| About us | Contact us | Advertise with us

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper–1

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper–1            తెలంగాణ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయినది. తెలంగాణ టెట్ పరీక్షకు సిద్ధ... thumbnail 1 summary

తెలంగాణ టెట్ సిలబస్ తెలుగులో దొరుకుతుందా అని చాలా చోట్ల వెతికి ఉంటారు. కానీ దొరికే చోటు ఇక్కడ కనుక ఒకసారి ఈ పేజీని దర్శించి, పిడిఎఫ్ లో సిలబస్ పొందండి

Telangana TET 2022 Syllabus in Telugu – TS TET Paper–1

          తెలంగాణ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయినది. తెలంగాణ టెట్ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు అంతా ఇప్పుడు సిలబస్ ను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్ధులు తాము తెలుగు మీడియంలో చదవడం మూలంగా తెలంగాణ టెట్ – 2022 పేపర్-1 సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవడం కోసం వెతుకుతూ ఉంటారు.

          Telangana TET - 2022 notification has been released. All the candidates preparing for telangana TET exam are now trying to know the syllabus. Candidates, especially from rural areas, are looking for the Telangana TET - 2022 Paper-I syllabus to be downloaded in the form of PDF in Telugu as they are studying in Telugu medium.

ts tet paper 1 syllabus in telugu

          అటువంటి అభ్యర్ధులలో చాలా మంది ఆశ్రయించేది గూగుల్ తల్లినే. గూగుల్ సెర్చ్ ద్వారా Telangana TET Syllabus in Telugu అనో, TS TET Syllabus paper 1 in telugu medium అనో లేక TS TET syllabus in Telugu అనో టైప్ చేసి వెతకడం ప్రారంభిస్తారు. కానీ వచ్చే మొదటి పది . . . పదిహేను . . . ఇరవై వెబ్ సైట్ లలో ఎక్కడా జెన్యూన్ గా, పాఠ్యపుస్తకాలలో మాదిరి టైటిల్స్ తో సిలబస్ తెలుగులో కనిపించదు. కొన్ని వెబ్ సైట్ లలో TS TET Syllabus 2022 (PDF) అని పెట్టేసి ఏదేదో సోది రాస్తుంటారు. మరికొన్ని వెబ్ సైట్ లలో TS TET Syllabus 2022 అని పెట్టేసి అఫీషియల్ గా ఇంగ్లీష్ లో వచ్చిన సిలబస్ నే మార్చి మార్చి రాస్తుంటారు. మరికొందరు అయితే టైటిల్ చక్కగా TS TET Syllabus in Telugu అని పెడతారు. గూగుల్ ట్రాన్సిలేటర్ ఉపయోగించి సిలబస్ ను అనువదించేసి అక్కడ ఇచ్చేస్తుంటారు. వాళ్లు పెట్టే టైటిల్స్ మన పాఠ్యపుస్తకాలలో ఎక్కడా కనిపించవు.

          Most of such candidates are trying to ask Google Talli. Through Google search, they will start searching by typing Telangana TET Syllabus in Telugu, TS TET Syllables paper 1 in telugu medium or TS TET syllables in telugu. But the first . . . ten . . . fifteen... twenty websites they won’t find Genuine TS TET Syllabus in Telugu. Some websites have ts tet syllabus 2022 (PDF) as main title but write something which is not relevant to it. Some websites have ts tet syllabus 2022 and the put the syllabus which is released by the Educational Department. Others put the title as ts tet syllabus in telugu.. by using google translactar, the syllabus is translated and given there. It won’t match with textbook even one line.

          ఈ సమస్యలేవీ లేకుండా నవచైతన్య కాంపిటీషన్స్ నిష్ణాతులైన ఫ్యాకల్టీ టీమ్ తో కలిసి తెలంగాణ టెట్ 2022 పేపర్-1 సిలబస్ ను తెలుగులోకి అనువదించి పిడిఎఫ్ రూపంలో అందిస్తోంది. మన ఈ సిలబస్ లో టైటిల్స్ అన్నీ మీ పాఠ్యపుస్తకాలలో మీరు గమనించేవే . . . గుర్తుపట్టేవే. జెన్యూన్ గా తెలంగాణ టెట్ సిలబస్ ను ట్రాన్సిలేట్ చేసి మీకు అందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ గురించి మీ మిత్రులకు కూడా తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

          Without any of these problems, Nava Chaitanya Competitions along with an accomplished faculty team is translating the Telangana TET 2022 Paper-I syllabus into Telugu and providing it in pdf form. All the titles in this syllabus of ours are what you observe in your textbooks . . . Recognizable. We sincerely hope that you will also inform your friends about the Nava Chaitanya competitions offered to you by transilating the Telangana TET syllabus as a genuine.

ఇవి కూడా చూడండి . . . 

తెలంగాణ టెట్ పేపర్-1 గురించిన ప్రాధమిక విశేషాలు:

          టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అనేది B.Ed లేదా D.Ed పూర్తి చేసిన ప్రతి అభ్యర్ధి DSC/TRT పరీక్షను రాయడానికంటే ముందు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన పరీక్ష. తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సహజంగా DSC / TRT నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే 24.03.2022 న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం – ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది.

The basics of Telangana TET Paper-I are:

          Teachers' Eability Test (TET) is a test that every candidate who has completed B.Ed or D.Ed must qualify before writing the DSC/TRT exam. Telangana Government – Educational Department they have to conduct TET exam twice every year. But naturally before going to conduct DSC/TRT Telangana TET exam before issuing the notification. In this context, the Telangana TET notification was released by the Telangana Government - Educational Department on 24.03.2022 .

తెలంగాణ టెట్ పేపర్-1 పరీక్షను రాయడానికి ఎవరు అర్హులు?

          ఎవరైతే B.Ed లేదా D.Ed పూర్తి చేసి, ప్రాధమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని భావిస్తారో, వారు తెలంగాణ టెట్ పేపర్-1 రాయడానికి అర్హులు. B.Ed లేదా D.Ed చివరి సంవత్సరం చదువుతూ ఉన్న అభ్యర్ధులు కూడా తెలంగాణ టెట్ రాయడానికి అర్హులే అని తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.

Who is eligible to write Telangana TET Paper-I exam?

          Those who completed their B.Ed or D.Ed and take up the teaching profession of classes 1 to 5 in primary schools are eligible to write Telangana TET Paper-I. The Telangana TET notification stated that candidates who are studying B.Ed or D.Ed in the last year are also eligible to write telangana TET.

తెలంగాణ టెట్ పేపర్-1 పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది?

          తెలంగాణ టెట్ పేపర్-1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు గానూ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు అభ్యర్ధులు రెండున్నర గంటలలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. కానీ ఈ తెలంగాణ టెట్ పేపర్-1 లో అభ్యర్ధి సాధించిన మార్కుల ఆధారంగా DSC/TRT పరీక్షలో వెయిటేజి ఇవ్వబడుతుంది. కనుక అభ్యర్ధులు తెలంగాణ టెట్ ను సీరియస్ గా తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు.

పరీక్ష స్వరూపాన్ని గమనించినపుడు తెలంగాణ టెట్ పేపర్-1 పరీక్ష మొత్తంగా ఐదు సెక్షన్లుగా విభజించబడి ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్ గా అభ్యర్ధులు సాధించిన మార్కుల ఆధారంగా క్వాలిఫికేషన్ నిర్ణయించడం జరుగుతుంది.

          1. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ

          2. మొదటి లాంగ్వేజ్ (తెలుగు లేదా ఇతర భాషలు)

          3. రెండవ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

          4. గణితము కంటెంట్ మరియు మెథడాలజీ

          5. పరిసరాల విజ్ఞానము కంటెంట్ మరియు మెథడాలజీ

What will be the nature of Telangana TET Paper-I exam?

          The Telangana TET Paper-I exam will be conducted with purely objective questions. Candidates will have to identify answers to 150 multiple choice questions of 150 marks in two-and-a-half hours. There is no negative marking. But weightage will be given in DSC/TRT exam based on the marks obtained by the candidate in this Telangana TET Paper-1. So, the candidates take Telangana TET seriously and prepare.

The Telangana TET Paper-I examination is divided into five sections. 30 marks will be allotted with 30 multiple choice questions from each section and the qualification will be decided on the basis of marks obtained by the candidates overall.

          1. Child Development and Pedgagee

          2. First language (Telugu or other languages)

          3. Second Language (English)

          4. Mathematics Content and Methodology

          5. Environmental Science Content and Methodology

తెలంగాణ టెట్ – పేపర్-1 సిలబస్ తెలుగులో పిడిఎఫ్ రూపంలో

          తెలంగాణ టెట్ పేపర్-1 సిలబస్ ను పాఠ్యపుస్తకాలలోని టైటిల్స్ ఆధారంగా చేసుకుని దాదాపుగా పాఠ్యపుస్తకాలతో ఏకీభవించేలా సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందించడం జరుగుతున్నది. క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా తెలంగాణ టెట్ పేపర్-1 సిలబస్ ను తెలుగులో పిడిఎఫ్ రూపంలో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ts tet paper 1 syllabus in telugu

ఇవి కూడా చూడండి

1. తెలంగాణ టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో

2. తెలంగాణ టెట్ పేపర్-2 (గణితము/సైన్స్) సిలబస్ తెలుగులో

3. తెలంగాణ టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) సిలబస్ తెలుగులో

4. తెలంగాణ టెట్ 2022 నోటిఫికేషన్ వివరాలు తెలుగులో


Telangana TET - Paper-1 Syllabus in the form of PDF in Telugu

          The Telangana TET Paper-1 syllabus is being translated into Telugu and provided to almost agree with the textbooks based on the titles in the textbooks. You can download the Telangana TET Paper-1 syllabus directly in the form of PDF in Telugu by clicking on the link below.

తెలంగాణ టెట్ – చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ సిలబస్ తెలుగులో (Telangana TET Chaild Development and Pedagogy Syllabus in Telugu)

1. DEVELOPMENT OF CHILD

- Development, Growth & Maturation - Concept & Nature

- Principles of Development & their educational implications

- Factors influencing Development - Biological, Psychological, Sociological

- Dimensions of Development and their interrelationships - Physical & Motor, Cognitive, Emotional, Social, Moral, Language relating to Infancy, early Childhood, late Child hood, Adolescence.

- Understanding Development - Piaget, Kohlberg, Chomsky, Carl Rogers and Erikson

- Individual differences - Intra & Inter Individual differences in the areas of Attitudes, Aptitude, Interest, Habits, Thinking (Divergent & Convergent), Intelligence and their Assessment

- Development of Personality - Concept, Factors effecting development of Personality, Child Rearing

 Practices, Self-Concept

- Adjustment, Behavioral problems, Defense Mechanisms, Mental Health

- Methods and Approaches of Child Development – Introspection, Observation, Interview, Case study,

Experimental, Rating Scales, Anecdotal Records, Questionnaire, Cross sectional and Longitudinal

- Developmental tasks and Hazards

1. పెరుగుదల వికాసం

- పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము

- వికాస నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము

- వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు

- వికాసంలోని అంశాలు – భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం

- వివిధ దశలలో వికాసం – శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ, వయోజన దశ

- శిశు వికాస అవగాహన – పియాజీ, కోల్బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ సన్ – సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం, ఆత్మభావనా సిద్ధాంతం, మనో సాంఘిక వికాస సిద్ధాంతం

- వైయుక్తిక భేదాలు – ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ఆలోచన

- మూర్తిమత్వ వికాసం – భావన, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్దాంతాల, మనోలైంగిక వికాస సిద్ధాంతం

- సర్ధుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు

- శిశు వికాస అధ్యయన పద్ధతులు

- వికాసృత్యాలు – ఆటంకాలు

2. UNDERSTANDING LEARNING

- Concept, Nature of Learning - Input - Process - Outcome

- Factors of Learning - Personal and Environmental

- Approaches to Learning and their applicability - Behaviorism (Skinner, Pavlov, Thorndike), Constructivism (Piaget, Vygotsky), Gestalt (Kohler, Koffka) and Observational (Bandura)

- Dimensions of Learning - Cognitive, Affective and Performance

- Motivation and Sustenance -its role in learning.

- Memory & Forgetting

- Transfer of Learning

2. అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం

- అభ్యసనం – భావన – స్వభావం – లక్షనాలు – రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు

- అభ్యసనా సిద్ధాంతాలు – ప్రవర్తనా వాదం, నిర్మాణాత్మక వాదం, గెస్టాల్ట్ వాదం మరియు పరిశీలనా వాదం – ధార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం, పావలోవ్ శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనా సిద్ధాంతం, వైగోట్ స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం, కోహెలర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, బందూరా పరిశీలనా సిద్దాంతం

- అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*

- అభ్యసనములో ప్రేరణ పాత్ర

- స్మృతి – విస్మృతి

- అభ్యసనా బదలాయింపు, అభ్యసనా బదలాయింపు సిద్దాంతాలు, అభ్యసనా వక్రాలు

3. PEDAGOGICAL CONCERNS

- Teaching and its relationship with learning and learner

- Learners in Contexts: Situating learner in the socio-political and cultural context

- Children from diverse contexts - Children With Special Needs (CWSN), Inclusive Education

- Understanding of Pedagogic methods - Enquiry based learning, Project based learning, Survey, Observation and Activity based learning, Co-operative & Collaborative learning

- Individual and Group learning: Issues and concerns with respect to organizing learning in class room like Study habits, Self learning and Learning to learn skills

- Organizing learning in heterogeneous class room groups - Socio-economic background, Abilities and Interest

- Paradigms of organizing Learning - Teacher centric, Subject centric and Learner centric

- Theory of Instruction - Bruner

- Teaching as Planned activity - Elements of Planning

- Phases of Teaching - Pre active, Interactive and Post active

- General and Subject related skills, competencies required in teaching and attributes of good facilitator

- Learning resources - Self, Home, School, Play, Community, Technology

- Class room Management: Role of student, teacher, Leadership style of teacher, Creation of non-threatening learning environment, Managing behavior problems, Guidance & Counseling, Child Abuse, Punishment and its legal implications, Rights of a child, Time Management.

- Distinction between Assessment for Learning & Assessment of Learning, School based Assessment, Continuous & Comprehensive Evaluation : Perspective & Practice

- Understanding teaching & learning in the context of NCF, 2005 & Right To Education Act, 2009.

3. బోధనా శాస్త్ర అవగాహన

- బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం

- విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య

- బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన

- వైయుక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనము

- తరగతి గది సమూహము – నాయకత్వం

- వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు,

- బోధనా ప్రణాళ, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన

- బోధనలోని దశలు – హెర్బార్ట్ సోపానాలు

- సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు

- తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం – మంత్రణం

- అభ్యసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం

- విద్యా హక్కు చట్టం – 2009, బాలల హక్కులు

- జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005

తెలంగాణ టెట్ – లాంగ్వేజ్ - 1 తెలుగు సిలబస్ (Telangana TET – First Language Telugu Syllabus)

1. పఠనావగాహన

   ఎ. అపరిచిత పద్యం

   బి. అపరిచిత గద్యం

2. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) – 2015 లో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఆధారంగా

   ఎ. తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు

   బి) ప్రక్రియలు

   సి) శతకాలు

   డి) కళలు, కళాకారులు

   ఇ) వేడుకలు

   ఎఫ్) క్రీడలు/పాటలు

3. పదజాలం

   ఎ) సామెతలు

   బి) జాతీయాలు

   సి) పొడుపు కథలు

   డి) తెలంగాణ పదజాలం

   ఇ) అర్ధాలు

   ఎఫ్) నానార్ధాలు

   జి) పర్యాయ పదాలు

   హెచ్) వ్యుత్పత్యర్ధాలు

   ఐ) ప్రకృతి వికృతులు

4. భాషాంశాలు

   ఎ. భాషాభాగాలు, క్రియలు (సమాపక, అసమాపక క్రియలు)

   బి. కాలాలు, విభక్తులు

   సి. లింగాలు

   డి. విరామ చిహ్నాలు

   ఇ. వచనాలు

   ఎఫ్. పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, దృత ప్రకృతికములు)

   జి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)

   హెచ్. సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాన పదాలుగా కూర్చడం)

   ఐ. ఛందస్సు – గురు, లఘువులను గుర్తించడం

   జె. అలంకారాలు –

   కె. వాక్యాలు – రకాలు - ఆశ్చర్యార్ధక, విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్ధక, అనుమత్యర్ధక, నిషేధార్ధక వాక్యాలు – ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మణి వాక్యాలు – సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం

   ఎల్) అర్థవిపరిణామం

తెలంగాణ టెట్ – తెలుగు మెథడాలజీ సిలబస్ (Telangana TET Telugu methodology Syllabus)

ఎ. భాష – మాతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు

బి. భాష – వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం

సి. భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్ధ్యాలు, తరగతి గది అన్వయం

డి. బోధనా పద్ధతులు

ఇ. ప్రణాళికా రచన – వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం

ఎఫ్.. బోధనాభ్యసన ఉపకరణాలు

జి. మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)

గమనిక: అభ్యర్ధులు తాము చదివిన మాధ్యమాన్ని బట్టి, పదవ తరగతి స్థాయిలో తాము ఎంచుకున్న ఆప్షనల్ లాంగ్వేజ్ ను బట్టి తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతంలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఇవ్వబడుతుంది. ఆయా లాంగ్వేజ్ లకు సంబంధించిన సిలబస్ ను నేరుగా అధికారిక వెబ్ సైట్ http://tstet.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోగలరు.

తెలంగాణ టెట్ – లాంగ్వేజ్-2 – ఇంగ్లీష్ సిలబస్ (TS TET Second Language English Syllabus)

1. Parts of Speech

2. Tenses

3. Types of Sentences

4. Prepositions

5. Articles

6. Degrees of Comparison

7. Direct and Indirect Speech

8. Questions and question tags

9. Active & Passive Voice

10. Use of Phrases

11. Comprehension

12. Composition

13. Vocabulary (Synonyms, Antonyms, Spelling test)

14. Meaning of Idiomatic expressions

15. Correction of sentences

16. Sequencing of the Sentences in the given paragraph

17. Error identification within a sentence

తెలంగాణ టెట్ – ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ (TS TET English Methodology Syllabus)

1. Aspects of English:- (a) English language - History, nature, importance, principles of English as second language (b) Problems of teaching / learning English.

2. Objectives of Teaching English

3. Phonetics

4. Development of Language skills:- a Listening, Speaking, Reading & Writing (LSRW). b) Communicative skills

5. Approaches, Methods and Techniques of teaching English (Introduction, Definition, Types of approaches, methods and techniques of teaching including remidial teaching)

6. Teaching of structures, Vocabulary and Grammar

7. Teaching Learning materials in English

8. Lesson Planning

9. Curriculum and Text books – Importance and need.

10. Evaluation in English Language

తెలంగాణ టెట్ – గణితము కంటెంట్ డీటెయిల్డ్ సిలబస్ తెలుగులో (Telangana TET Mathematics Content Syllabus in Telugu)

1. Number System: Natural Numbers, Whole Numbers, Integers, Rational Numbers & their fundamental operations (addition, subtraction, multiplication and division). Primes Composite Numbers, CoPrimes, Twin Primes, Relational ship between LCM & GCM, Indian currency, Representation of Natural, Whole, integers and rational numbers on a number line. Terminating and Nonterminating but recurring decimals, square, square root, cube, cube roots of numbers, Pythagorean triplets. Applications on number system

1) సంఖ్యామానము – సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు – సంఖ్యలు వాటి చతుర్విద ప్రక్రియలు (కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగాహారం), ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, కసాగు, గసాభా, వాని మధ్య సంబంధము, భారతీయ ద్రవ్యమానము, సంఖ్యారేఖపై సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలను ప్రదర్శించడం, అంతమయ్యే, అంతంకాని దశాంశ భిన్నాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, పైథాగోరియన్ త్రికాలు, సంఖ్యామానము యొక్క అనువర్తనములు.

2. Fractions: Concept of Fractions, Proper Fractions, Improper Fractions, Mixed Fractions, Decimal Fractions, Comparison, Fundamental operations on fractions (addition, subtraction, multiplication and division), Representation of a fraction in pictorial form and on a number line, reciprocal of fraction, uses of fractions in daily life

2) భిన్నములు: భిన్నాలు భావన, క్రమ, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు, దశాంశ భిన్నాలు, భిన్నములను పోల్చుట, భిన్నములపై చతుర్విద ప్రక్రియలు, భిన్నములను చిత్ర రూపంలో ప్రదర్శించుట, భిన్నములను సంఖ్యారేఖపై ప్రదర్శించుట, వ్యుత్క్రమ భిన్నము, భిన్నముల నిజజీవిత అనువర్తనములు

3. Arithmetic: Unitary method, percentages, profit and loss, ratio and proportion, direct proportion,

discount, simple interest, compound interest, time and work, time and distance, tax (Vat).

3) అరిథ్ మెటిక్: ఏకవస్తు పద్ధతి, శాతములు, లాభము మరియు నష్టము, నిష్పత్తి మరియు అనుపాతము, అనులోమాను పాతము, రుసుములు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, కాలము మరియు పని, కాలము మరియు దూరము, పన్నులు (VAT)

4. Geometry: Basic idea of geometry (2D & 3D shapes), types of angles, construction and measurement of angles, types of angles, lines, triangles, types of triangles, quadrilaterals, types of quadrilaterals, congruence, property of congruencies of triangles (SAS, SSS, ASA, RHS), construction of triangles and quadrilaterals, patterns with geometrical shapes, representing 3D Shapes into 2D Shapes, Euler’s relation, Properties of triangles, parallelogram, trapezium, Rhombus, Rectangle, Square and Kite, Concept of Circles, Symmetry.

4) రేఖాగణితము: ద్విమితీయ, త్రిమితీయ ఆకారాలపై ప్రాధమిక అవగాహన, కోణములలో రకాలు, కోణములను నిర్మించుట మరియు కొలుచుట, రేఖలు, కోణములు, త్రిభుజాలు, త్రిభుజాలలో రకాలు, చతుర్భుజాలు, చతుర్భుజాలలో రకాలు, సర్వసమానత్వం, త్రిభుజ సమానత్వ నియమాలు త్రిభుజాలు మరియు చతుర్భుజాల నిర్మాణం, జ్యామితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలను ద్విమితీయంగా చూపుట, యూలర్ సంబంధాలు, త్రిభుజాలలో రకాలు, సమాంతర చతుర్భుజము, సమలంబ చతుర్భుజము, రాంబస్, దీర్ఘచతురస్రము, చతురస్రము, గాలిపటము, వృత్తము – ప్రాధమిక అవగాహన, సౌష్టవము

5. Measurements: Length, Weight, Capacity, Time and their Standard Units, Surface Area and volume of a cube and a cuboids, perimeter and area of triangle, quadrilateral, parallelogram, rectangle, Rhombus, Square and Trapezium. Circumference of a circle, Area of Circle, Circular paths, other polygons and sector in a circle.

5) కొలతలు: పొడవు, బరువు, ఘనపరిమాణము, సమయం, మూలప్రమాణాలు, సమఘనం, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణములు, త్రిభుజము, చతుర్భుజము, సమాంతర చతర్భుజము, దీర్ఘచతురస్రము, రాంబస్, చతురస్రం మరియు ట్రెపీజియంల యొక్క చుట్టుకొలతలు, వైశాల్యములు, వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్త వైశాల్యం, వృత్తములలో భాగాలు, జ్యా మరియు స్పర్శరేఖలు.

6. Data Applications: Introduction to Data, Data Presentation, Preparation of Frequency distribution table, Bar Graph, Pictograph, Histogram, Mean, Median and Mode of ungrouped data, determination of Mean by deviation method, Cumulative Frequency Distribution Table, Frequency Polygon, Frequency Curve and Cumulative Frequency Curves.

6) దత్తాంశ విశ్లేషణ: దత్తాంశము పరిచయం, దత్తాంశమును ప్రదర్శించుట, పౌనఃపున్య విభాజన పట్టికలను తయారుచేయడం, బార్ గ్రాఫ్, పటచిత్రాలు, సోపాన చిత్రాలు, కమ్మీ చిత్రాలు, అవర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతం మరియు బాహుళకము, విచలన పద్ధతిలో అంకమధ్యమం, సంచిత పౌనఃపున్య విభాజన పట్టికలు, పౌనఃపున్య వక్రాలు, సంచిత పౌనఃపున్య వక్రాలు

7. Algebra: Introduction to Algebra, Simple equations, solving linear equation in one variable, exponents and powers, Algebric expressions, Addition, Subtraction, Multiplication, Division and Factorisation of algebric expressions, algebric identities.

7) బీజగణితం: పరిచయం, సామాన్య సమీకరణాలు, ఒక చరరాశితో కూడిన రేఖీయ సమీకరణాల సాధన, ఎక్పోనెన్షియల్స్, పవర్స్, బీజీయ సమాసాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు మరియు భాగాహారాలు, కారణాంకాలుగా విభజన

తెలంగాణ టెట్ – గణితము మెథడాలజీ సిలబస్ తెలుగులో (TS TET Maths Methodology Syllabus in Telugu)

1. Definitions and Nature of Mathematics

2. Aims, values , instructional objectives and Academic Standards of teaching Mathematics

3. Methods of Teaching Mathematics

4. Instructional material in Mathematics - TLM in Mathematics

5. Instructional Planning

6. Designing, Administration, Analysis of scholastic Achievement test (SAT)

7. The Mathematics Teacher

8. Resource Utilization

9. Curriculum and Text Book

10. Diagnostic and Remedial Teaching

1. గణితము – భావన మరియు స్వభావం

2. గణితము యొక్క బోధనా గమ్యాలు, విలువలు, లక్ష్యాలు స్పష్టీకరణములు మరియు విద్యా ప్రమాణాలు

3. గణిత బోధనా పద్ధతుల

4. గణితంలో బోధనా వనరులు, బోధనాభ్యసనా పరికరాల వినియోగం

5. ప్రణాళికాబద్ధమైన కార్యంగా బోధన

6. సాధనా నికషను తయారుచేయడం, నిర్వహించడం మరియు విశ్లేషించడం

7. గణిత ఉపాధ్యాయుడు

8. వనరుల వినియోగం

9. విద్యా ప్రణాళికా మరియు పాఠ్యపుస్తకం

10. మూల్యాంకనము మరియు రెమెడియల్ బోధన

తెలంగాణ టెట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సిలబస్ తెలుగులో (Telangana TET Environmental Sciences Syllabus in Telugu)

1. My Family - My Family - Family tree, migration, changing structures of family -nuclear and joint families, festivals.

1. నా కుటుంబం – నా కుటుంబం, వంశ వృక్షము, వలసలు, కుటుంబంలో మార్పులు, వ్యక్తిగత మరియు సమిష్టి కుటుంబాలు, పండుగలు

2. Work & Play - Occupations, Child labor, Games - Local, National and International, Marshal Arts, Effects of games on respiration and breathing, fairs, Circus.

2. పని మరియు ఆటలు – వృత్తులు, బాల కార్మికులు, ఆటలు – స్థానికం, జాతీయం మరియు అంతర్జాతీయం, మార్షల్ ఆర్ట్స్, శ్వాసవ్యవస్థ మరియు గాలి పీల్చుకోవడంపై ఆటల యొక్క ప్రభావం, ఫెయిర్లు మరియు సర్కస్

3. Plants and Animals-Plants & animals in our surroundings, Plant & Animal products, parts of a plant, photosynthesis, parts of a flower, pollination, fertilization, fruits, seeds. Wild & cultivated plants, wild & domestic animals their food, arrangement of teeth in animals.

3. మొక్కలు మరియు జంతువులు – మన పరిసరాలలోని మొక్కలు మరియు జంతువులు, మొక్కల మరియు జంతువుల ఉత్పత్తులు, మొక్కలోని భాగాలు, కిరణజన్య సంయోగక్రియ, పుష్పంలోని భాగాలు, ప్రత్యుత్పత్తి, పరాగసంపర్కం, ఫలాలు మరియు విత్తనాలు, వన్యజాతి, పెంపుడు మొక్కలు, వన్యజాతి మరియు పెంపుడు జంతువులు వాటి ఆహారం, జంతువులలో దంతవిన్యాసం

4. Our Food - Different types of food, storage of grains and vegetables, storage of food, Food - animal husbandry, Nutrients of food, deficiency diseases.

4. మన ఆహారం – ఆహారంలోని రకాలు, ధాన్యాలు మరియు కూరగాయలను నిల్వ చేసే పద్ధతులు, ఆహారాన్ని నిల్వ చేయడం, జంతువుల నుంచి లభించే ఆహారం, ఆహారంలోని పోషకాలు, న్యూనతా వ్యాధులు

5. Shelter - Need, different types of houses, electrical appliances - their use, social life in ants and honey bees, Animals shelter - variation.

5. ఆవాసం – ఆవశ్యకత, ఇళ్లలో రకాలు, విద్యుత్ ఉపకరణాలు – వాటి ఉపయోగం, చీమలు మరియు తేనెటీగల యొక్క సామాజిక జీవనం, జంతువుల ఆవాసం – వైవిధ్యత

6. Air - Importance of air, composition of air, atmospheric pressure, diseases spread through air and their prevention, air pollution - causes, its impact, and measures to prevent, Green House effect.

6. గాలి – ఆవశ్యకత, సంఘటనము, వాతావరణ పీడనము, గాలిద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు, నియంత్రణ, గాలి కాలుష్యం, దాని ప్రభావాలు, నియంత్రించే పద్దతులు, హరితగృహ ప్రభావం

7. Energy – Renewable, Non-renewable, Future Energy.

7. శక్తి – పునరుత్పాదక, పునరుత్పాదకం కాని శక్తి వనరులు, భవిష్యత్ శక్తి వనరులు

8. Water - Importance, water resources, tanks, aquatic flora and fauna, measurement of liquids, Water pollution - causes, impact, measures to prevent, purification of water, drought, floods.

8. నీరు – ఆవశ్యకత, నీటి వనరులు, చెరువులు, ద్రవాలను కొలిచే పద్ధతులు, నీటి కాలుష్యం, దాని ప్రభావాలు, నియంత్రించే పద్ధతులు, నీటిని శుద్ధి చేయడం, వరదలు మరియు కరువు

9. Our Body - Health - Cleanliness - External, Internal parts of our body, Bones, Muscles, Sense organs, Digestion, Respiration, Nervous system, Excretory system, Circulatory system, First Aid.

9. మానవ శరీరం – ఆరోగ్యం మరియు పరిశుభ్రత – బాహ్య మరియు అంతర్గత అవయవాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ మరియు ప్రధమచికిత్స

10. Mapping - Direction, Mandal, District, State, India

10. పటాలు (మ్యాపింగ్) – దిక్కులు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, భారతదేశము

11. History and culture of India - Evolution of Man, Pre-historic period, Indian culture and Heritage, Civilization, Medieval period culture, Ancient monuments, Religious movements: Jainism, Buddhism, Bhakti movement, Great personalities, Indian freedom movement, Modern India.

11. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి – మానవ పరిణామక్రమము, పూర్వ చారిత్రక యుగము, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి వారసత్వం, నాగరికతలు, మధ్యయుగంనాటి సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, మత ఉద్యమాలు, జైన, బౌద్ధ మతాలు, భక్తి ఉద్యమాలు, ప్రముఖ వ్యక్తులు, భారత స్వాతంత్ర్య పోరాటం, ఆధునిక భారతదేశం

12. Our country (India) - Location, Area, Physical features, Climate, Natural resources, Continents and Oceans, Historical places in India, Population.

12. మన దేశం (భారతదేశం) – ఉనికి మరియు విస్తరణ, ప్రధాన భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, సహజ వనరులు, ఖండాలు మరియు మహాసముద్రాలు, చారిత్రక ప్రదేశాలు, జనాభా విస్తరణ

13. Our state (Telangana) - Culture, State Government, Gram Panchayat, Mandal Parishad, Municipality, Municipal Corporation, Local Emergency services, our state symbols, Livelihood, Civilization - Impact of rivers.

13. మన రాష్ట్రం (తెలంగాణ) – సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయితీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ మరియు స్థానిక అత్యవసర సేవలు, రాష్ట్ర చిహ్నాలు, నాగరికతపై నదుల యొక్క ప్రభావం.

14. Indian constitution – Preamble, Major concepts, Fundamental rights, Fundamental duties, Child Rights

14. భారత రాజ్యాంగం – ముఖ్యాంశాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాధమిక హక్కులు, బాలల హక్కులు

15. Security – Earth Quakes, Floods, Fire, First Aid, 108, 104 Vehicles

15. రక్షణ – భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, 108, 104 సేవలు

తెలంగాణ టెట్ – సైన్స్/సోషల్ మెథడాలజీ సిలబస్ తెలుగులో (Telangana TET Science/ Social methodology Syllabus in Telugu)

1. Concept and scope of Environmental Studies (Science & Social Studies)

2. Aims & Objectives of teaching Environmental Studies (Science & Social Studies)

3. Relation to Science and Social Studies

4. Curriculum and its transaction

5. CCE

6. Learning Environment

1. పరిసరాల విజ్ఞానము – ఆవశ్యకత, భావన మరియు పరిధి (సైన్స్ & సోషల్)

2. బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు (సైన్స్ & సోషల్)

3. సైన్స్ మరియు సోషల్ సంబంధము

4. విద్యా ప్రణాళిక

5. నిరంతర సమగ్ర మూల్యాంకనం

6. అభ్యసనా వాతావరణము

అభ్యర్దులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సిలబస్ ను తెలుగులోకి అనువదించడం జరిగింది. మాకున్న అవగాహన మేరకు ఈ అనువాదం జరిగింది. కొన్ని సందర్భాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలకు బదులుగా, సమానార్ధకాలను వాడటం జరిగింది. అలాగే అతి కొద్ది పదాలకు తెలుగులో సమానార్ధకాలు లభించనందున యధాతధంగా ఆంగ్లంలో రాయడం జరిగింది.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని తెలియచేస్తున్నాము. అధికారిక సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ఫాలో అవుతూ చదువుకోవలసిందిగా సూచించడమైనది

 తెలంగాణ టెట్ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని మొత్తం 70 రోజులలో సిలబస్ ను పూర్తి చేసేలా చక్కని షెడ్యూల్ తో పాటు క్వాలిటీ ప్రశ్నలతో ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

పూర్తి వివరాలకోసం TELANGANA TET అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి

 

Useful for the Aspirants Who are searching for ts tet syllabus paper 1 in telugu medium | ts tet syllabus 2021 pdf | ts tet syllabus 2021 paper 1 in telugu | ts tet syllabus 2022 pdf download | ts tet paper 1 syllabus pdf download | Telangana tet syllabus 2022 in telugu medium pdf download | t stet | ts tet syllabus in telugu medium

 






exams.navachaitanya.net