of fibers,
plastics – types of plastics – use of plastics and environment.
Acids,
bases and salts – neutralization - metals and non metals – physical and
chemical properties of metals and non-metals – Coal and petroleum – combustion
and fuels – types of combustion – temperature of combustion – calorific value.
6. మనచుట్టూ ఉన్న పదార్ధం – పదార్ధపు స్థితులు, పదార్ధాలు మరియు మిశ్రమాలు,
మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, దారాలు, దారాలలో రకాలు, ప్లాస్టిక్, ప్లాస్టిక్స్
లో రకాలు, ఉపయోగాలు మరియు పర్యావరణ కాలుష్యం
ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు,
తటస్థీకరణము, లోహాలు మరియు అలోహాలు, లోహాల యొక్క భౌతిక మరియు రసాయన ధరమాలు, బొగ్గు
మరియు పెట్రోలియం, దహనము మరియు ఇంధనాలు, దహనం రకాలు, జ్వలన ఉష్ణోగ్రత, కెలోరిఫిక్
విలువ
7. Laws
of Chemical Combination and Chemical Calculations: Physical change, chemical
change Laws of chemical combination, chemical reactions and calculations. Types
of chemical reactions.
7. రసాయన సంయోగం మరియు రసాయన సమీకరణాలకు సంబంధించిన నియమాలు, భౌతిక, రసాయన
మార్పులు, రసాయన సంయోగ నియమం, రసాయన చర్యలు మరియు గణనలు, రసాయన చర్యలలో రకాలు.
8.
Atomic Structure : Atoms and molecules – elements – atomicity – Dalton’s atomic
theory – Ions – atomic mass – valency – molecular mass – concept of mole –
molar mass – Thomson model of atom, Rutherford model of atom – Bohr’s model of
atom – atomic number – Isotopes – quantum numbers – electronic configuration.
8. పరమాణు నిర్మాణం – పరమాణువులు మరియు అణువులు, మూలకాలు, సంయోజకత, డాల్టన్
పరమాణు సిద్ధాంతం, అయాన్లు, పరమాణు ద్రవ్యరాశి, వాలన్సీ, అణు ద్రవ్యరాశి, మోల్
భావన, మోలార్ ద్రవ్యరాశి, థామ్సన్ పరమాణు నమూనా, రూథర్ ఫోర్డ్ పరమాణు నమూనా, బోర్
పరమాణు నమా, పరమాణు సంఖ్య, ఐసోటోప్స్, క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసం.
9.
Periodic classification and chemical bonding : Dobenier triads – Newlands law
of octave – Mendaliev’s periodic table – long form of periodic table – changes
of properties of elements in groups and periods.
Chemical
Bond – ionic bond – covalent bond – shapes of molecules – electron valency
theory –
properties
of ionic and covalent substances.
9. మూలకాల వర్గీకరణ మరియు రసాయన బంధం: డాబర్ నీర్ త్రికాలు,
న్యూలాండ్స్ అష్టక సిద్దాంతం, మెండలీవ్ ఆవర్తన పట్టిక, విస్తృత ఆవర్తన పట్టిక,
మూలకాల యొక్క ఆవర్తన ధర్మాలు గ్రూపులు మరియు పిరియడ్ లలో
రసాయన బంధం – అయానిక బంధం,
సంయోజనీయ బంధం, అణువుల యొక్క ఆకృతులు, ఎలక్ట్రాన్ వాలెన్సీ సిద్ధాంతం, అయానిక
మరియు సంయోజనీయ పదార్ధాల ధర్మాలు
10.
Metallurgy : Extraction of metals and steps – reactivity of metals and its role
in extraction of metals – various methods of extraction of metals.
10. లోహ సంగ్రహణ శాస్త్రం: లోహాలను సంగ్రహించుట మరియు దశలు, లోహాల యొక్క చర్యాశీలత,
లోహ సంగ్రహణలో చర్యాశీలత యొక్క పాత్ర, వివిధ లోహాలను సంగ్రహించే పద్ధతులు.
11.
Biology: Its importance in everyday life
11. బయాలజీ: విజ్ఞానశాస్త్రం యొక్క నిజజీవిత అనువర్తనాలు
12.
Living World - Characteristics: Classification of Plants and Animals and their
characteristics.
a)
Cell: Concept, Cell theory, differences between Plant cell and Animal cell,
Cell division.
b)
Tissues - Animal tissues.
12. సజీవ ప్రపంచం – ధర్మాలు – జీవుల (మొక్కలు మరియు జంతువుల) వర్గీకరణ
మరియు ధర్మాలు
కణము – భావన, కణ సిద్ధాంతం, వృక్ష
మరియు జంతు కణాల మధ్య భేదాలు, కణ విభజన
కణజాలము – జంతు కణజాలం
13.
Plant World - Types of plants: Parts of a plant - their functions – Reproduction
- Asexual, Sexual, Vegetative propagation, Nutrition, Photosynthesis,
Excretion, Respiration Economic importance of Plants, Agriculture, Crop
diseases & pest control measure.
13. వృక్ష ప్రపంచం – మొక్కలలో రకాలు, మొక్క యొక్క వివిధ భాగాలు, వాటి
విధులు, ప్రత్యుత్పత్తి, లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి, పోషణ, కిరణజన్య సంయోగ
క్రియ, విసర్జన మరియు శ్వాస వ్యవస్థలు
మొక్కల యొక్క ఆర్ధిక ప్రయోజనం,
వ్యవసాయం, పంటలలో తెగుళ్లు మరియు వాటి నివారణ పద్ధతులు
14. Animal
World: Movements, Organ systems and their functions including man – Digestive
system, Respiratory system, Circulatory system, Excretory system, Nervous
system, Reproductive system, Sense organs in man, Nutrition Deficiency diseases
in man, First Aid Economic importance of Animals, Animal husbandry, Pisciculture,
Sericulture.
14. జంతు ప్రపంచం – చలనాలు, జంతు, మానవ అవయవ వ్యవస్థలు మరియు వాటి
వినియోగం, జీర్ణ వ్యవస్థ, శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నాడీ
వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవునిలో జ్ఞానేంద్రియాలు, పోషణ మరియు న్యూనతా
వ్యాధులు, ప్రధమ చికిత్స, జంతువుల ఆర్ధిక ప్రయోజనం, జంతువుల సంరక్షణ, మత్స్య
సంవర్ధనం, సెరీ కల్చర్
15.
Microbes: Bacteria, Viruses, Fungi, Protozoan — useful and harmful, microbial
diseases in plants & animals
15. సూక్ష్మజీవులు – బాక్టీరియా, వైరస్, ఫంగీ మరియు ప్రోటోజోవన్లు –
హానికరమైన, హానికరం కాని సూక్ష్మజీవులు, మొక్కలు మరియు జంతువులలో సూక్ష్మజీవుల
వల్ల కలిగే వ్యాధులు.
16. Our
Environment: Biotic & Abiotic factors, Natural resources, Biodiversity.
16. మన పర్యావరణము – జైవిక మరియు అజైవిక కారకాలు, సహజ వనరులు, జీవవైవిధ్యం
17.
Recent trends in Biology: -Hybridization, Genetic engineering, Gene banks, Gene
therapy, Tissue culture
17. జీవశాస్త్రంలో నూతన పోకడలు – సంకరీకరణము, జెనెటిక్ ఇంజనీరింగ్, జీన్
బ్యాంక్, జీన్ థెరపీ, కణజాల వర్ధనము
తెలంగాణ టెట్ – సైన్స్ మెథడాలజీ సిలబస్ తెలుగులో (Telangana TET Science methodology Syllabus in Telugu)
1. Definition, Nature, Structure and History
of Science
2. Aims, Values , Instructional Objectives of
teaching Science and Academic Standards in Science
3. Methods of Teaching Science
4. Instructional Material in Teaching Science
- TLM in Science.
5. Instructional Planning
6. Science Laboratory
7. Science Teacher - Changing Roles
8. Science Curriculum and its transaction,
NCF-2005, SCF-2011
9. New Science Textbooks.
10. Evaluation - CCE – Formative Assessment ,
Summative Assessment - Designing and Administration- Analysis of Scholastic
Achievement Test (SAT)
1. పరిసరాల విజ్ఞానము
– ఆవశ్యకత, భావన మరియు పరిధి (సైన్స్ & సోషల్)
2. బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు (సైన్స్ & సోషల్)
3. విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు
4. విజ్ఞానశాస్త్రంలో బోధనా ఉపకరణాలు
5. ప్రణాళికా రచన
6. విజ్ఞానశాస్త్ర ప్రయోగశాల
7. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు – వివిధ పాత్రలు
8. విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, NCF–2005, SCF–2011
9. కొత్త పాఠ్యపుస్తకాలు
10. మూల్యాంకనము – సిసిఈ, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనం,
విద్యావిషయక సాధనా పరీక్ష నిర్మాణము, నిర్వహణ మరియు వ్యాఖ్యానము
అభ్యర్దులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం
అధికారికంగా విడుదల చేసిన సిలబస్ ను తెలుగులోకి అనువదించడం జరిగింది. మాకున్న
అవగాహన మేరకు ఈ అనువాదం జరిగింది. కొన్ని సందర్భాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలకు
బదులుగా, సమానార్ధకాలను వాడటం జరిగింది. అలాగే అతి కొద్ది పదాలకు తెలుగులో
సమానార్ధకాలు లభించనందున యధాతధంగా ఆంగ్లంలో రాయడం జరిగింది.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని
తెలియచేస్తున్నాము. అధికారిక సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ఫాలో అవుతూ
చదువుకోవలసిందిగా సూచించడమైనది
తెలంగాణ టెట్ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులను
దృష్టిలో ఉంచుకుని మొత్తం 70 రోజులలో సిలబస్ ను పూర్తి చేసేలా చక్కని షెడ్యూల్ తో పాటు
క్వాలిటీ ప్రశ్నలతో ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.
పూర్తి వివరాలకోసం TELANGANA TET అని 9640717460 కు వాట్సాప్ సందేశం
పంపండి
Useful
for the Aspirants Who are searching for ts tet syllabus paper 2 in telugu
medium | ts tet syllabus 2021 pdf | ts tet syllabus 2021 paper 2 in telugu | ts
tet syllabus 2022 pdf download | ts tet paper 2 syllabus pdf download |
Telangana tet syllabus 2022 in telugu medium pdf download | t stet | ts tet
syllabus in telugu medium